NZ Vs IND 5th T20I Match Updates:
హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్, టీమిండియా మధ్య ఐదో టీ20 ప్రారంభమయ్యింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో టాస్‌లు గెలిచిన టీమిండియా చివరి టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ఆడుతోంది.
ముగిసిన పవర్ ప్లే
పవర్ ప్లే (0-6 ఓవర్లు) ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (30), శ్రేయస్ అయ్యర్ (17) క్రీజులో ఉన్నారు.
నిరాశపరిచిన సామ్సన్
మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ సంజూ సామ్సన్ నిరాశపరిచాడు. 4 పరుగులు చేసిన సామ్సన్ ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో బ్రాస్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 19 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
అభిషేక్ (1) ఔట్
కివీస్ బౌలర్ ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో అభిషేక్ శర్మ (1) క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో టీమిండియా 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
రెండు మార్పులతో బరిలోకి..
ఈ మ్యాచ్‌కు టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. మయాంక్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇక టింక్నర్ తుదిజట్టులోకి వచ్చినట్లు కివీస్ కెప్టెన్ సాంట్నర్ తెలిపాడు.
తుది జట్లు:
న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, ఆడమ్ మిల్నే, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్
టీమిండియా: సంజు సామ్సన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
Two changes for #TeamIndia in Hamilton. Bhuvneshwar Kumar and Varun Chakaravarthy are back in the Playing XI. Updates ▶️ https://t.co/B5TqF9MWu4 #NZvIND https://t.co/Hv3DsD0bqp
— BCCI (@BCCI) November 1, 2026
ఇదీ చదవండి: రోహిత్ శర్మ కీలక నిర్ణయం


