శుబ్‌మన్‌ గిల్‌ కీలక నిర్ణయం! | Shubman Gill Set To Play For Punjab In Ranji Trophy Ahead Of India New Zealand Test Series, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

శుబ్‌మన్‌ గిల్‌ కీలక నిర్ణయం!

Oct 17 2026 1:51 PM | Updated on Oct 17 2026 2:04 PM

Gill To Play Ranji Trophy Match Punjab Ahead Of New Zealand Tour

శుబ్‌మన్‌ గిల్‌ (PC: BCCI/X)

టీమిండియా వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన సొంతజట్టు పంజాబ్‌ తరఫున అతడు రంజీ ట్రోఫీ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కాగా దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌బాల్‌ టోర్నీ రంజీ ట్రోఫీ 2026- 2027 సీజన్‌ అక్టోబరు 11న మొదలైంది.

తొలి మ్యాచ్‌ డ్రా
ఎలైట్‌ గ్రూప్‌-‘బి’లో భాగంగా పంజాబ్‌ తొలుత అసోంతో తలపడింది. ఉదయ్‌ సహారన్‌ సారథ్యంలో ఆడిన పంజాబ్‌ తొలుత బౌలింగ్‌ చేసి.. అసోం జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌట్‌ చేసింది.

అనంతరం బ్యాటింగ్‌ మొదలుపెట్టి తమ మొదటి ఇన్నింగ్స్‌ను ఆరు వికెట్ల నష్టానికి 478 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలగా నిలబడగా.. ఫలితం తేలకుండానే మ్యాచ్‌ డ్రాగా ముగిసిపోయింది. ఇక తమ రెండో మ్యాచ్‌లో పంజాబ్‌ ఛత్తీస్‌గడ్‌ జట్టుతో తలపడనుంది.

రెండో మ్యాచ్‌ ఆడనున్న గిల్‌
న్యూ చండీగడ్‌ వేదికగా ఆదివారం నుంచి ఈ మ్యాచ్‌ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఫజిల్కా స్టార్‌ శుబ్‌మన్‌ గిల్‌ జట్టుతో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు రంజీ మ్యాచ్‌ ఆడటంద్వారా ప్రాక్టీస్‌ పొందవచ్చన గిల్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 22- డిసెంబరు 1 మధ్య ఇరుజట్ల మధ్య మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌కు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ టూర్‌లో తొలి మూడు వన్డేలకు, రెండు టెస్టులకు శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యం వహిస్తాడు. నాలుగు, ఐదో వన్డేల్లో టీ20 సారథి శ్రేయస్‌ అయ్యర్‌ జట్టును ముందుకు నడిపిస్తాడు.

ఇదీ చదవండి: IPL 2027: ముంబై ఇండియన్స్‌ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement