బంగ్లా జట్టుకు అతి భారీ షాక్‌ | Litton Das out of ODI tri series, Hridoy to lead | Sakshi
Sakshi News home page

బంగ్లా జట్టుకు అతి భారీ షాక్‌

Oct 17 2026 7:16 PM | Updated on Oct 17 2026 7:26 PM

Litton Das out of ODI tri series, Hridoy to lead

source: X

యూఏఈ వేదికగా జరుగుతున్న వన్డే ముక్కోణపు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ జట్టుకు అతి భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ లిట్టన్‌ దాస్‌ తుంటి గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో వైస్‌ కెప్టెన్‌ తౌహిద్‌ హృదోయ్‌ జట్టును నడిపించనున్నాడు. ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో పాటు జింబాబ్వే, అఫ్ఘనిస్తాన్‌ జట్లు పోటీపడుతున్నాయి.

ఈ టోర్నీ ఇవాల్టి నుంచే మొదలైంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 21 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 89-3గా ఉంది. బ్రియాన్‌ బెన్నెట్‌ 0, బెన్‌ కర్రన్‌ 6, తఫ‍ద్జ్వ 16 పరుగులకు ఔట్‌ కాగా.. బ్రెండన్‌ టేలర్‌ 39, క్రెయిగ్‌ ఎర్విన్‌ 27 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే కోల్పోయిన 3 వికెట్లు తస్కిన్‌ అహ్మద్‌ తీశారు.

సూపర్‌ ఫామ్‌లో దాస్‌
గాయానికి గురి కాకముందు లిట్టన్‌ దాస్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో అతడు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. అలాగే వికెట్‌కీపింగ్‌లోనూ చెలరేగి ఈ మ్యాచ్‌లో తొమ్మిది క్యాచ్‌లు పట్టాడు. 

ఇదీ చదవండి: భారత క్రికెట్‌ అభిమానులకు శుభవార్త.. చరిత్రలో తొలిసారి..!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement