సొంతగడ్డపై భారత్ 'ఎ' జట్టుతో జరగనున్న మూడు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ కోసం 19 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ (NZC) ప్రకటించింది. ఇందులో 11 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జట్టు కెప్టెన్‌గా రైస్ మారియు వ్యవహరించనున్నాడు.
అదేవిధంగా డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, జాక్ గిబ్సన్, మిచెల్ హే, టిమ్ రాబిన్సన్, జేడెన్ లెనాక్స్ వంటి స్టార్ ప్లేయర్లు ఈ జట్టులో ఉన్నారు. ఈ అనధికారిక మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించే ఆటగాళ్లకు భారత్ టెస్టు సిరీస్‌కు కివీస్ సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశముంది.
ఈ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ బెర్ట్ సట్‌క్లిఫ్ ఓవల్ వేదికగా అక్టోబర్ 24 నుంచి ఈ ప్రారంభం కానుంది. ప్రస్తుతం న్యూజిలాండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 1తో ఈ సిరీస్ ముగియనుంది. అనంతరం ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొదలు కానుంది.
తొలి అనధికారిక టెస్టుకు కివీస్-ఎ జట్టు
రైస్ మారియు (కెప్టెన్), మాట్ బాయిల్, మాక్స్ చూ, క్రిస్టియన్ క్లార్క్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, జాక్ గిబ్సన్, మిచెల్ హే (వికెట్ కీపర్), కర్టిస్ హీఫీ, టిమ్ రాబిన్సన్, ఫ్రేజర్ షీట్, సైమన్ కీన్, జేడెన్ లెనాక్స్, జారోడ్ మెక్కే
రెండో అనధికారిక టెస్టుకు కివీస్-ఎ జట్టు
రైస్ మారియు (కెప్టెన్), మాట్ బాయిల్, మిచెల్ హే (వికెట్ కీపర్), కర్టిస్ హీఫీ, క్రిస్టియన్ క్లార్క్, మాట్ ఫిషర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, జాక్ గిబ్సన్, సైమన్ కీన్, జేడెన్ లెనాక్స్, జారోడ్ మెక్కే, టిమ్ రాబిన్సన్, ఫ్రేజర్ షీట్.
మూడో అనధికారిక టెస్టుకు న్యూజిలాండ్ జట్టు
ఆది అశోక్, మాట్ బాయిల్, మాక్స్ చూ (వికెట్ కీపర్), డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, కర్టిస్ హీఫీ, కామ్ పాల్, హెన్రీ నికోల్స్, ఫ్రేజర్ షీట్, సైమన్ కీన్, నిక్ కెల్లీ, బెన్ లిస్టర్, రైస్ మారియు, జారోడ్ మెక్కే.
చదవండి: డబుల్ సెంచరీతో చెలరేగిన పాకిస్తాన్ ఓపెనర్


