టీమిండియాకు శుభవార్త.. ఆ ఇద్దరు వచ్చేస్తున్నారు! | Bumrah Pant likely to play for India A in 3rd unofficial Test Vs New Zealand A | Sakshi
Sakshi News home page

టీమిండియాకు శుభవార్త.. ఆ ఇద్దరు వచ్చేస్తున్నారు!

Oct 26 2026 6:49 PM | Updated on Oct 26 2026 7:00 PM

Bumrah Pant likely to play for India A in 3rd unofficial Test Vs New Zealand A

బుమ్రా, పంత్‌ (PC: BCCI)

న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెట్‌ జట్టుకు శుభవార్త అందింది. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ త్వరలోనే జట్టుతో చేరనున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు న్యూజిలాండ్‌- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

కాగా జపాన్‌ వేదికగా ఆసియా క్రీడలు-2026లో భాగంగా బుమ్రా చివరగా టీమిండియాకు ఆడాడు. ఈ ఈవెంట్లో పాకిస్తాన్‌తో ఫైనల్లో తలపడ్డ టీమిండియా పసిడి పతకం గెలిచింది. అయితే, ఆ తర్వాత బుమ్రాకు యాజమాన్యం విశ్రాంతినిచ్చింది. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లకు అతడిని ఎంపిక చేయలేదు.

అదే విధంగా.. న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌ల నుంచి కూడా బుమ్రాకు విశ్రాంతినిచ్చింది. అయితే, కివీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు మాత్రం బుమ్రాను ఎంపిక చేశారు సెలక్టర్లు. మరోవైపు.. టెస్టు స్పెషలిస్టు రిషభ్‌ పంత్‌.. ఇరానీ కప్‌ మ్యాచ్‌ సందర్భంగా గాయపడ్డాడు.

రెస్టాఫ్‌ ఇండియా జట్టుకు సారథ్యం వహించిన పంత్‌.. జమ్మూ కశ్మీర్‌పై జట్టును గెలిపించాడు. అయితే, ఈ మ్యాచ్‌ సందర్భంగా అతడు పక్కటెముకల నొప్పితో విలవిల్లాడాడు. దీంతో ఆటకు దూరమైన పంత్‌.. ప్రస్తుతం కోలుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌కు చేరుకున్న పంత్‌ ఫిట్‌నెస్‌లో పాసైనట్లు తెలుస్తోంది.

మరోవైపు.. సోమవారం ఇక్కడికి చేరుకున్న బుమ్రా ఫిట్‌నెస్‌ పరీక్ష ఎదుర్కోనున్నట్లు సమాచారం. అనంతరం వీరిద్దరు న్యూజిలాండ్‌ చేరుకుని.. భారత్‌- ‘ఎ’ జట్టు తరఫున నవంబరు 7న మొదలయ్యే మూడో అనధికారిక టెస్టులో ఆడనున్నట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో పేర్కొంది. కాగా ధ్రువ్‌ జురెల్‌ కెప్టెన్సీలో భారత్‌- ‘ఎ’ జట్టు శుక్రవారమే తొలి అనధికారిక టెస్టు మొదలుపెట్టింది. మూడో రోజు ఆట ముగిసే సరికి 284 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

న్యూజిలాండ్‌తో టెస్టులకు భారత జట్టు
శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), దేవదత్‌ పడిక్కల్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌- ఫిట్‌నెస్‌కు లోబడి), ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, అన్షుల్‌ కాంబోజ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్‌ కృష్ణ, ఆకాశ్‌ దీప్‌, సాయి సుదర్శన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్‌.

న్యూజిలాండ్‌-‘ఎ’తో అనధికారిక టెస్టులకు భారత్‌- ‘ఎ’ జట్టు
యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, దేవదత్‌ పడిక్కల్‌, సాయి సుదర్శన్‌, ధ్రువ్‌ జురెల్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), యశ్‌ రాథోడ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అన్షుల్‌ కాంబోజ్‌, ఆకిబ్‌ నబీ, ఆకాశ్‌ దీప్‌, ముకేశ్‌ చౌదరి, స్మరణ్‌ రవిచంద్రన్‌, మానవ్‌ సుతార్‌, ముకేశ్‌ కుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement