ధోనీ ఆ విషయం అప్పుడే చెప్పాడు! | MS Dhoni Clear-Cut Message Ex-CSK Teammate Ahead IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: ధోనీ ఆ విషయం అప్పుడే చెప్పాడు!

Mar 14 2026 3:15 PM | Updated on Mar 14 2026 3:21 PM

MS Dhoni Clear-Cut Message Ex-CSK Teammate Ahead IPL 2026

ఐపీఎల్‌ 18వ సీజన్‌ ప్రారంభానికి మరో 15 రోజుల సమయం మిగిలి ఉంది.ఇప్పటికే లీగ్‌లోని ఆయా జట్ల ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను మ్యాచ్‌లు ఆడేందుకు సన్నద్ధం చేస్తున్నాయి. అయితే సీఎస్కే కెప్టెన్‌గా రుతురాజ్‌గైక్వాడ్‌ పేరును ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. 

దీంతో ధోనీకి ఈ సీజన్‌ చివరిదని భావిస్తున్న అభిమానులు కెప్టెన్‌గా ఒక్క మ్యాచ్‌కైనా నాయకత్వం వహిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. కానీ ధోనీ కెప్టెన్సీ విషయమై వేరే వాళ్లకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని మేనేజ్‌మెంట్‌కు ఇది వరకే స్పష్టం చేశాడు. దీంతో ధోనీని ఈసారి కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. 

అయితే ఈసారి ఐపీఎల్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడతాడా లేదంటే కొన్నింటికే పరిమితమవుతాడా అన్నది చూడాలి. కాగా ధోనీ కెప్టెన్సీ విషయమై ఇది వరకే తనకు ఒక సందేశాన్ని పంపించాడని భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు.‘ఐపీఎల్‌ ప్రారంభమవు తుందంటే అందరి కళ్లు సీఎస్‌కే మీదకే మళ్లుతాయి. ఎందుకంటే భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న ధోనీ ఐపీఎల్‌లోనూ నాయకుడిగా అంతే సక్సెస్‌ రేట్‌ను కలిగి ఉన్నాడు. 

ఈసారి కెప్టెన్సీకి ధోనీ దూరమైనప్పటికీ అతడి సలహాలు మాత్రం జట్టుకు ఉంటాయనడంలో సందేహం లేదు. కెప్టెన్‌గా కొనసాగడానికి బదులు ఆటగాడిగా ఉండేందుకు ఇష్టపడుతున్నట్లు ధోనీ ఇది వరకే నాతో పేర్కొన్నాడు.’ అని పఠాన్‌ తెలిపాడు. ఇక ధోనీకి ఇదే చివరి సీజన్‌ అని భావిస్తున్న తరుణంలో అటు సీఎస్‌కే యాజమాన్యం కూడా మాజీ వికెట్‌కీపర్‌ విషయంలో భారీగానే ప్లాన్‌ చేస్తుంది. ఎలాగైనా టైటిల్‌ కొట్టి ధోనీకి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని సీఎస్కే భావిస్తోంది. 

మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2026లో భాగంగా తొలి విడతలో 20 మ్యాచ్‌లు జరగనున్నట్లు ఐపీఎల్‌ యాజమాన్యం పేర్కొంది. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను కూడా ఇప్పటికే విడుదల చేసింది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూర్తి షెడ్యూల్‌ను తర్వాత విడుదల చేస్తామని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.

చదవండి:  IPL 2026: ‘ప్రపంచం అతడిని మర్చిపోయింది’

Advertisement
 
Advertisement
Advertisement