కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక అర్జున అవార్డుల విజేతలను ప్రకటించింది. 2025 సంవత్సరానికి గానూ పదిహేడు మంది అథ్లెట్లు ఈ పురస్కారం గెలుచుకున్నట్లు మంగళవారం వెల్లడించింది. అయితే, అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును మాత్రం ఈసారి ఎవరికీ ప్రకటించలేదు.
కాగా 2024లో మనూ భాకర్ (షూటింగ్), డి గుకేశ్ (చెస్), హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెటిక్స్) ఖేల్‌రత్న అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తెలంగాణ నుంచి షూటర్ ధనుష్ శ్రీకాంత్ , షట్లర్ గాయత్రి గోపీచంద్‌ను అర్జున అవార్డు వరించింది.
అర్జున అవార్డుల విజేతలు వీరే
తేజస్విని శంకర్- అథ్లెటిక్స్
ముహమ్మద్ అజ్మల్ వి- అథ్లెటిక్స్
ప్రియాంక గోస్వామి-అథ్లెటిక్స్
ట్రెసా జాలి- బ్యాడ్మింటన్
గాయత్రి గోపీచంద్- బ్యాడ్మింటన్
నరేంద్ర బేర్వాల్- బాక్సింగ్
విదిత్ సంతోష్ గుజరాతి- చెస్
దివ్య దేశ్‌ముఖ్- చెస్
ధనుష్ శ్రీకాంత్- డెఫ్ షూటింగ్
లాల్‌రేస్మియామి- హాకీ
రాజ్‌కుమార్ పాల్- హాకీ
సుజీత్- కబడ్డి
పూజ: కబడ్డి
రుద్రాంశ్ ఖండేల్వాల్- పారా షూటింగ్
ఏక్తా భయాన్- పారా అథ్లెటిక్స్
అర్వింద్ సింగ్- రోయింగ్
అఖిల్ షియోరన్- షూటింగ్
అర్జున అవార్డు (లైఫ్‌టైమ్)-2025
అరుమైనాయగం- ఫుట్‌బాల్
ద్రోణాచార్య అవార్డు 2025- రెగ్యులర్ కేటగిరి
పర్వీర్ సింగ్- అథ్లెటిక్స్
చోటే లాల్ యాదవ్- బాక్సింగ్
నేహా నందకుమార్ చవాన్- షూటింగ్
ద్రోణాచార్య అవార్డు లైఫ్‌టైమ్ కేటగిరి
ధర్మేంద్ర సింగ్ యాదవ్- బాక్సింగ్
వీరేందర్ కుమార్- రెజ్లింగ్
రాష్ట్రీయ క్రీడా ప్రోత్సాహక పురస్కార్
ఆర్మీ పారాలింపిక్ నోడ్, పూణే- స్పోర్ట్స్ ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్


