IND Vs AUS 2023: Mahela Jayawardene Backs Australia To Win Tough Series In India - Sakshi
Sakshi News home page

IND vs AUS: భారత్‌ టెస్టు సిరీస్‌ గెలవడం కష్టమే.. శ్రీలంక దిగ్గజం సంచలన వ్యాఖ్యలు!

Feb 6 2023 11:13 AM | Updated on Feb 6 2023 1:30 PM

Mahela Jayawardene backs Australia to win tough series in India - Sakshi

ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య జరగనున్న టెస్టు సిరీస్‌ నేపథ్యంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ఆసక్తికర వాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీను ఆస్ట్రేలియా 2-1తో సొంతం చేసుకుంటుందని జయవర్ధనే జోస్యం చెప్పాడు.  పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు.. స్వదేశంలో పటిష్టమైన టీమిండియాకు గట్టిపోటీ ఇస్తుందని అతడు అభిప్రాయపడ్డాడు.

కాగా చివరసారిగా 2004లో భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అప్పటినుంచి స్వదేశంలో కంగూరులపై భారత్‌ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తుంది. ఇక ఓవరాల్‌గా 2015 తర్వాత కూడా ఆస్ట్రేలియా ఒక్కసారి కూడా ట్రోఫీని సొం‍తం చేసుకోలేకపోయింది. చివరగా 2020-21లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. 

ఆస్ట్రేలియాదే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ..
"ఆసీస్‌-భారత్‌ మధ్య బోర్డర్ గవాస్కర్ ఎప్పటికీ చారిత్రాత్మక సిరీస్‌గా ఉంటుంది. ఇక భారత పరిస్థితులకు ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఆస్ట్రేలియా వద్ద అద్భుతమైన బౌలింగ్‌ యూనిట్‌ ఉంది. కాబట్టి ఆసీస్‌ బౌలర్లను భారత బ్యాటర్లు ఎంతవరకు అడ్డుకుంటారో వేచి చూడాలి. అయితే తొలి మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో వాళ్లకి ఒక​అద్భుతమైన ప్రారంభం దొరికొనట్లు అవుతోంది.

కానీ సిరీస్‌ విజేత ఎవరన్నది ఊహించడం చాలా కష్టం.  నా వరకు అయితే ఈ సిరీస్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా అన్ని విధాలుగా పైచేయి సాధిస్తుందని భావిస్తున్నాను. ఆస్ట్రేలియా 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంటుందని అనుకుంటున్నాను. అయితే భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు మాత్రం తీవ్రమైన పోటీ ఉంటుంది" అని జయవర్ధనే ది ఐసీసీ రివ్యూ తాజా ఎడిషన్‌లో పేర్కొన్నాడు. కాగా నాగ్‌పూర్‌ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి  ఇరు జట్లు మధ్య జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. ఆంధ్ర ఆటగాడు అరంగేట్రం! కిషన్‌కు నో ఛాన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement