IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. ఆంధ్ర ఆటగాడు అరంగేట్రం! కిషన్‌కు నో ఛాన్స్‌

Rohit Sharma, Dravid set to hand KS Bharat Test DEBUT after warming  - Sakshi

నాగ్‌పూర్‌ వేదికగా ఫిబ్రవరి9 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. అయితే తొలి టెస్టుకు ముందు జట్టు కూర్పు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వికెట్‌ కీపర్‌ ఎవరని ఎంపిక చేయాలన్న విషయంలో జట్టు మెనేజెమెంట్‌ తర్జన భర్జన అవుతోంది. ఎందుకంటే రెగ్యూలర్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ను తొలిసారి టెస్టులకు సెలక్టర్లు ఎంపిక చేశారు. అదేవిధంగా దాదాపు రెండేళ్ల నుంచి టెస్టు అరేంగట్రం కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ శ్రీకర్‌ భరత్‌కు కూడా ఆసీస్‌తో టెస్టు జట్టులో చోటు దక్కింది. భరత్‌ గత కొంత కాలంగా జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ ప్లేయింగ్‌ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కడం లేదు.

ఇక భారత స్టార్‌ ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ మరో వికెట్‌ కీపర్‌గా జట్టుకు అందుబాటులో ఉన్నప్పటికీ.. టెస్టుల్లో మాత్రం కేఎల్‌కు వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు అప్పజెప్పే సూచనలు కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో తొలి టెస్టులో వికెట్‌ కీపర్‌గా కిషన్‌ కంటే శ్రీకర్‌ భరత్‌వైపే జట్టు మెనేజెమెంట్‌ ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

శ్రీకర్‌ భరత్‌ అరంగేట్రం..
ఆంధ్ర వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఖాయం అన్పిస్తోంది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు భారత తుది జట్టులో భరత్‌ ఛాన్స్‌ దక్కే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. గత రెండేళ్లగా కేఎల్‌ రాహుల్‌ అనేక సార్లు గాయాల బారిన పడ్డాడు. కాబట్టి టెస్టుల్లో వికెట్‌ కీపింగ్‌ అతడికి సరికాదు. టెస్టులకు స్పెషలిస్టు వికెట్‌ కీపర్లు అవసరం. ప్రస్తుతం జట్టులో భరత్‌, ఇషాన్‌ కిషన్‌ స్పెషలిస్టు వికెట్‌ కీపర్లగా ఉన్నారు. అయితే వీరిద్దరిలో భరత్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో పేర్కొన్నారు.

న్యూజిలాండ్‌పై తొలి సారిగా..
2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భరత్‌కు తొలి సారిగా భారత జట్టులో చోటు దక్కింది. అయితే తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. కానీ రెండో టెస్టులో సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన భరత్‌.. తన వికెట్‌ కీపింగ్‌ స్కిల్స్‌తో అందరిని అకట్టుకున్నాడు.అదే విదంగా ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా భరత్‌కు  చోటు దక్కింది. కానీ రెండు మ్యాచ్‌లకు కూడా బెంచ్‌కే పరిమితమ్యాడు. ఇక భరత్‌కు దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది.
చదవండిSA20: క్లాసెన్ సూపర్‌ సెంచరీ.. 151 పరుగుల తేడాతో సూపర్ జెయింట్స్ భారీ విజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top