
లెజెండ్స్ టి20 లీగ్‌లో జయవర్ధనే!
సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్‌ల కలయికలో రానున్న లెజెండ్స్ టి20 లీగ్‌లో శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేళ జయవర్ధనే కూడా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి...
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్‌ల కలయికలో రానున్న లెజెండ్స్ టి20 లీగ్‌లో శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేళ జయవర్ధనే కూడా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు అతడిని సంప్రదించినట్టు సమాచారం. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన అతను ప్రైవేట్ టి20 లీగ్‌ల్లో ఆడాలని చూస్తున్నాడు. లెజెండ్స్ టి20 లీగ్ మ్యాచ్‌లకు ఎలాంటి అధికారిక హోదా ఉండకుండా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లుగానే పరిగణిస్తారు. భారత్ నుంచి కుంబ్లే, గంగూలీ, లక్ష్మణ్‌లు కూడా బీసీసీఐ నుంచి అనుమతి లభిస్తే ఆడే అవకాశాలున్నాయి.