Mahela Jayawardene
-
WC 2023: కోహ్లి సరికొత్త చరిత్ర.. జయవర్దనే రికార్డు బద్దలు! ఇక మిగిలింది..
ICC ODI WC 2023- Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్దనే పేరిట ఉన్న రికార్డును కింగ్ కోహ్లి బద్దలు కొట్టాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో పుణెలో గురువారం(అక్టోబరు 19) నాటి మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. బంగ్లా విధించిన 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌లో 21వ ఓవర్ మూడో బంతికి షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌తో కలిసి సింగిల్ తీసిన ఈ రికార్డుల రారాజు.. ఇంటర్నేషనల్ క్రికెట్లో 25958* పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో జయవర్దనే(25957) పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లి అధిగమించాడు. ఇక బంగ్లాతో మ్యాచ్‌లో గనుక ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ మొత్తంగా 77 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 26 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పే అవకాశం ఉంటుంది. కాగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో 25 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 బ్యాటర్లు ►సచిన్ టెండుల్కర్(ఇండియా)-34357 ►కుమార్ సంగక్కర(శ్రీలంక)- 28016 ►రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 27483 ►విరాట్ కోహ్లి(ఇండియా)- 25958* ►మహేల జయవర్ధనే(శ్రీలంక)- 25957 View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!
అంతర్జాతీయ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో వరసగా అత్యధిక ఇన్నింగ్స్‌లలో రెండు అంకెల స్కోర్ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 57 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రోహిత్ టెస్టుల్లో వరుసగా 30 ఇన్నింగ్స్‌ల్లో రెండంకెల స్కోరు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం మహేలా జయవర్ధనే పేరిట ఉండేది. జయవర్ధనే వరుసగా 29 టెస్టు ఇన్నింగ్స్‌లలో రెండంకెల స్కోరు నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో జయవర్ధనే రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఇక రోహిత్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన హిట్‌మ్యాన్.. రెండో టెస్టులో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో రోహిత్ 240 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ తమ విజయానికి 8 వికెట్ల దూరంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యంతో కలిపి వెస్టిండీస్ ముందు 365 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది. 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. క్రీజులో చంద్రపాల్(24), బ్లాక్‌వుడ్(20) పరుగులతో ఉన్నారు. చదవండి: IND Vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా! ఇంగ్లండ్‌కు కూడా సాధ్యం కాలేదు -
భారత్ టెస్టు సిరీస్ గెలవడం కష్టమే.. శ్రీలంక దిగ్గజం సంచలన వ్యాఖ్యలు!
ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరగనున్న టెస్టు సిరీస్ నేపథ్యంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ఆసక్తికర వాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీను ఆస్ట్రేలియా 2-1తో సొంతం చేసుకుంటుందని జయవర్ధనే జోస్యం చెప్పాడు. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు.. స్వదేశంలో పటిష్టమైన టీమిండియాకు గట్టిపోటీ ఇస్తుందని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా చివరసారిగా 2004లో భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అప్పటినుంచి స్వదేశంలో కంగూరులపై భారత్ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తుంది. ఇక ఓవరాల్‌గా 2015 తర్వాత కూడా ఆస్ట్రేలియా ఒక్కసారి కూడా ట్రోఫీని సొంతం చేసుకోలేకపోయింది. చివరగా 2020-21లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాదే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. "ఆసీస్-భారత్ మధ్య బోర్డర్ గవాస్కర్ ఎప్పటికీ చారిత్రాత్మక సిరీస్‌గా ఉంటుంది. ఇక భారత పరిస్థితులకు ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఆస్ట్రేలియా వద్ద అద్భుతమైన బౌలింగ్ యూనిట్ ఉంది. కాబట్టి ఆసీస్ బౌలర్లను భారత బ్యాటర్లు ఎంతవరకు అడ్డుకుంటారో వేచి చూడాలి. అయితే తొలి మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో వాళ్లకి ఒకఅద్భుతమైన ప్రారంభం దొరికొనట్లు అవుతోంది. కానీ సిరీస్ విజేత ఎవరన్నది ఊహించడం చాలా కష్టం. నా వరకు అయితే ఈ సిరీస్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా అన్ని విధాలుగా పైచేయి సాధిస్తుందని భావిస్తున్నాను. ఆస్ట్రేలియా 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంటుందని అనుకుంటున్నాను. అయితే భారత్ నుంచి ఆస్ట్రేలియాకు మాత్రం తీవ్రమైన పోటీ ఉంటుంది" అని జయవర్ధనే ది ఐసీసీ రివ్యూ తాజా ఎడిషన్‌లో పేర్కొన్నాడు. కాగా నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ఇరు జట్లు మధ్య జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. ఆంధ్ర ఆటగాడు అరంగేట్రం! కిషన్‌కు నో ఛాన్స్ -
బంగ్లాతో తొలి టెస్ట్.. విరాట్ కోహ్లిని ఊరిస్తున్న అరుదైన రికార్డు
భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా రేపటి (డిసెంబర్ 14) నుంచి తొలి మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బంగ్లా పర్యటనలో వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన టీమిండియా.. టెస్ట్ సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలని పట్టుదలగా ఉంది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో కేఎల్ రాహుల్ జట్టు సారధిగా వ్యవహరించనున్నాడు. గాయాల కారణంగా రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ సిరీస్ నుంచి వైదొలగడంతో జట్టులో మూడు మార్పులు జరిగాయి. రోహిత్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ జట్టులోకి రాగా.. షమీ, జడేజాల స్థానంలో నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ జట్టులో చేరారు. ఈ మార్పులతో పాటు ముందుంగా ప్రకటించిన జట్టులో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రిషబ్ పంత్ బీసీసీఐ ఆ బాధ్యతల నుంచి తప్పించింది. పంత్ స్థానంలో చతేశ్వర్ పుజారాను ఎంపిక చేసింది. చట్టోగ్రామ్ వేదికగా భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం 9 గంటల నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే, బంగ్లాతో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీ సాధిస్తే, ఓ ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీ బాదిన ఆటగాడిగా అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంటాడు. ఈ ఏడాది ఇప్పటికే టీ20 (ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్పై), వన్డేల్లో (మూడో వన్డేలో బంగ్లాదేశ్‌పై)సెంచరీలు బాదిన కోహ్లి.. రేపటి నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తే.. మహేళ జయవర్ధనే (2010), సురేశ్ రైనా (2010), తిలకరత్నే దిల్షాన్ (2011), అహ్మద్ షెహజాద్ (2014), తమీమ్ ఇక్బాల్ (2016), కేఎల్ రాహుల్ (2016), రోహిత్ శర్మ (2017), డేవిడ్ వార్నర్ (2019), బాబర్ ఆజమ్ (2022) సరసన చేరతాడు. బంగ్లాపై తొలి టెస్ట్‌లో సెంచరీ చేస్తే కోహ్లి తన అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను 73కు పెంచుకుంటాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లి (72) ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు.. శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయస్ అయ్యర్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), శ్రీకర్ భరత్ (వికెట్‌కీపర్), రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ -
T20 WC IND VS BAN: చరిత్ర సృష్టించనున్న కింగ్ కోహ్లి..!
టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-2లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (నవంబర్ 2) జరుగునున్న కీలకమైన మ్యాచ్‌లో భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించబోతున్నాడా..? కింగ్ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే అవుననే చెప్పాలి. ఇంతకీ కోహ్లి సృష్టించబోతున్న ఆ చరిత్ర ఏంటీ అంటే..? టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటివరకు 22 ఇన్నింగ్స్‌ల్లో 80కి పైగా సగటుతో 1001 పరుగులు చేసిన కోహ్లి.. ఇవాళ బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో మరో 16 పరుగులు చేస్తే, మెగా ఈవెంట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ రికార్డు ప్రస్తుతం శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే పేరిట ఉంది. జయవర్ధనే టీ20 వరల్డ్‌కప్‌ల్లో 31 మ్యాచ్‌లు ఆడి 1016 పరుగులు చేశాడు. చదవండి: T20 WC 2022 IND VS BAN Live Updates: తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లి.. సౌతాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో కింగ్ కేవలం 12 పరుగులు మాతమే చేసి ఔటయ్యాడు. అంతకుముందు తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై చారిత్రక ఇన్నింగ్స్ (82 నాటౌట్) ఆడిన కోహ్లి.. అనంతరం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అజేయమైన అర్ధ సెంచరీతో (62) రాణించాడు. -
కోహ్లి ఖాతాలో మరో రికార్డు.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత
టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-2లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇవాళ (అక్టోబర్ 30) జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 12 పరుగులకే ఔటైనా అతని ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. కోహ్లి 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉండగా.. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో 1000 పరుగుల మార్కును చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి టీ20 వరల్డ్‌కప్‌ల్లో 22 ఇన్నింగ్స్‌లు ఆడి 80కి పైగా సగటుతో 1001 పరుగులు చేశాడు. ఇందులో 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లి 28 పరుగులు చేసి ఉంటే.. శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును అధిగమించే వాడు. జయవర్ధనే టీ20 వరల్డ్‌కప్‌ల్లో 31 మ్యాచ్‌లు ఆడి 1016 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లి సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో నిరాశపరిచాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై చారిత్రక ఇన్నింగ్స్ (82 నాటౌట్) ఆడిన కోహ్లి.. అనంతరం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అజేయమైన అర్ధ సెంచరీతో (62) రాణించాడు. కాగా, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో కోహ్లి సహా టాపార్డర్ మొత్తం విఫలం కావడంతో టీమిండియా 49 పరుగలకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, సూర్యకుమార్ మరోసారి ఆపద్బాంధవుడిలా ఆదుకుని జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. సూర్య.. 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 115/6గా ఉంది. -
అతడు జట్టులో లేకపోవడం టీమిండియాకు తీరని లోటు: శ్రీలంక మాజీ కెప్టెన్
T20 World Cup 2022: ఆసియా కప్- 2022 టీ20 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లలో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. ముఖ్యంగా లీగ్ దశలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో జడ్డూ పాత్ర మరువలేనిది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో 35 పరుగులు సాధించాడు. మరో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సహకారం అందిస్తూ టీమిండియా గెలుపొందడంలో తన వంతు సాయం చేశాడు. ఇక హాంకాంగ్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. కానీ ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక సూపర్-4 స్టేజ్‌లో పాకిస్తాన్, శ్రీలంక చేతిలో వరుసగా ఓటమి పాలైన రోహిత్ సేన.. ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా(Twitter Pic) గాయం కారణంగా! ఇదిలా ఉంటే.. ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్‌ల తర్వాత టీ20 ప్రపంచకప్-2022 ఆడేందుకు ఆస్ట్రేలియాకు పయనం కానుంది టీమిండియా. ఇందుకోసం ఇప్పటికే జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే, ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో జడేజా ఈ ఐసీసీ ఈవెంట్‌కు దూరమయ్యాడు. జడ్డూ లేకపోవడం తీరని లోటు! అయితే.. ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే కీలక వ్యాఖ్యలు చేశాడు. రవీంద్ర జడేజా ప్రపంచకప్ జట్టులో లేకపోవడం టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ అని పేర్కొన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానానికి జడేజా చక్కగా సరిపోతాడన్న జయవర్ధనే.. ఆరో స్థానంలో వచ్చే మరో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేయగలడని చెప్పుకొచ్చాడు. వీరిద్దరి జోడీ బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత పటిష్టం చేస్తుందని పేర్కొన్నాడు. కానీ జడేజా గాయం కారణంగా జట్టుకు దూరం కావడం టీమిండియాకు తీరని లోటు అని వ్యాఖ్యానించాడు. అయితే, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్‌లో ఉండటం రోహిత్ సేనకు కలిసి వచ్చే అంశమని జయవర్ధనే పేర్కొన్నాడు. కోహ్లి వంటి ప్రమాదకర ఆటగాడి వల్ల ప్రత్యర్థి జట్టుకు తిప్పలు తప్పవని.. జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ పునరాగమనంతో బౌలింగ్ విభాగం పటిష్టంగా తయారైందన్నాడు. ఏదేమైనా.. ఆస్ట్రేలియాలో వరల్డ్‌కప్ టీమిండియాకు గొప్పగా ఉండబోతోందని జయవర్ధనే జోస్యం చెప్పాడు. చదవండి: మిర్కాతో అలా ప్రేమలో పడ్డ ఫెదరర్! ఫెడ్డీలో మనకు తెలియని కోణం! Ind Vs Aus: టీ20 సిరీస్.. అరుదైన రికార్డుల ముంగిట కోహ్లి! అదే జరిగితే.. -
ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి ప్రమోషన్
ఫైవ్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. తమ నాన్ ప్లేయింగ్ బృందంలో కీలక మార్పులు చేసింది. ప్రధాన కోచ్ మహేళ జయవర్థనేతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ జహీర్ ఖాన్‌కు ప్రమోషన్ కల్పించి అత్యంత కీలక బాధ్యతలు అప్పజెప్పింది. జయవర్దనేకు ముంబై ఇండియన్స్ (ఎంఐ) గ్రూప్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పదవి అప్పజెప్పిన యాజమాన్యం.. జహీర్ ఖాన్‌ను గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా ప్రమోట్ చేసింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. 🚨 Head Coach ➡️ Global Head of Performance 🌏 We are delighted to announce Mahela Jayawardene as our Global Head of Performance 🙌💙#OneFamily #MumbaiIndians #MIemirates #MIcapetown @MIEmirates @MICapeTown @MahelaJay pic.twitter.com/I4wobGDkOQ — Mumbai Indians (@mipaltan) September 14, 2022 ఎంఐ యాజమాన్యం ఖాళీ అయిన జయవర్ధనే, జాక్‌ల స్థానాలకు త్వరలో భర్తీ చేయనుంది. జయవర్ధనే 2017 నుంచి ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ గా పని చేస్తుండగా.. జహీర్ ఖాన్ 2019లో ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. 🚨 Director of Cricket Operations ➡️ Global Head of Cricket Development 🌏 Let's welcome ZAK as our Global Head of Cricket Development 🙌#OneFamily #MumbaiIndians #MIemirates #MIcapetown @MIEmirates @MICapeTown @ImZaheer pic.twitter.com/VBfzzrBG6J — Mumbai Indians (@mipaltan) September 14, 2022 జయవర్ధనే, జహీర్ ఖాన్ కొత్త బాధ్యతలేంటి.. ఎంఐ గ్రూప్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్గా బాధ్యతలు చేపట్టనున్న జయవర్ధనే.. కొత్త పాత్రలో ముంబై ఇండియన్స్ (ఐపీఎల్) తో పాటు ఎంఐ ఎమిరేట్స్ (ఇంటర్నేషనల్ లీగ్ టీ20), ఎంఐ కేప్‌టౌన్ (సౌతాఫ్రికా) ఫ్రాంచైజీలకు సంబంధించిన కోచింగ్ స్టాఫ్‌కు మార్గదర్శకుడిగా వ్యవహరిస్తాడు. అలాగే మూడు జట్ల స్టాఫ్, ప్లేయర్స్ రిక్రూట్మెంట్, స్ట్రాటజిక్ ప్లానింగ్ తదితర వ్యవహారాలు పర్యవేక్షిస్తాడు. జహీర్ విషయానికొస్తే.. ఇతను మూడు ఫ్రాంచైజీల ప్లేయర్స్ డెవలప్మెంట్, ప్రోగ్రామ్ డెవలప్మెంట్, అలాగే న్యూ టాలెంట్ అన్వేషణ వంటి పలు కీలక బాధ్యతలు చూస్తాడు. -
అమ్మో అదో పీడకల.. ఆ బౌలర్ ఎదురుగా ఉన్నాడంటే: జయవర్ధనే
కెరీర్లో తాను ఎదుర్కొన్న అత్యంత ఉత్తమమైన, కఠినమైన ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ అని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే అన్నాడు. అతడితో మ్యాచ్ అంటేనే పీడకలలా ఉండేదని గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. కాగా పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ కెరీర్ తారస్థాయిలో ఉన్న సమయంలో జయవర్దనే క్రికెటర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే అద్భుతమైన బౌలర్‌గా నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక- పాకిస్తాన్ తలపడిన ప్రతిసారి వసీం బౌలింగ్ అంటే తాను భయపడేవాడినంటూ జయవర్ధనే తాజాగా వ్యాఖ్యానించాడు. ఐసీసీ డిజిటల్ షోలో అతడు మాట్లాడుతూ తన అనుభవం గురించి పంచుకున్నాడు. మీరు ఎదుర్కొన్న బెస్ట్ బౌలర్ ఎవరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘వసీం అక్రమ్. అతడు తన కెరీర్ పీక్‌లో ఉన్నపుడు నేను అరంగేట్రం చేశాను. తన చేతిలో కొత్త బంతి ఉందంటే అంతే ఇక! అతడిని ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్న పని! నిజంగా పీడకలలా అనిపించేది. వసీం బౌలింగ్ యాక్షన్ బాగుంటుంది. బ్యాటర్న ఇబ్బంది పెట్టడం తనకు వెన్నతో పెట్టిన విద్య’’ అని జయవర్ధనే చెప్పుకొచ్చాడు. నిలకడగా బౌలింగ్ చేయడంలో వసీం అక్రమ్ దిట అని ప్రశంసించాడు. కాగా పాక్ మాజీ సారథి వసీం అక్రమ్ అంతర్జాతీయ క్రికెట్లో 916 వికెట్లు పడగొట్టాడు. ఇందులో టెస్టు వికెట్లు 414. వన్డే వికెట్లు 502. చదవండి 👇 IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు! Eng Vs NZ: తొలిరోజే ఇంగ్లండ్‌కు షాక్.. స్పిన్నర్ తలకు గాయం.. ఆట మధ్యలోనే.. View this post on Instagram A post shared by ICC (@icc) -
'దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది'
శ్రీలంక సంక్షోభం తారాస్థాయికి చేరి హింసాత్మకంగా మారడంపై ఆ దేశ తాజా, మాజీ క్రికెటర్లు స్పందించారు. దేశం ఇంత దుర్భర స్థితికి చేరుకోవడానికి కారణం ప్రభుత్వమేనంటూ దిగ్గజ క్రికెటర్లు మహేళ జయవర్దనే, కుమార సంగక్కరతో పాటు ప్రముఖ క్రికెటర్లు వనిందు హసరంగా, నిరోషన్ డిక్వెల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. లంక సంక్షోభంపై ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్దనే స్పందింస్తూ.. తమ ప్రాథమిక అవసరాలు, హక్కుల కోసం డిమాండ్ చేస్తున్న శాంతియుత నిరసనకారులపైకి ప్రభుత్వ మద్దతుతో దుండగులు, గూండాలు దాడి చేయడం చూస్తుంటే అసహ్యమేస్తోందని తెలిపాడు. దీంతోపాటు ఒక వీడియోను ట్వీట్ చేశాడు. అందులో కొంతమంది కలిసి ఓ మహిళపై దాడిచేస్తున్నారు.‘‘పోలీసుల ముందే నిరసన చేస్తున్న మహిళలను ఎలా కొడుతున్నారో చూడండి.. సిగ్గు చేటు’’ అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. కాగా, నిన్న శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై రాజపక్స కుటుంబ సభ్యుల మద్దతుదారులు దాడిచేయడం బాధాకరమని పేర్కొన్నాడు. శ్రీలంక మాజీ కెప్టెన్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్ సంగక్కర మాట్లాడుతూ.. ఈ హింస వెనుక ప్రభుత్వం ఉందని.. ఉద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళికతో జరిగిన హింస అని ఆరోపించాడు లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ కూడా ప్రభుత్వ తీరుపై మండిపడ్డాడు. అమయాక, శాంతియుత నిరసనకారులపై జరిగిన దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించాడు. మన దేశాన్ని ఇలాంటి నాయకత్వం నడిపిస్తోందా? అని ఆవేదన వ్యక్తం చేశాడు. దేశం కోసం ఏకమై అందరి పక్షాన ఉంటానని హామీ ఇచ్చాడు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అమాయక ప్రజలపై దాడులు జరగడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్వెల్లా పేర్కొన్నాడు. శ్రీలంకలో సంక్షోభం తీవ్ర రూపం దాల్చడం.. ఫలితంగా చెలరేగిన రాజకీయ హింసలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం, 200 మందికిపైగా గాయపడ్డారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. చదవండి: ఉపేక్షించొద్దు.. అలాంటి వాళ్లను కాల్చేయండి: శ్రీలంకలో తీవ్ర హెచ్చరికలు Mumbai Indians: ప్లేఆఫ్ అవకాశాలు ఖేల్‌ఖతం.. ఇంతకుమించి ఏం చేస్తారులే! -
దిగ్గజ క్రికెటర్ టీ20 జట్టు టాప్-5లో ఉన్నది వీళ్లే!
Mahela Jayawardene First 5 Players Of His T20 XI: తన టీ20 జట్టులోని ఐదుగురు ఆటగాళ్ల పేర్లను శ్రీలంక దిగ్గజ క్రికెటర్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ మహేళ జయవర్దనే ప్రకటించాడు. ఇందులో అఫ్గనిస్తాన్ నుంచి ఒకరు, పాకిస్తాన్ నుంచి ఇద్దరు, భారత్ నుంచి, ఇంగ్లండ్ నుంచి ఒకరికి అవకాశం ఇచ్చాడు. వారిని టాప్-5గా ఎంచుకోవడానికి గల కారణాలను కూడా వెల్లడించాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌తో వర్చువల్‌గా మాట్లాడిన జయవర్దనే ఈ మేరకు తన జట్టులోని టాప్-5ని వెల్లడించాడు. ఇంతకీ ఆ ఐదుగురు క్రికెటర్లు ఎవరంటే.. రషీద్ ఖాన్, షాహిన్ ఆఫ్రిది, జస్ప్రీత్ బుమ్రా, జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్. ది ఐసీసీ రివ్యూలో భాగంగా ఈ ముంబై ఇండియన్స్ కోచ్ మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం... టీ20 క్రికెట్లో బౌలర్లదే కీలక పాత్ర పాత్ర. రషీద్ ఖాన్ విషయానికొస్తే అతడు మంచి స్పిన్నర్. అదే విధంగా బ్యాటింగ్ కూడా చేయగలడు. అతడు ఏడు లేదంటే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. నా జట్టులో అతడు అగ్రస్థానంలో ఉంటాడు’’ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా ఐపీఎల్-2022లో ప్రస్తుతం అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ గురించి చెబుతూ.. ‘‘జోస్‌తో ఓపెనింగ్ చేయడం ఇష్టం. తను దూకుడైన బ్యాటర్. పేస్, స్పిన్ బాగా ఆడగలడు. గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా యూఏఈలో కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి.. అద్భుతంగా రాణించాడు’ అని ఈ ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్‌పై జయవర్దనే ప్రశంసలు కురిపించాడు. ఇక జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్‌గా జయవర్దనే అభివర్ణించాడు. అందుకే అతడిని తన జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా సంజనాను ఉద్దేశించి.. ‘‘నువ్వు సిగ్గు పడొద్దు సంజనా.. ఎందుకంటే నేను చెప్పబోయేది నీ భర్త పేరే’’ అని జయవర్దనే పేర్కొనడం విశేషం. ఇక బుమ్రాతో పాటు పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ ఆఫ్రిది, మిడిలార్డర్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు అతడు చోటిచ్చాడు. చదవండి👉🏾IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్.. కీలక ఆటగాడు దూరం..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘మూడో అంపైర్ జోక్యం చేసుకోవాలి’
బ్యాటర్ నడుముకంటే ఎక్కువ ఎత్తులో దూసుకొచ్చే ‘నోబాల్స్’ విషయంతో మూడో అంపైర్ జోక్యం చేసుకుంటే బాగుంటుందని ముంబై ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే అన్నాడు. ఢిల్లీ, రాజస్తాన్ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయానికే కట్టుబడటంతో ‘నోబాల్’ అంశం వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ దశను మార్చే కీలక సమయాల్లో అంపైర్లు ఈ విషయాన్ని పరిశీలించమంటూ థర్డ్ అంపైర్ కోరటం సరైందని అతను సూచించాడు. జయవర్ధనే ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యుడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ‘నో బాల్’ వివాదంలో తమ బ్యాటర్లను మైదానం నుంచి వెనక్కి పిలిచే ప్రయత్నం చేసి క్రమశిక్షణను ఉల్లంఘించిన ఢిల్లీ క్యాపిటల్స్ బృందంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్య తీసుకుంది. కెప్టెన్ రిషభ్ పంత్ మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా (సుమారు రూ. కోటీ 14 లక్షలు) విధించింది. అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేపై కూడా 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధించిన కౌన్సిల్... శార్దూల్‌ను కూడా 50 శాతం జరిమానాతో శిక్షించింది. చదవండి: హైడ్రామా.. పంత్ తీవ్ర అసహనం.. బ్యాటర్లను వెనక్కి వచ్చేయమంటూ.. -
Mumbai Indians: ప్రక్షాళనకు సమయం ఆసన్నమైంది..!
ఐపీఎల్ 2022 సీజన్లో వరుసగా ఎనిమిది ఓటములు చవిచూసి ప్లే ఆఫ్స్ బరి నుంచి దాదాపుగా తప్పుకున్న ముంబై ఇండియన్స్.. జట్టు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. ఆదివారం (ఏప్రిల్ 24) లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమి అనంతరం ముంబై ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. తదుపరి మ్యాచ్‌లకు ముంబై జట్టులో కీలక మార్పులు తప్పవని ఆయన పేర్కొన్నాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ల ఫామ్ ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ.. త్వరలోనే వారివురు సెట్ అవుతారనే ధీమాను వ్యక్తం చేశాడు. కొత్త కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని ఆయన కితాబునిచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ పర్వాలేదనిపిస్తున్నా, పోలార్డ్ పేలవ ఫామ్ కారణంగా ఇబ్బంది పడుతున్నాడని అన్నాడు. బేబీ ఏబీడి డెవాల్డ్ బ్రెవిస్‌కు మరిన్ని అవకాశాలిస్తామని క్లూ ఇచ్చాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై తమ బ్యాటింగ్ దళం సరిగా పెర్ఫార్మ్ చేయలేకపోవడం ఆందోళనకరమేనని అంగీకరించాడు. కోచింగ్ స్టాఫ్ అభిప్రాయాలు తీసుకున్న అనంతరం జట్టులో అవసరమైన మార్పులు ఉంటాయని హింటిచ్చాడు. బౌలర్ల ప్రదర్శన సైతం ఏమంత ఆశాజనకంగా లేదని ఒప్పుకున్నాడు. బుమ్రా ఆశించిన మేరకు రాణించలేకపోతున్నాడని, డేనియల్ సామ్స్, రిలే మెరిడిత్ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారని, సీనియర్ బౌలర్‌గా ఉనద్కత్, టీ20 స్పెషలిస్ట్‌గా పోలార్డ్ రాణించలేకపోతున్నారని వివరించాడు. కొత్త కుర్రాడు హృతిక్ షోకీన్ పర్వాలేదనిపిస్తున్నాడని కితాబునిచ్చాడు. మొత్తంగా ఒత్తిడి, నిలకడలేమి కారణంగా ప్రస్తుత సీజన్లో తమ జట్టు పరాజయాల బాట పట్టిందని తెలిపాడు. చదవండి: కింగ్స్ ఫైట్‌లో గెలుపెవరిది..? రికార్డులు ఎలా ఉన్నాయంటే..? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
లంక ఆర్థిక సంక్షోభం.. తరలివస్తున్న మాజీ క్రికెటర్లు
శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభం కారణంగా లంక రూపాయి విలువ దారుణంగా పడిపోడవడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజుకు 12 గంటల పాటు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణమైన ఆ దేశ అధ్యక్షుడు గొటబోయ రాజపక్స గద్దె నుంచి దిగిపోవాలంటూ వారం రోజుల నుంచి ప్రజలు సెక్రటరియట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రజలు చేస్తున్న పోరాటానికి లంక మాజీ దిగ్గజ క్రికెటర్.. రాజకీయ నేత అర్జున రణతుంగ తన మద్దతు ఇచ్చారు. క్రికెట్ రిత్యా వేరే దేశాల్లో ఉన్న లంక క్రికెటర్లు కూడా ఆటను వదిలి వారం పాటు లంకకు వచ్చి ప్రజల పోరాటానికి మద్దతు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా రణతుంగ వ్యాఖ్యలు పలువురు మాజీ క్రికెటర్లను కదిలించాయి. సహచర మాజీ క్రికెటర్.. సనత్ జయసూర్య ఇప్పటికే రణతుంగతో కలిసి గొటబయ రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు. ''ఈరోజు బయట మా అభిమానులు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇంకా అధికారిక ప్రభుత్వానికి భజన చేస్తూ కూర్చోలేం.. ప్రజలకు మా అవసరం ఉంది.. అందుకే ప్రత్యక్ష పోరాటానికి దిగాం.. క్రీడాకారులైనా సరే.. దేశం కష్టాల్లో ఉందంటే చూస్తూ ఊరుకోరు.'' అంటూ రణతుంగ పేర్కొన్నాడు. కాగా జయసూర్య నినాదాలు చేస్తూనే రాజపక్స ఇంటి ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లు దూకే ప్రయత్నం చేయడం ఆసక్తి కలిగించింది. అయితే పోలీసులు అడ్డుకోవడంతో జయసూర్య లోపలికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. కాగా వీరిద్దరికి తాజాగా మరికొందరు మాజీ క్రికెటర్లు పరోక్షంగా తమ మద్దతు తెలిపారు. రాజకీయపరంగా నిరకుంశ పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని.. గొటబయ రాజపక్స గద్దె దిగాలని మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనే అభిప్రాయపడ్డాడు. మరో మాజీ క్రికెటర్ కుమార సంగక్కర కూడా ట్విటర్ వేదికగా తన నిరసనను వ్యక్తం చేశాడు. ఇక మాజీ టెస్టు క్రికెటర్.. ఐసీసీ మ్యాచ్ రిఫరీ రోషన్ మహనామా శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని గతంలో జింబాబ్వే ఎదుర్కొన్న సంక్షోభంతో పోల్చాడు. అప్పుడు రాబర్ట్ ముగాబే.. ఇప్పుడు గొటబయ రాజపక్స ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ''కొన్ని సంవత్సరాల క్రితం నేను జింబాబ్వే వెళ్లినప్పుడు.. అక్కడి ప్రజలు రాబర్ట్ ముగాబే ప్రభుత్వంపై త్రీవ నిరసన వ్యక్తం చేశారు. నా కారు డ్రైవర్ డీజిల్ తేవడానికి గంటల పాటు క్యూలైన్లో నిల్చోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి నా దేశంలో రావద్దని కోరుకున్నా. కానీ నా అంచనా తలకిందులైంది. ఒకప్పుడు జింబాబ్వే ఎదుర్కొన్న సంక్షోభాన్ని ఇప్పుడు లంక ప్రజలు అనుభవిస్తున్నారు'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Dhammika Prasad: నిరాహారదీక్షకు దిగిన శ్రీలంక మాజీ క్రికెటర్ Arjuna Ranatunga: దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్ ముఖ్యమా.. వదిలి రండి! -
IPL 2022: ఆ దేశంలో ఐపీఎల్ ప్రసారాలు బంద్
IPL 2022 Broadcast Goes Off In Sri Lanka: తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ద్వీప దేశం శ్రీలంకలో ఐపీఎల్ ప్రసారాలు కూడా బంద్ అయ్యాయి. ప్రసార హక్కుదారులకు చెల్లించేందుకు డబ్బుల్లేక అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే యుప్ టీవీ, ఎస్ఎల్ఆర్సీ, డయలాగ్ టీవీ, పియో టీవీ ఛానల్లు క్యాష్ రిచ్ లీగ్ ప్రసారాలను నిలిపి వేశాయి. దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) నెలకొన్న నేపథ్యంలో అక్కడి ప్రజలు ఐపీఎల్ మ్యాచ్‌లు చూసి ఎంజాయ్ చేసే మూడ్‌లో లేరని, అందుకే ఐపీఎల్ టెలికాస్ట్‌పై అంతగా ఫోకస్ పెట్టలేదని అక్కడి మీడియా వెల్లడించింది. మరోవైపు పేపర్ కాస్ట్ పెరగడంతో పాటు సిబ్బంది జీతాలివ్వలేక పత్రికలు ప్రింటింగ్ చేయడం మానేశాయి. కనీసం డిజిటల్ పేపర్లలో కూడా ఐపీఎల్ వార్తల ప్రస్తావన లేదు. ఐపీఎల్లో ఆడుతున్న లంక క్రికెటర్ల వనిందు హసరంగ (ఆర్సీబీ), భానుక రాజపక్స (పంజాబ్), దుష్మంత చమీర (లక్నో సూపర్ జెయింట్స్), చమిక కరుణరత్నే (కోల్‌కతా నైట్ రైడర్స్)లను పట్టించుకునే నాధుడే లేడు. మరోవైపు దేశంలో నెలకొన్న దుర్భర పరిస్థితులపై ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న లంక మాజీలు గళం విప్పుతున్నారు. చదవండి: మీతో కాకపోతే చెప్పండి.. నేనొస్తా..! సన్‌రైజర్స్, లక్నో జట్లకు బెంగాల్ మంత్రి ఆఫర్ -
శ్రీలంకలో ఎమర్జెన్సీ.. నిరసనకారులకు మద్దతు తెలుపుతున్న క్రికెటర్లు
Top Sri Lanka Cricketers Back Anti Government Protests: ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)పై ఆ దేశ దిగ్గజ క్రికెటర్లు, ఐపీఎల్ 2022 సీజన్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ఆటగాళ్లు, హెడ్ కోచ్‌లు గళం విప్పారు. తమ దేశం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోవడానికి, దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కడానికి శ్రీలంక ప్రభుత్వ తీరే కారణమని వారు ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశంలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు తెలిపారు. లంక ఆర్థిక వ్యవస్థను కొందరు వ్యక్తులు తమ గుప్పిట్లో ఉంచుకుని ఈ దుర్భర పరిస్థితులకు కారణమయ్యారని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనే ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. లంకలో ఎమర్జెన్సీ విధించడం.. కఠినమైన కర్ఫ్యూ చట్టాలను అమలుచేయడం చూస్తుంటే చాలా బాధగా ఉందని వాపోయాడు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం.. వారి బాగోగులను గాలికొదిలేసి, నిరంకుశంగా వ్యవహరించడం బాధాకరమని అన్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రజల తరఫున పోరాడుతున్న న్యాయవాదులు, విద్యార్థులకు మద్దతు తెలుపుతున్నానని పేర్కొన్నాడు. జయవర్ధనేతో పాటు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర, పంజాబ్ కింగ్స్ ఆటగాడు భానుక రాజపక్సలు నిరసనకారులకు మద్దతు తెలిపారు. తాను భారత్‌లో ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ తన మనసంతా అక్కడే (శ్రీలంక) ఉందని రాజపక్స ఆవేదన వ్యక్తం చేయగా, నా దేశ ప్రజల దుస్థితి చూస్తుంటే కడుపు తరుక్కు పోతుందంటూ సంగక్కర వాపోయాడు. సోమవారం కొలొంబోలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో సంగక్కర భార్య యహేలి కూడా పాల్గొన్నారు. కాగా, శ్రీలంకలో ఆర్థిక ఎమర్జెన్సీకి తోడు ద్రవ్యోల్బణం కూడా అదుపు తప్పడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో బియ్యం రూ. 220, గోధుమలు రూ. 190, చక్కెర రూ. 240, పాల పౌడర్ రూ. 1,900, కోడి గుడ్డు రూ. 30 వరకు పలుకుతుంది. చదవండి: IPL 2022: ప్లే ఆఫ్స్‌కు లక్నో, గుజరాత్..! -
శ్రీలంక జట్టులో కీలక పరిణామం.. కోచ్‌గా లసిత్ మలింగ!
శ్రీలంక జట్టులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. శ్రీలంక ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఆ జట్టు దిగ్గజం లసిత్ మలింగ ఎంపికయ్యే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న ఆస్ట్రేలియా సిరీస్‌కు మలింగని కన్సల్టెంట్ కోచ్‌గా నియమించాలని హై-ప్రొఫైల్ క్రికెట్ అడ్వైజరీ కమిటీ శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సిఫార్సు చేసింది. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇక గత ఏడాదిలో అన్ని ఫార్మాట్ల నుంచి మలింగను తప్పుకున్న సంగతి తెలిసిందే. తన టీ20 కేరిర్‌లో 390 వికెట్లు పడగొట్టాడు. అంతే కాకుండా తొమ్మిది వన్డేల్లో శ్రీలంక జట్టుకు నాయకత్వం వహించిన మలింగ ఒక్క సారి కూడా జట్టును గెలిపించ లేకపోయాడు. అదే విధంగా 24 టీ20ల్లో సారధ్యం వహించిన మలింగకు 15 సార్లు పరాజయం ఎదురైంది. ఇక అతడితో పాటు మహేల జయవర్ధనే కూడా కన్సల్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. చదవండి: Ind Vs WI: 458 పరుగులు.. 17 వికెట్లు.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి.. ఆ ఇద్దరికి బంపర్ ఛాన్స్.. ఏకంగా విండీస్‌తో సిరీస్‌తో.. -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో జయవర్ధనే, పొలాక్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ముగ్గురు దిగ్గజ క్రికెటర్లకు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించింది. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ షాన్ పొలాక్‌లతో పాటు ఇంగ్లండ్ దివంగత మహిళా క్రికెటర్ జెనెట్టె బ్రిటిన్‌లు ఈ జాబితాలో ఉన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు జరిగే టి20 ప్రపంచ కప్ మ్యాచ్ ఆరంభానికి ముందు వీరిని ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో అధికారికంగా చేరుస్తారు. జయవర్ధనే సభ్యుడిగా ఉన్న శ్రీలంక జట్టు 2014 టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. వన్డే, టెస్టు ఫార్మాట్లలో 3 వేల పరుగులు, 300 వికెట్ల చొప్పున తీసిన తొలి క్రికెటర్‌గా షాన్ పొలాక్ ఘనతకెక్కాడు. బ్రిటిన్ 19 ఏళ్ల (1979–1998) పాటు టెస్టుల్లో ఇంగ్లండ్ మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆమె 2017లో మరణించింది. -
Mahela Jayawardene: టాస్ గెలిస్తేనే విజయం.. శ్రీలంక లాంటి జట్లకు..
Mahela Jayawardene Comments On Sri Lanka Defeat: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో జట్ల జయాజయాలపై మంచు ప్రభావం స్పష్టంగా కనబడుతోందని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్దనే అన్నాడు. అదే విధంగా టాస్... గెలుపును నిర్దేశించే కీలక అంశంగా పరిణమించిందని వ్యాఖ్యానించాడు. స్పిన్నర్లపై ఎక్కువగా ఆధారపడే శ్రీలంక వంటి జట్లకు ఇది నష్టం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా బౌలర్ ఆడం జంపా మెరుగ్గా రాణించిన చోట... శ్రీలంక బౌలర్లు అతడి స్థాయిలో ప్రభావం చూపకపోవడానికి మంచు కారణమని జయవర్దనే పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో దుబాయ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జయవర్ధనే ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ... ‘‘శ్రీలంక స్పిన్నర్లు ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ బంతి జారిపోవడం మొదలుపెట్టింది. గ్రిప్ అంతగా దొరకలేదు. ఆడం జంపా ప్రభావం చూపగలిగిన పిచ్‌పై.. అందుకే వాళ్లు మెరుగ్గా రాణించలేకపోయారు’’ అని జయవర్దనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అదే విధంగా... ‘‘దుబాయ్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో టాస్ గెలిచిన కెప్టెన్లనే విజయాలు వరించాయి. రెండో దఫా బౌలింగ్ చేసే జట్లకు.. ముఖ్యంగా స్పిన్నర్లకు పిచ్ ఏమాత్రం సహకరించడం లేదు. టీ20 వరల్డ్‌కప్ వంటి ప్రధాన టోర్నీల్లో ఇలా జరగడం.. కెప్టెన్లను తప్పక టాస్ గెలవాల్సిన పరిస్థితుల్లోకి నెడుతోంది’’ అని జయవర్ధనే చెప్పుకొచ్చాడు. ఇక గురువారం నాటి మ్యాచ్‌లో పవర్‌ప్లేలో వనిందు హసరంగ ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు. ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక.. స్కోర్లు శ్రీలంక- 154/6 (20) ఆస్ట్రేలియా-155/3 (17) చదవండి: T20 World Cup 2021: స్వదేశానికి తిరిగి వచ్చేసిన టీమిండియా నెట్ బౌలర్ -
టీమిండియా కోచ్ పదవి వద్దన్న లంక మాజీ క్రికెటర్!
ముంబై: టి20 ప్రపంచకప్ అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ పదవికి రవిశాస్త్రి రాజీనామా చేయనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ కొత్త కోచ్‌కు సంబంధించి వెతుకులాట మొదలుపెట్టిందని సమాచారం. దీనికి అనుగుణంగానే కోచ్ పదవికి సంబంధించి రోజుకో పేరు బయటికి వస్తుంది. తొలుత ద్రవిడ్, సెహ్వాగ్‌లలో ఎవరు ఒకరు కోచ్ పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కుంబ్లే, లక్ష్మణ్ పేర్లు కూడా వినిపించాయి. తాజాగా బీసీసీఐ శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనేకు కోచ్ పదవి ఆఫర్ కోసం సంపద్రించినట్లు రిపోర్ట్స్ ద్వారా సమాచారం అందింది. అయితే జయవర్దనే బీసీసీఐ ఇచ్చిన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. రిపోర్ట్స్ ప్రకారం.. టీమిండియా కోచ్ పదవిపై జయవర్దనేకు ఆసక్తి లేదట. అంతేగాక అతను ప్రస్తుతం శ్రీలంక అండర్-19 క్రికెట్ టీమ్‌కు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా కోచ్ కంటే శ్రీలంక ప్రధానకోచ్‌గా ఉండేదుకు ఇష్టపడుతున్నట్లు సమాచారం. చదవండి: Team India Head Coach: టీమిండియా ప్రధాన కోచ్‌గా మరోసారి ఆయనే! ఇక జయవర్దనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2017 నుంచి ముంబై ఇండియన్స్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జయవర్దనే కోచ్‌గా 2017, 2019లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ రూల్స్ ప్రకారం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉండాలంటే ఏ జట్టుకు కోచ్‌గా కొనసాగకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ జయవర్దనేను వదులుకోవడానికి ఇష్టపడదు. అందులోనూ శ్రీలంక క్రికెట్లో ఇలాంటి రూల్స్ లేవు. ఒక రకంగా జయవర్దనే టీమిండియా కోచ్ పదవి వద్దనడానికి ఇది కూడా ఒక కారణంగా భావించొచ్చు. అయితే ఇప్పటికైతే జయవర్దనే బీసీసీఐకి తెలిపిన విషయంలో క్లారిటీ లేదు. టి 20 ప్రపంచకప్ తర్వతే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం లభిస్తుంది. ఇక జయవర్దనే లంక దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా పేరు పొందాడు. బ్యాట్స్‌మన్‌గా... కెప్టెన్‌గా లంక జట్టుకు లెక్కలేనన్ని విజయాలు అందించాడు. లంక తరపున 448 వన్డేల్లో 12560 పరుగులు, 149 టెస్టు మ్యాచ్‌ల్లో 11814 పరుగులు, 55 టి20 మ్యాచ్‌ల్లో 1493 పరుగులు చేశాడు. జయవర్దనే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 54 సెంచరీలు చేశాడు. దీనితో పాటు ఏడు డబుల్ సెంచరీలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. ఇక ఐపీఎల్లో 80 మ్యాచ్‌లాడిన జయవర్దనే 1802 పరుగులు చేశాడు. చదవండి: Virat Kohli: కోహ్లి నిర్ణయం సరైందే.. తను వరల్డ్‌కప్ గెలవాలి -
లక్కీగా అర్జున్ బౌలర్ అయ్యాడు.. లేదంటే!
ముంబై: అర్జున్ టెండుల్కర్‌లో దాగున్న క్రీడా నైపుణ్యాల ఆధారంగానే అతడిని కొనుగోలు చేశామని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడటం ద్వారా ఎంతోమంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారని, తను కూడా ఈ లీగ్ ద్వారా తన సత్తా ఏమిటో నిరూపించుకునే అవకాశం ఉందన్నాడు. కాగా గురువారం జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో భాగంగా, అంబానీ కుటుంబానికి చెందిన ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ అర్జున్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల బేస్‌ప్రైస్‌కు వేలంలోకి రాగా, అదే ధరకు అతడిని సొంతం చేసుకుంది. కాగా ఈ జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మెంటార్‌గా వ్యవహరిన్నాడు. దీంతో అతడి కుమారుడిని జట్టులోకి తీసుకోవడంపై సహజంగానే విమర్శలు వినిపించాయి. ఇందుకుతోడు రైతు ఆందోళనల విషయంలో అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై సచిన్ స్పందించిన తీరు, అర్జున్ ఐపీఎల్ అరంగేట్రాన్ని ముడిపెడుతూ కొంత మంది నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో జయవర్ధనే మాట్లాడుతూ.. ‘‘అర్జున్ తలపై సచిన్ కుమారుడు అనే అతిపెద్ద ట్యాగ్ ఉండటం సహజం. అయితే అదృష్టవశాత్తూ అతడు బ్యాట్స్‌మెన్ కాకుండా, బౌలర్ అయ్యాడు. నిజానికి అర్జున్ బౌలింగ్ తీరు పట్ల సచిన్ ఎంతో గర్వపడతారు. అయితే మేం కేవలం బౌలింగ్ నైపుణ్యాల ఆధారంగానే అతడిని ఎంపిక చేసుకున్నాం. ఇంతవరకు ముంబై తరఫున ఆడిన అర్జున్, ఇప్పుడు ఎంఐకి ఆడబోతున్నాడు. ఆట పట్ల తనకున్న శ్రద్ధ అమోఘం. తనపై ఒత్తిడి పడకుండా చూసుకోవడమే మా బాధ్యత. మిగతాది తనే చూసుకుంటాడు’’ అని పేర్కొన్నాడు. ఇక ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ జహీర్‌ఖాన్ సైతం అర్జున్ నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తాడని, తనొక అంకిత భావం గల యువ ఆటగాడు అని కితాబిచ్చాడు. ఇదిలా ఉండగా.. తనకు ఐపీఎల్ ఆడే అవకాశం కల్పించినందుకు తమకు ధన్యవాదాలు చెబుతూ అర్జున్ మాట్లాడిన వీడియోను ముంబై షేర్ చేసింది. A ballboy at Wankhede before 🏟️ Support bowler last season 💪 First-team player now 💙 It's showtime, Arjun! 😎#OneFamily #MumbaiIndians #IPLAuction pic.twitter.com/OgU4MGTPe1 — Mumbai Indians (@mipaltan) February 18, 2021 చదవండి: ఒక్క హైదరాబాద్ ప్లేయర్‌కీ చోటులేదు: అజారుద్దీన్ వీళ్లిద్దరు చూడముచ్చటగా ఉన్నారు! -
పరుగులే కాదు వికెట్లు కూడా తీయగలరు
వన్డేల్లో రెగ్యులర్ బౌలర్లు.. ఆల్‌రౌండర్లు.. పార్ట్‌టైమ్ బౌలర్లు ఉండడం సహజం. టీమిండియాలో సచిన్, సెహ్వాగ్ లాంటి వారు పార్ట్‌టైమ్ బౌలర్లుగా రాణించారు.. మ్యాచ్‌లు గెలిపించారు. కానీ ఏబీ డివిలియర్స్, మహేళ జయవర్దనే, స్టీఫెన్ ప్లెమింగ్, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, సయీద్ అన్వర్,మహ్మద్ యూసఫ్ ఇలా ఎవరిని చూసుకున్నా వీరంతా ప్రొఫెషనల్ బ్యాట్స్‌మెన్లుగానే పేరు పొందారు. బ్యాట్స్మెన్లుగా ఒకప్పుడు సత్తా చాటినవారు కొందరు ఉంటే.. మరికొందరు ఇప్పుడు కూడా రాణిస్తూనే ఉన్నారు. అయితే కెరీర్ మొత్తం బ్యాటింగ్‌కే పరిమితమైన ఈ ఆటగాళ్లు అరుదుగా బౌలింగ్ చేసేవారు. బ్యాట్స్మెన్లుగా తమ పేరిట ఎన్నో రికార్డులు సృష్టించిన వీళ్లు అప్పుడప్పుడు బౌలర్ అవతారమెత్తి వికెట్లు కూడా తీశారు. కొందరు మాత్రం మరో అడుగు ముందుకేసి మ్యాచ్‌లు గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా ఐసీసీ పాతతరం.. కొత్తతరం క్రికెటర్లు తమ జట్లకు బౌలింగ్ చేసిన ఒక మొమరబుల్ వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. (చదవండి : స్వదేశంలో కలిసొచ్చింది.. మరి విదేశంలో) ఈ వీడియోలో మనకు ఎప్పుడు బౌలింగ్ చేసినట్లు కనిపించని జయవర్దనే.. ఏబీ డివిలియర్స్.. ఎంఎస్ ధోని..స్టీఫెన్ ప్లెమింగ్ లాంటివారు బౌలింగ్ చేయడమే గాక వికెట్లు తీయడం చూపించారు. మీకు టైముంటే మాత్రం ఈ వీడియోను అస్సలు మిస్సవ్వద్దు అంటూ క్యాప్షన్ జతచేసింది. అయితే ఐసీసీ షేర్ చేసిన వీడియో కాస్త కొత్తగా ఉండడంతో వైరల్‌గా మారింది. (చదవండి : కూతురును చూసి మురిసిపోతున్న స్టార్ క్రికెటర్) 🤯 Virat Kohli, AB de Villiers, Mahela Jayawardene ... picking up international wickets! Here's a video you don't want to miss 😄 pic.twitter.com/IkROsA3tew — ICC (@ICC) December 16, 2020 -
ఆధారాల్లేవ్
కొలంబో: ఒక రాజకీయ నాయకుడి ఆరోపణలను ప్రామాణికంగా తీసుకొని మ్యాచ్ ఫిక్సింగ్పై విచారణ పేరుతో తమ దిగ్గజ క్రీడాకారులను అవమానిస్తున్నారంటూ దేశంలో తీవ్ర విమర్శలు రావడంతో శ్రీలంక ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో లంక పరాజయంపై ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి కనీస ఆధారాలు లేవని, ఇకపై ఎలాంటి విచారణ ఉండబోదని లంక పోలీసులు స్పష్టం చేశారు. మాజీ కెప్టెన్లు కుమార సంగక్కర, మహేలా జయవర్ధనేల వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత ఇక సందేహించేందుకు ఎలాంటి అవకాశం కనిపించలేదని వారు వెల్లడించారు. భారత్ గెలిచిన నాటి ఫైనల్‌ను కొందరు ఫిక్స్ చేశారంటూ అప్పటి క్రీడా మంత్రి మహిదానంద అలుత్గమగే ఆరోపించారు. ఆ వెంటనే ప్రభుత్వం దీనిపై విచారించమంటూ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ డివిజన్‌ను ఆదేశించింది. ‘మహిదానంద చేసిన 14 ఆరోపణల్లో ఒక్కదానికీ కనీస ఆధారం లేదు. మున్ముందు ఆటగాళ్లను ప్రశ్నించాల్సిన అవసరమూ రాదు. మా అంతర్గత చర్చల తర్వాత విచారణను ముగించాలని నిర్ణయించుకున్నాం. మా నివేదికను కేంద్ర క్రీడా శాఖ కార్యదర్శికి పంపిస్తాం’ అని దర్యాప్తు అధికారి జగత్ ఫొన్సెకా స్పష్టం చేశారు. నాటి చీఫ్ సెలక్టర్ అరవింద డిసిల్వాతో పాటు కెప్టెన్ సంగక్కర, సీనియర్ బ్యాట్స్‌మన్ జయవర్ధనే, ఓపెనర్ తరంగలను పోలీసులు విచారించారు. ఫైనల్ మ్యాచ్ చివరి నిమిషంలో తుది జట్టులో నలుగురు ఆటగాళ్లను మార్చడంపై సందేహాలున్నాయని మహిదానంద ఆరోపించారు. ‘దీనిపై కూడా స్పష్టమైన వివరణ లభించింది. కాబట్టి జట్టులోని మిగతా ఆటగాళ్లను విచారించడం కూడా అనవసరమని భావించాం’ అని ఫొన్సెకా చెప్పారు. ఫైనల్ జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత ఇలా వ్యవహరించడంపై తొలి రోజునుంచే పలువురు క్రికెట్ అభిమానులు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శించారు. మాకూ అనుమానాల్లేవు... 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫలితంపై తమకు ఎలాంటి సందేహాలు లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) కూడా స్పష్టం చేసింది. మ్యాచ్ జరిగిన తీరును అనుమానించాల్సిన అవసరమే లేదని ఐసీసీ ఏసీయూ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ చెప్పారు. ‘ఈ మ్యాచ్ గురించి ఇటీవల వచ్చిన ఆరోపణలపై మేం కూడా దృష్టి పెట్టాం. కొత్తగా విచారణ జరిపేందుకు కావాల్సిన అంశాలు కూడా ఏమీ లేవు’ అని ఆయన పేర్కొన్నారు. -
టీమిండియా కోచ్ రేసులో జయవర్థనే..!
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్ రేసులో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్థనే ముందంజలో ఉన్నట్లు సమాచారం. టీమిండియా కోచ్ పదవిపై జయవర్థనే అత్యంత ఆసక్తిగా ఉన్నాడు. త్వరలోనే అతడు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి కొత్తగా వయసు, అనుభవం నిబంధనలు తీసుకొచ్చింది. అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు 60 ఏళ్ల వయసు మించరాదని పేర్కొంది. ప్రధాన కోచ్ సహా బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌ను తిరిగి నియమించుకోనుంది. జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా ఆయా పదవులకు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ సూచించింది. ప్రస్తుతం కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు జయవర్థనేతో పాటు టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిరెస్టన్, టామ్ మూడీ, వీరేంద్ర సెహ్వాగ్‌లు ఆసక్తిగా ఉన్నారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు మహేలా జయవర్ధనే కోచ్‌గా ఎంపికైన తర్వాత జరిగిన మూడు ఎడిషన్లలో రెండుసార్లు ఆ జట్టు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. దీంతో పాటు ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలతో అతడికి మంచి సాన్నిహిత్యం ఉండటం కూడా కలిసొచ్చే అంశం. ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌కు ప్రపంచకప్ ముగిసే నాటికి పదవీకాలం పూర్తయ్యింది. అయితే వెస్టిండీస్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ వీరికి 45 రోజుల గడువును పెంచింది. -
ఇప్పుడు చెప్పండ్రా.. మలింగా హేటర్స్!
లండన్ : లసిత్ మలింగా.. ఇప్పుడు శ్రీలంక అభిమానులకు ఆరాధ్య దైవం. శుక్రవారం ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను ఒంటి చేత్తో గెలిపించిన సీనియర్ ఆటగాడు. 300 పైచిలుకు స్కోర్లను అవలీలగా సాధిస్తున్న ఇంగ్లండ్‌ను 233 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించకుండా మట్టికరిపించిన బౌలర్. ప్రపంచకప్ టైటిల్ ఆశలను సజీవంగా నిలిపిన సూపర్ బౌలర్. కానీ వారం రోజుల క్రితం.. ఇదే మలింగా అభిమానుల దృష్టిలో అన్‌ఫిట్ ఆటగాడు. పొట్ట ఉన్న క్రికెటర్. రిటైర్మెంట్ ప్రకటించాల్సిన ఆటగాడు. ఈ నేపథ్యంలోనే శ్రీలంక మాజీకెప్టెన్ మహేల జయవర్థనే ‘ఇప్పుడు చెప్పండ్రా మలింగా హేటర్స్’ అంటున్నాడు. ‘ఓ పుస్తకం కవర్ పేజీ చూసి దానిపై ఓ నిర్ణయానికి రాకుడదూ.. మలింగా నీ బౌలింగ్ అద్భుతం’ అంటూ మలింగా షర్ట్‌లెస్ ఫొటోను జత చేస్తూ ట్వీట్ చేశాడు. వారం రోజుల క్రితం ఈ షర్ట్‌లెస్ ఫొటోపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అతని శరీరాకృతిని ప్రస్తావిస్తూ అభిమానులు అభ్యంతరకరమైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు మలింగా తన ఆటతోనే బదులిచ్చాడు. తాను ఎంత కీలకమైన ఆటగాడినో నిరూపించుకున్నాడు. ఇక మలింగా బౌలింగ్ వీరంగానికి బెయిర్‌స్టో డకౌట్ కాగా.. విన్స్ (14), కెప్టెన్ మోర్గాన్ (21), బట్లర్ (10)లు పెవిలియన్ బాటపట్టారు. టాపర్డర్‌ను మలింగా దెబ్బతీయగా.. ధనంజయ డిసిల్వా (3/32) లోయర్ ఆర్డర్ పనిపట్టడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. మరోవైపు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్టోక్స్ (89 బంతుల్లో 82 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసినా.. శ్రీలంక పక్కా ప్రణాళికతో అతన్నికట్టడి చేసింది. స్టోక్స్ బ్యాటింగ్ గురించి మ్యాచ్ అనంతరం మలింగా మాట్లాడుతూ.. స్టోక్స్ ఎంత దాటిగా ఆడగలడో మాకు తెలుసు. అప్పటికే అతను వరుస బౌండరీలతో జోరు ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో అతన్ని స్టాక్‌బాల్స్ వ్యూహంతో కట్టడి చేశాం. లూస్ బంతులు వేయకుండా.. లైన్ అండ్ లెంగ్త్‌కు బౌన్సర్లతో కూడిన వైవిధ్యమైన బంతులు వేశాం. పరుగులు ఇవ్వకుండా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకురావడమే మా ప్రణాళిక. దాన్ని విజయవంతంగా అమలు చేశాం.’ అని మలింగా చెప్పుకొచ్చాడు. ఇక మలింగా దిగ్గజమంటూ (4/43) ప్రదర్శనను శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే కొనియాడాడు. View this post on Instagram Well bowled Mali!!! Thought i would share the most talked about picture last week for all you fans..😉👍👊 A post shared by Mahela Jayawardena (@mahela27) on Jun 21, 2019 at 10:54am PDT