అక్టోబర్ 27 నుంచి కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న నిర్ణయాత్మక మూడో టెస్టు కోసం సౌతాఫ్రికా తమ తుది జట్టును ప్రకటించింది. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైన పేసర్ అన్రిచ్ నోర్జే స్ధానంలో.. గెరాల్జ్ కోయిట్జీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. అదేవిధంగా వికెట్ కీపర్‌గా ర్యాన్ రికెల్టన్‌ను ప్రోటీస్ టీమ్ మేనెజ్‌మెంట్ కొనసాగించింది.
అయితే మరోసారి స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. కాగా తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన సౌతాఫ్రికా.. రెండో టెస్టులో మాత్రం అద్భుతంగా పుంజుకుని ఆసీస్‌ను చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు కీలకమైన మూడో టెస్టులో సత్తాచాటి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్ భారీ షాక్ తగిలే అవకాశముంది. సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ గాయం కారణంగా కేప్‌టౌన్ టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. స్మిత్ ప్రస్తుతం మెడ నొప్పితో బాధపడుతున్నాడు. అతడు ఇంకా తన గాయం నుంచి కోలుకోలేదని ఆసీస్ హెడ్‌కోచ్ మెక్‌డొనాల్డ్ స్పష్టం చేశారు.
కానీ స్టార్ ప్లేయర్లు కెమెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిష్ మాత్రం జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో నిక్ మ్యాడిన్సన్‌పై సెలక్టర్లు వేటు వేశారు. ఈ క్రమంలో ఆసీస్ ఇన్నింగ్స్‌ను గ్రీన్, హెడ్ ప్రారంభించే అవకాశముంది.
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్
ఐడెన్ మార్క్రామ్, మార్క్వెస్ అకెర్‌మాన్, డేవిడ్ బెడింగ్‌హామ్, టెంబా బావుమా (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్‌కే, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, సైమన్ హార్మర్, కగిసో రబడా, కోయిట్జీ
చదవండి: IND vs NZ: 'అతడొక అద్భుతం.. టీమిండియాకు దొరికిన వజ్రం'


