భీకర ఫామ్‌లో బదోని.. డబుల్‌ సెంచరీ తర్వాత సెంచరీ | Ranji Trophy: Ayush Badoni Slams Century Against Jharkhand | Sakshi
Sakshi News home page

భీకర ఫామ్‌లో బదోని.. డబుల్‌ సెంచరీ తర్వాత సెంచరీ

Oct 26 2026 6:39 PM | Updated on Oct 26 2026 6:53 PM

Ranji Trophy: Ayush Badoni Slams Century Against Jharkhand

source: X

రంజీ ట్రోఫీ 2026-27లో ఢిల్లీ కెప్టెన్‌ ఆయుశ్‌ బదోని భీకర ఫామ్‌లో ఉన్నాడు. బెంగాల్‌పై తొలి మ్యాచ్‌లో సెంచరీకి చేరువలో (85) ఔటైన అతడు.. ఆతర్వాత గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా డబుల్‌ సెంచరీతో (217) విరుచుకుపడ్డాడు.

బదోని తాజాగా మరోసారి విజృంభించాడు. జార్ఖండ్‌తో ఇవాళ మొదలైన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో మరో సెంచరీ బాదాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 122 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీతో బదోని వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో 85, 217, 106* స్కోర్లు చేసినట్లైంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. బదోని సెంచరీతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఢిల్లీ భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. బదోనితో పాటు సుమిత్‌ మాథుర్‌ అజేయ అర్దశతకంతో (50) క్రీజ్‌లో ఉన్నాడు.

ఔటైన వారిలో ప్రియాంశ్‌ ఆర్య 39, సనత్‌ సాంగ్వాన్‌ 37, యశ్‌ ధుల్‌ 29, ఆయుశ్‌ దొసేజా 21, అనూజ్‌ రావత్‌ 18 పరుగులు చేశారు. జార్ఖండ్‌ బౌలర్లలో ఉత్కర్ష్‌ సింగ్‌, ఖురేషి తలో 2 వికెట్లు తీయగా.. అనుకూల్‌ రాయ్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. 

ఇదీ చదవండి: షాదాబ్‌ రికార్డు సెంచరీ.. వన్డేల్లో స్థానాల వారీగా అత్యధిక స్కోర్లు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement