భారత క్రికెట్‌ అభిమానులకు శుభవార్త.. చరిత్రలో తొలిసారి..! | Sony Sports to telecast India A games in New Zealand | Sakshi
Sakshi News home page

భారత క్రికెట్‌ అభిమానులకు శుభవార్త.. చరిత్రలో తొలిసారి..!

Oct 17 2026 6:29 PM | Updated on Oct 17 2026 6:31 PM

Sony Sports to telecast India A games in New Zealand

source: X

భారత క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. భారత్‌-ఏ జట్టు న్యూజిలాండ్‌ పర్యటనలో ఆడనున్న మూడు నాలుగు రోజుల మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అక్టోబర్‌ 24 నుంచి 27 వరకు, అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 3 వరకు, నవంబర్‌ 7 నుంచి 10 వరకు జరిగే ఈ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

న్యూజిలాండ్‌లో జరిగే భారత్‌-ఏ మ్యాచ్‌లు టీవీలో ప్రసారం కావడం ఇదే తొలిసారి. జట్టులో పలువురు స్టార్‌ ఆటగాళ్లు ఉండటంతో ఈ మ్యాచ్‌లను ప్రసారం చేయాలని సోనీ స్పోర్ట్స్‌ నిర్ణయించింది. భారత కాలమానం ప్రకారం ప్రతి మ్యాచ్‌ ఉదయం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది.

భారత-ఏ జట్టుకు ధృవ్‌ జురెల్‌ నాయకత్వం వహించనుండగా.. యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, దేవదత్‌ పడిక్కల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ముకేశ్‌ కుమార్‌, సాయి సుదర్శన్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఈ జట్టు అక్టోబర్‌ 18న బెంగళూరు నుంచి న్యూజిలాండ్‌కు బయలుదేరనుంది.

టీమిండియా మ్యాచ్‌లు కూడా..
భారత సీనియర్‌ జట్టు న్యూజిలాండ్‌ పర్యటనలో ఆడే ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులను కూడా సోనీ స్పోర్ట్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మొత్తంగా భారత క్రికెట్‌ అభిమానులకు నెలకుపైగా సోనీ స్పోర్ట్స్‌ క్రికెట్‌ విందు చేయనుంది. భారత్‌-ఏ మ్యాచ్‌లు అక్టోబర్‌ 24 నుంచి నవంబర్‌ 10 వరకు జరుగనుండగా.. రెగ్యులర్‌ టీమిండియా మ్యాచ్‌లు అక్టోబర్‌ 22 నుంచి డిసెంబర్‌ 1 వరకు జరుగనున్నాయి. 

ఇదీ చదవండి: బ్యాడ్‌ న్యూస్‌.. సిరీస్‌ డిసైడర్‌కు వరుణ గండం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement