బ్యాడ్‌ న్యూస్‌.. సిరీస్‌ డిసైడర్‌కు వరుణ గండం | Rain To Ruin India vs West Indies Series Decider says reports | Sakshi
Sakshi News home page

బ్యాడ్‌ న్యూస్‌.. సిరీస్‌ డిసైడర్‌కు వరుణ గండం

Oct 17 2026 4:43 PM | Updated on Oct 17 2026 4:48 PM

Rain To Ruin India vs West Indies Series Decider says reports

source: X

భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య బెంగళూరు వేదికగా ఇవాళ జరగాల్సిన సిరీస్‌ నిర్ణయాత్మక ఐదో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది.

వాతావరణ సూచన ప్రకారం మ్యాచ్‌ సమయంలో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాయంత్రం 6:30 గంటలకు టాస్‌ జరగాల్సి ఉండగా, ఆ సమయంలో వర్షం పడే అవకాశం 34 నుంచి 49 శాతం మధ్య ఉంటుందని అంచనా.

మ్యాచ్‌ తొలి మూడు గంటల్లో వర్షం ముప్పు 34 నుంచి 40 శాతానికి పెరిగే అవకాశం ఉంది. రాత్రి 10 గంటల సమయంలో వర్షం పడే అవకాశం 78 శాతంగా ఉంటుంది.

చిన్నస్వామి స్టేడియంలో ప్రపంచ స్థాయి డ్రైనేజీ వ్యవస్థ ఉన్నప్పటికీ, భారీ వర్షం కురిస్తే మ్యాచ్‌ నిర్వహణకు ఆటంకం కలగవచ్చు.

కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో రెండు విజయాలతో 2-2తో సమంగా ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుంది.

సజావుగా సాగితే పరుగుల వరదే..!
చిన్నస్వామి స్టేడియంలో చిన్న బౌండరీలు, బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌ కారణంగా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే 2024 అక్టోబర్‌ తర్వాత ఈ మైదానంలో అంతర్జాతీయ మ్యాచ్‌ జరగకపోవడంతో పిచ్‌ పరిస్థితులు కీలకం కానున్నాయి.

భువీకి ఛాన్స్‌
భారత్‌ తుది జట్టులో భువనేశ్వర్‌ కుమార్‌కు చోటు దక్కే అవకాశాలున్నాయి. నాలుగో టీ20లో భుజానికి గాయం కావడంతో అర్ష్‌దీప్‌ సింగ్‌ అందుబాటుపై సందేహాలు నెలకొన్నాయి. అతడికి ప్రత్యామ్నాయంగా భువనేశ్వర్‌ను జట్టులోకి తీసుకున్నారు. అర్ష్‌దీప్‌ ఫిట్‌నెస్‌ సాధించకపోతే భువీ ఛాన్స్‌ దక్కడం ఖాయం.

ఇదీ చదవండి: న్యూజిలాండ్‌ పర్యటన.. భారత జట్ల ఎంపికలో ఆసక్తికర విషయం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement