చరిత్ర సృష్టించిన బ్రెండన్‌ టేలర్‌ | HISTORY BY BRENDAN TAYLOR, becomes the leading run getter for Zimbabwe in ODI history | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన బ్రెండన్‌ టేలర్‌

Oct 17 2026 8:20 PM | Updated on Oct 17 2026 8:39 PM

HISTORY BY BRENDAN TAYLOR, becomes the leading run getter for Zimbabwe in ODI history

source: X

జింబాబ్వే వెటరన్‌ క్రికెటర్‌ బ్రెండన్‌ టేలర్‌ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో తన దేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో ఈ ఘనత సాధించాడు. బంగ్లాదేశ్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో ఈ రికార్డును అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో టేలర్‌ 101 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 81 పరుగులు చేసి ఔటవగా.. 30 పరుగుల వద్ద జింబాబ్వే లీడింగ్‌ వన్డే రన్‌ స్కోరర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో ఆండీ ఫ్లవర్‌ రికార్డును బద్దలు కొట్టాడు. ఆండీ ఫ్లవర్‌ 213 మ్యాచ్‌ల్లో 55 అర్ద సెంచరీలు, 4 సెంచరీల సాయంతో 6837 పరుగులు చేయగా.. టేలర్‌ 211 మ్యాచ్‌ల్లో 40 అర్ద సెంచరీలు, 11 సెంచరీల సాయంతో 6837 పరుగులు చేశాడు. టేలర్‌ 40 ఏళ్ల వయసులో జింబాబ్వే లీడింగ్‌ వన్డే రన్‌ స్కోరర్‌గా అవతరించడం గమనార్హం.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న జింబాబ్వే 41 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. బ్రియాన్‌ బెన్నెట్‌ (0), బెన్‌ కర్రన్‌ (6), త్సిగ (16), బ్రెండన్‌ టేలర్‌ (81), సికందర్‌ రజా (4) ఔట్‌ కాగా..  క్రెయిగ్‌ ఎర్విన్‌ (86), వెస్లీ మదెవెరె (10) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌ 3, సైఫ్‌ హస్సన్‌ 2 వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌, జింబాబ్వేతో పాటు ఆఫ్ఘనిస్తాన్‌ పాల్గొంటుంది. 

ఇదీ చదవండి: బంగ్లా జట్టుకు అతి భారీ షాక్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement