సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ (PC: BCCI/SRH)
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-2026 ప్రయాణాన్ని మార్చి 28న మొదలుపెట్టనుంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తొలుత తలపడనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 2న కోల్‌కతాతో, ఏప్రిల్ 5న లక్నోతో, ఏప్రిల్ 11న పంజాబ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.
తొలి విడతలో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌కు సంబంధించి ఈ నాలుగు మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ సన్‌రైజర్స్ తుదిజట్టు కూర్పు గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
టాప్-3లో వీరే
‘‘నా దృష్టిలో సన్‌రైజర్స్ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే. ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ టాప్-3లో ఆడతారు. నితీశ్ రెడ్డిని నాలుగో స్థానంలో ఆడించాలన్నది నా అభిప్రాయం.
టీ20 క్రికెట్‌లో అత్యుత్తమంగా ఫినిషింగ్ ఇవ్వగల ఆటగాడు అతడు. లేదంటే హెన్రిచ్ క్లాసెన్‌ను నాలుగో స్థానంలో ఆడించి.. నితీశ్‌ను ఐదో ప్లేస్‌లో పంపవచ్చు.
ఇక అనికేత్ వర్మ గతేడాది అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో భారీ సిక్సర్లు బాదాడు. అతడు ఆరు లేదంటే ఏడో స్థానంలో ఆడించాలి. వీరితో పాటు ఓ అన్‌క్యాప్డ్ ఇండియన్ బ్యాటర్‌కూ స్థానం దక్కుతుంది.
కమిన్స్ ఎనిమిదో స్థానంలో
బౌలర్ల విభాగానికి వస్తే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎనిమిదో స్థానంలో వస్తాడు. బ్యాట్‌తోనూ అతడు అద్భుతం చేయగలడు. ఇక ఆ తర్వాత క్రియాన్స్ ఫులేట్రా, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగలు ఉండాలి.
భారత ఫాస్ట్‌బౌలర్లను తీసుకోవాలనుకుంటే జయదేవ్ ఉనాద్కట్, హర్షల్ పటేల్ బెటర్’’ అని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు. కాగా మినీ వేలంలో సన్‌రైజర్స్ అనూహ్య రీతిలో లియామ్ లివింగ్‌స్టోన్‌ను ఏకంగా రూ. 13 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
అయితే, బంగర్ మాత్రం అతడికి తుదిజట్టులో చోటే దండగ అన్న రీతిలో అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. కాగా గతేడాది ఆర్సీబీ తరఫున లివింగ్‌స్టోన్ విఫలమయ్యాడు.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ జట్టు
సలీల్ అరోరా, ట్రవిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, రవిచంద్రన్ స్మరణ్, అనికేత్ వర్మ, అభిషేక్ శర్మ, బ్రైడన్ కార్సే, హర్ష్ దూబే, జాక్ ఎడ్వర్డ్స్, లియామ్ లివింగ్‌స్టోన్, కమిందు మెండిస్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ మావి, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అమిత్ కుమార్, క్రియాన్స్ ఫులెట్రా, ప్రఫుల్ హింజ్, ఇషాన్ మలింగ, హర్షల్ పటేల్, సాకిబ్ హుస్సేన్, శివంగ్ కుమార్, ఓంకార్ తర్మలే, జయదేవ్ ఉనాట్కట్, జీషన్ అన్సారీ.
సంజయ్ బంగర్ ఎంచుకున్న బెస్ట్ ప్లేయింగ్ XII
ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, ఆర్ స్మరణ్, ప్యాట్ కమిన్స్, క్రెయిన్స్ ఫులెట్రా/జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగ, జయదేవ్ ఉనాద్క ట్, హర్షల్ పటేల్.
చదవండి: IPL 2026: విసిగిపోయాం.. రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా వార్నింగ్!?


