రెండో వన్డేలో పాక్ చిత్తు | in second oneday pakistan defeated | Sakshi
Sakshi News home page

రెండో వన్డేలో పాక్ చిత్తు

Aug 27 2014 12:41 AM | Updated on Sep 2 2017 12:29 PM

రెండో వన్డేలో పాక్ చిత్తు

రెండో వన్డేలో పాక్ చిత్తు

కెప్టెన్ మాథ్యూస్ (115 బంతుల్లో 93; 8 ఫోర్లు), తిసార పెరీరా (36 బంతుల్లో 65; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక విజయం సాధించింది.

 77 పరుగులతో శ్రీలంక విజయం

హంబన్‌టోట: కెప్టెన్ మాథ్యూస్ (115 బంతుల్లో 93; 8 ఫోర్లు), తిసార పెరీరా (36 బంతుల్లో 65; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక విజయం సాధించింది. మంగళవారం ఇక్కడి రాజపక్స స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లంక 77 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది.
 
మహేళ జయవర్ధనే (74 బంతుల్లో 67; 8 ఫోర్లు) తో నాలుగో వికెట్‌కు 122 పరుగులు జోడించిన మాథ్యూస్... ఏడో వికెట్‌కు పెరీరాతో 9.3 ఓవర్లలోనే 87 పరుగులు జోడించి తమ జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. అనంతరం పాకిస్థాన్ 43.5 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. మొహమ్మద్ హఫీజ్ (49 బంతుల్లో 62; 9 ఫోర్లు), అహ్మద్ షహజాద్ (80 బంతుల్లో 56; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా... మిస్బా (36), ఫవాద్ (30) ఫర్వాలేదనిపించారు.

బౌలింగ్‌లోనూ రాణించిన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పెరీరా 19 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తాజా ఫలితంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. చివరి మ్యాచ్ శనివారం దంబుల్లాలో జరుగుతుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement