న్యూజిలాండ్‌ పర్యటన.. భారత జట్ల ఎంపికలో ఆసక్తికర విషయం | Nitish, Kuldeep are only two players selected for 3 formats teams to New Zealand Tour | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ పర్యటన.. భారత జట్ల ఎంపికలో ఆసక్తికర విషయం

Oct 17 2026 3:22 PM | Updated on Oct 17 2026 3:42 PM

Nitish, Kuldeep are only two players selected for 3 formats teams to New Zealand Tour

న్యూజిలాండ్‌ పర్యటన కోసం​ ఎంపి​క చేసిన భారత జట్లలో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఇద్దరు ఆటగాళ్లు ఆశ్చర్యకరంగా మూడు ఫార్మాట్ల జట్లలో చోటు దక్కించుకున్నారు. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి, చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు టెస్ట్‌, వన్డే, టీ20 జట్లలో అవకాశం దక్కింది.

ఇటీవలికాలంలో ఓ ఆటగాడికి మూడు ఫార్మాట్ల జట్లలో చోటు దక్కడం చాలా అరుదుగా చూశాం. కాంపిటీషన్‌ ఎక్కువ ఉండటంతో రొటేషన్‌ పద్దతంటూ ఆటగాళ్లను ఒకటి లేదా రెండు ఫార్మాట్లకే పరిమితం చేస్తున్నారు. ఎంతటి స్టార్‌ ఆటగాడికి అయినా ఇది తప్పడం లేదు. శుభ్‌మన్‌ గిల్‌ లాంటి ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌కు టీ20 ఫార్మాట్‌లో చోటు లేదు.

అలాంటిది కుల్దీప్‌, నితీశ్‌కు అత్యంత కీలకమైన న్యూజిలాండ్‌ సిరీస్‌లో మూడు ఫార్మాట్‌ జట్లలో చోటు దక్కడం ఆసక్తికర విషయం. రెగ్యులర్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తరుచూ గాయాల బారిన పడుతుండటం నితీశ్‌కు కలిసి రాగా.. మూడు ఫార్మాట్లకు తగ్గ నాణ్యమైన స్పిన్నర్‌ లేకపోవడం కుల్దీప్‌కు కలిసొచ్చింది.

కాగా, న్యూజిలాండ్‌ పర్యటనకు తొలుత టీ20 జట్టును ప్రకటించిన భారత సెలెక్టర్లు, శుక్రవారం వన్డే, టెస్ట్‌ జట్లను అనౌన్స్‌ చేశారు. ఈ పర్యటనలో ఇరు జట్లు మూడు ఫార్మాట్లలో మొత్తం 12 మ్యాచ్‌లు ఆడనున్నాయి. 

తొలుత 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, ఆతర్వాత 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, దాని తర్వాత 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ జరుగనున్నాయి. టీ20 మ్యాచ్‌లు అక్టోబర్‌ 22, 24, 27, 30, నవంబర్‌ 1 తేదీల్లో జరుగనుండగా.. వన్డేలు నవంబర్‌ 4, 7, 10, 13, 15 తేదీల్లో జరుగనున్నాయి. టెస్ట్‌ మ్యాచ్‌లు నవంబర్‌ 19, 27 తేదీల్లో ప్రారంభం కానున్నాయి.

టీ20 సిరీస్‌కు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, నామన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.

తొలి మూడు వన్డేలకు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ*, కుల్దీప్ యాదవ్.

నాలుగు, ఐదు వన్డేలకు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), మహమ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్.

టెస్ట్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.

ఇదీ చదవండి: శుబ్‌మన్‌ గిల్‌ కీలక నిర్ణయం!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement