IPL 2027: ముంబై ఇండియన్స్‌ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై | Mumbai Indians Part Ways With Head Coach Mahela Jayawardene Ahead Of IPL 2027 After Three Title Wins, Check More Details | Sakshi
Sakshi News home page

IPL 2027: ముంబై ఇండియన్స్‌ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై

Oct 17 2026 12:26 PM | Updated on Oct 17 2026 2:06 PM

IPL 2027: Jayawardene Steps Down As Mumbai Indians Head Coach

మహేళ జయవర్దనె (PC: Mumbai Indians)

ఐపీఎల్‌-2027 ఆరంభానికి ముందు శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ మహేళ జయవర్దనె ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌తో బంధం తెంచుకున్నాడు. ఎంఐ హెడ్‌కోచ్‌ పదవి నుంచి అతడు తప్పుకొన్నాడు. ఇందుకు సంబంధించి ముంబై ఇండియన్స్‌ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

‘‘ముంబై ఇండియన్స్‌లో మహేళ జయవర్దనె కేవలం హెడ్‌ కోచ్‌ పాత్రకే పరిమితం కాలేదు. అంతకంటే ఎక్కువే చేశాడు. అతడి మార్గదర్శనంలో ముంబై ఇండియన్స్‌ మూడు ఐపీఎల్‌ టైటిళ్లు గెలిచింది’’ అంటూ ఉద్వేగపూరిత వ్యాఖ్యలతో జయవర్దనెకు వీడ్కోలు పలికింది.

చాంపియన్లుగా ఆ జట్లు కూడా
కాగా మహేళ జయవర్దనె 2017- 2022, 2024-2026 మధ్య ముంబై ఇండియన్స్‌ హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు. వివిధ లీగ్‌లలో ఎంఐ విస్తరణ నేపథ్యంలో 2022లో గ్లోబల్‌ హెడ్‌ ఆఫ్‌ పర్ఫార్మెన్స్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో ఎంఐ మహిళా జట్టు, ఎంఐ న్యూయార్క్‌, ఎంఐ ఎమిరేట్స్‌ టైటిళ్లు గెలిచాయి.

ఇక హెడ్‌కోచ్‌గా మహేళ జయవర్దనె హయాంలో 2017, 2019, 2020 టైటిళ్లను ముంబై ఇండియన్స్‌ గెలుచుకుంది. ఓవరాల్‌గా ఐదుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచిన ఘనత ఎంఐకి ఉంది.  అయితే, ఐపీఎల్‌-2027 ఆరంభానికి ముందు కొత్త కోచ్‌ కోసం చూస్తున్న ముంబై యాజమాన్యం.. జయవర్దనెకు గుడ్‌బై చెప్పింది.

నాలో ఒక భాగం
‘‘గత పదేళ్లుగా ముంబై ఇండియన్స్‌ నాలో ఒక ప్రత్యేక భాగంగా ఉంది. నా ప్రయాణంలో ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది.. ప్రతీ ఒక్కరు ఎంతగానో సహకరించారు. ఈ అనుభవం నాకొక నిధి లాంటిది. ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించాము. కఠిన సవాళ్లు కలిసి ఎదుర్కొన్నాం.

ఈ ప్రయాణం నాకు గర్వకారణం. నీతా అంబానీ, ఆకాశ్‌ అంబానీ నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. నాకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ ముంబై మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’’ అని జయవర్దనె పేర్కొన్నాడు.

దారుణ ప్రదర్శన
కాగా 2024, 2026 సీజన్లలో ముంబై జట్టు దారుణంగా విఫలమైంది. 2024లో అట్టడుగున పదో స్థానంలో నిలిచిన హార్దిక్‌ పాండ్యా సేన.. 2026లో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాతో పాటు హెడ్‌కోచ్‌ జయవర్దనెపై విమర్శలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో యాజమాన్యం జయవర్దనెకు వీడ్కోలు పలకడం గమనార్హం. కాగా 2025లో మాత్రం ముంబై జట్టు ప్లే ఆఫ్స్‌ చేరింది. 

చదవండి: అతడికి అన్యాయం: టీమిండియా సెలక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement