source: X
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు ముందు భారత్-ఏ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. ఈ టోర్నీ కోసం తొలుత ఎంపికైన రజత్ పాటిదార్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. తనకు ఉన్న గాయాల సమస్యలను దృష్టిలో పెట్టుకుని 50 ఓవర్ల ఫార్మాట్‌కు తనను పరిగణనలోకి తీసుకోవద్దని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. దీంతో పాటిదార్ స్థానంలో యువ ఆల్‌రౌండర్ ఆయుష్ బదోనిని ఎంపిక చేశారు.
రింకూ సింగ్‌కు వైస్ కెప్టెన్సీ
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత-ఏ జట్టుకు పాటిదార్ వైస్ కెప్టెన్ కూడా. ఇప్పుడు అతడు తప్పుకోవడంతో రింకూ సింగ్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ టోర్నీలో తిలక్ వర్మ భారత-ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీలో భారత-ఏ జట్టు తరఫున టీ20 స్టార్స్ అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ తదితరులు ఆడుతున్నారు.
ఏసీసీ పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీ దోహా వేదికగా నవంబర్ 19 నుంచి జరుగనుంది. ఈ టోర్నీలో భారత్-ఏ జట్టుతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్లు, హాంగ్‌కాంగ్, యూఏఈ, నేపాల్ రెగ్యులర్ జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ నవంబర్ 22న జరుగనుంది.
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు సవరించిన భారత్-ఏ జట్టు..
అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ [WK], తిలక్ వర్మ [C], రింకు సింగ్ [VC], కుమార్ కుషాగ్రా [WK], సూర్యాంశ్ షెడ్గే, షహబాజ్ అహ్మద్, విప్రజ్ నిగమ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్షద్ ఖాన్, ఆయుష్ బదోని
ఇదీ చదవండి: అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్


