IPL 2022: ఆ దేశంలో ఐపీఎల్‌ ప్రసారాలు బంద్

IPL 2022: Tournament Broadcast Goes Off In Sri Lanka Amid Economic Crisis - Sakshi

IPL 2022 Broadcast Goes Off In Sri Lanka: తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ద్వీప దేశం శ్రీలంకలో ఐపీఎల్ ప్రసారాలు కూడా బంద్ అయ్యాయి. ప్రసార హక్కుదారులకు చెల్లించేందుకు డబ్బుల్లేక అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే యుప్ టీవీ, ఎస్ఎల్ఆర్సీ, డయలాగ్ టీవీ, పియో టీవీ ఛానల్‌లు క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ప్రసారాలను నిలిపి వేశాయి. దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) నెలకొన్న నేపథ్యంలో అక్కడి ప్రజలు ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూసి ఎంజాయ్‌ చేసే మూడ్‌లో లేరని, అందుకే ఐపీఎల్‌ టెలికాస్ట్‌పై అంతగా ఫోకస్‌ పెట్టలేదని అక్కడి మీడియా వెల్లడించింది. 

మరోవైపు పేపర్ కాస్ట్ పెరగడంతో పాటు సిబ్బంది జీతాలివ్వలేక పత్రికలు ప్రింటింగ్ చేయడం మానేశాయి. కనీసం డిజిటల్‌ పేపర్లలో కూడా ఐపీఎల్‌ వార్తల ప్రస్తావన లేదు. ఐపీఎల్‌లో ఆడుతున్న లంక క్రికెటర్ల వనిందు హసరంగ (ఆర్సీబీ), భానుక రాజపక్స (పంజాబ్‌), దుష్మంత చమీర (లక్నో సూపర్ జెయింట్స్), చమిక కరుణరత్నే (కోల్‌కతా నైట్ రైడర్స్)లను పట్టించుకునే నాధుడే లేడు. మరోవైపు దేశంలో నెలకొన్న దుర్భర పరిస్థితులపై ఐపీఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న లంక మాజీలు గళం విప్పుతున్నారు. 
చదవండి: మీతో కాకపోతే చెప్పండి.. నేనొస్తా..! సన్‌రైజర్స్‌, లక్నో జట్లకు బెంగాల్‌ మంత్రి ఆఫర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top