T20 WC 2026: సెమీ ఫైనల్‌ చేరే జట్లు ఇవే! | Former Indian cricketers WC Winners Pick T20 WC 2026 semifinalists | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌-2026: సెమీ ఫైనల్‌ చేరే జట్లు ఇవే!

Jan 28 2026 10:20 AM | Updated on Jan 28 2026 10:48 AM

Former Indian cricketers WC Winners Pick T20 WC 2026 semifinalists

పొట్టి క్రికెట్‌ మహా సంగ్రామానికి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 7న ఈ ఐసీసీ ఈవెంట్‌కు తెరలేవనుంది. భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌-2026 ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్లో ఇరవై దేశాలు పాల్గొంటున్నాయి.

నాలుగు గ్రూపులు
గ్రూప్‌-ఎ నుంచి డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియా (India), పాకిస్తాన్‌ (Pakistan), అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌ పోటీ పడుతుండగా.. గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియా (Australia), ఐర్లాండ్‌, ఒమన్‌, శ్రీలంక, జింబాబ్వే ఉన్నాయి. గ్రూప్‌-సిలో ఇంగ్లండ్‌ (England), వెస్టిండీస్‌, నేపాల్‌, ఇటలీ, స్కాట్లాండ్‌ ఉన్నాయి. బంగ్లాదేశ్‌ నిష్క్రమణతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ వచ్చి చేరింది.

ఇక గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, యూఏఈ, కెనడా పోటీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్‌ సెమీ ఫైనలిస్టులు, ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై మాజీ క్రికెటర్లు తమ అంచనా తెలియజేస్తున్నారు.

ఈసారి భారత్‌- ఆస్ట్రేలియా ఫైనల్‌ చేరతాయని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ జోస్యం చెప్పాడు. తాజాగా సెమీ ఫైనలిస్టుల గురించి భారత మాజీ క్రికెటర్లు స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో భాగంగా తమ అంచనాలను తెలిపారు. 

సెమీ ఫైనల్‌ చేరే జట్లు ఇవే!
ఇందులో భాగంగా 2007 టీ20 ప్రపంచకప్‌ విన్నర్‌ రాబిన్‌ ఊతప్ప మాట్లాడుతూ.. టీమిండియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ టాప్‌-4లో నిలుస్తాయని అభిప్రాయపడ్డాడు.

పాకిస్తాన్‌ కూడా వస్తుంది
ఇక టీ20 వరల్డ్‌కప్‌-2007 విజేత ఇర్ఫాన్‌ పఠాన్‌ మాట్లాడుతూ.. తన అభిప్రాయం ప్రకారం ఈసారి టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో పాటు పాకిస్తాన్‌ సెమీస్‌కు అర్హత సాధిస్తుందని పేర్కొన్నాడు. మరోవైపు.. భారత మాజీ టెస్టు ప్లేయర్‌ ఛతేశ్వర్‌ పుజారా.. టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌ చేరతాయని జోస్యం చెప్పాడు.

గత ఎడిషన్‌ విజేత టీమిండియా
అదే విధంగా.. మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా పూజారా అభిప్రాయంతో ఏకీభవించాడు. కాగా గత వరల్డ్‌కప్‌ ఎడిషన్‌ (2024)లో భారత్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌లతో పాటు అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్‌ సెమీస్‌ చేరిన విషయం తెలిసిందే. 

అయితే తొలి సెమీ ఫైనల్లో అఫ్గన్‌ను సౌతాఫ్రికా.. రెండో సెమీస్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను భారత్‌ ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించాయి. ఇక టీమిండియా ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 

చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్‌ అవుట్‌.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement