జురెల్ సెంచ‌రీ.. ఆకాశ్ దీప్ అర్థ‌సెంచ‌రీ; భారత్ భారీ స్కోరు | Jurel Century-Akashdeep-Fifty-INDA-346-All-Out Vs NZA-Unofficial Test | Sakshi
Sakshi News home page

జురెల్ సెంచ‌రీ.. ఆకాశ్ దీప్ అర్థ‌సెంచ‌రీ; భారత్ భారీ స్కోరు

Nov 1 2026 7:09 AM | Updated on Nov 1 2026 7:19 AM

Jurel Century-Akashdeep-Fifty-INDA-346-All-Out Vs NZA-Unofficial Test

Photo Credit: Twitter

క్రైస్ట్‌చ‌ర్చి వేదికగా న్యూజిలాండ్‌-ఏ జ‌రుగుతున్న రెండో అన‌ధికారిక టెస్టులో ఇండియా-ఏ కెప్టెన్ ధ్రువ్ జురెల్ (171 బంతుల్లో 105) సెంచ‌రీతో మెరవ‌గా, బౌల‌ర్ ఆకాశ్‌దీప్ (116 బంతుల్లో 68) అర్థ‌సెంచ‌రీతో రాణించాడు. ఫ‌లితంగా భారత్ త‌మ‌ తొలి ఇన్నింగ్స్‌లో 346 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 

291-7 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన భార‌త జ‌ట్టు మ‌రో 55 ప‌రుగులు జోడించి ఇన్నింగ్స్ ముగించింది. జురెల్‌, ఆకాశ్ దీప్ క‌లిసి ఎనిమిదో వికెట్‌కు 75 ప‌రుగులు జోడించారు. అయితే సెంచ‌రీ చేసిన వెంట‌నే జురెల్ ఔట‌వ్వ‌గా, ఆకాశ్ దీప్ మాత్రం నిల‌క‌డ‌గా బ్యాటింగ్ కొన‌సాగించాడు. 

ఈ క్ర‌మంలో అర్థ‌సెంచ‌రీ పూర్తి చేసుకున్న ఆకాశ్ దీప్ 68 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద చివ‌రి వికెట్‌గా వెనుదిరిగాడు. అంత‌క‌ముందు దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ (80) భారీ హాఫ్ సెంచ‌రీ సాధించగా, సాయి సుద‌ర్శ‌న్ (41) రాణించాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో ఫ్రేస‌ర్ షీట్ 4 వికెట్ల‌తో చెల‌రేగ‌గా, బ్రెట్ రాండెల్, జ‌ర్రోడ్ మెక్‌కే చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. 

అనంత‌రం త‌మ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ 18 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 63 ప‌రుగులు చేసింది. మాథ్యూ బోలే (26), డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (20) క్రీజులో ఉన్నారు. ముకేశ్ కుమార్ రెండు వికెట్ల‌తో చెల‌రేగ‌గా, సిరాజ్ ఒక వికెట్ తీశాడు.

ఇదీ చదవండి: NZ Vs IND: విజయంతో ముగించేదెవరో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement