వెస్టిండీస్ యువ ఆటగాడు కెవిన్ విక్‌హామ్ తన అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో అదరగొట్టాడు. బంగ్లాదేశ్‌తో సిల్హెట్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో 23 ఏళ్ల విక్‌హామ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీలు సాధించి అందరిని ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేసిన విక్‌హామ్, రెండో ఇన్నింగ్స్‌లోనూ 78 రన్స్‌తో కీలక నాక్ ఆడాడు.
ఈ క్రమంలో విక్‌హామ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అరంగేట్ర టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఓ విండీస్ ప్లేయర్ హాఫ్ సెంచరీలు సాధించడం 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. చివరిగా విండీస్ లెజెండ్ సౌదత్ శివ్‌నారాయణ్ ఈ ఫీట్ సాధించాడు. 1978లో ఆస్ట్రేలియాపై శివ్‌నారయన్ తన అరంగేట్ర టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ ఫిప్టీలు సాధించాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన 8వ విండీస్ బ్యాటర్‌గా విక్‌హామ్ రికార్డులకెక్కాడు.
అరంగేట్ర టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఫిప్టీలు చేసిన విండీస్ బ్యాటర్ల జాబితా
ఫ్రాంక్ డి కైరెస్ – 80 & 70 (వర్సెస్ ఇంగ్లాండ్, 1930)
జార్జ్ గ్రాంట్ – 53* & 71* (వర్సెస్ ఆస్ట్రేలియా, 1930)
బ్రెయిన్ డేవిస్ – 54 & 58 (వర్సెస్ ఆస్ట్రేలియా, 1965)
క్లైవ్ లాయిడ్ – 82 & 78* (వర్సెస్ భారత్, 1966)
లారెన్స్ రోవ్ – 214 & 100* (వర్సెస్ న్యూజిలాండ్, 1972)
గోర్డాన్ గ్రీనిడ్జ్ – 93 & 107 (వర్సెస్ భారత్, 1974)
సౌదత్ శివ్‌నారాయణ్ – 53 & 63 (వర్సెస్ ఆస్ట్రేలియా, 1978)
కెవిన్ విక్‌హామ్ – 61 & 57* (వర్సెస్ బంగ్లాదేశ్, 2026)*
కాగా ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో విండీస్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. విండీస్ ప్రస్తుతం 309 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.


