పాకిస్తాన్‌ ఓపెనర్‌ డబుల్‌ సెంచరీ | Imam-ul-Haq Hits Unbeaten Double Century for OGDCL against Ghani Glass | Sakshi
Sakshi News home page

డబుల్‌ సెంచరీతో చెలరేగిన పాకిస్తాన్‌ ఓపెనర్‌

Oct 23 2026 3:30 PM | Updated on Oct 23 2026 3:38 PM

Imam-ul-Haq Hits Unbeaten Double Century for OGDCL against Ghani Glass

పాకిస్తాన్ స్టార్ ఓపెన‌ర్ ఇమామ్-అల్-హక్ దేశవాళీ క్రికెట్‌లోకి అదిరిపోయే పునరాగమనం చేశాడు. ప్రెసిడెంట్స్ ట్రోఫీలో  ‘ఆయిల్ అండ్ గ్యాస్ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్’ కు సారథ్యం వ‌హిస్తున్న ఇమామ్‌..  ఘాని జట్టుతో జ‌రిగిన  మ్యాచ్‌లో అద్భుత‌మైన డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇమామ్‌.. 311 బంతులు ఎదుర్కొని 19 ఫోర్లు, 2 సిక్స్‌లతో 200 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

అలీ జర్యాబ్‌తో కలిసి తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించిన ఇమామ్.. ఆ తర్వాత సాద్ ఖాన్‌తో కలిసి రెండో వికెట్‌కు 196 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫలితంగా ఓజీడీసీఎల్ జట్టు 9 వికెట్ల నష్టానికి 410 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో ఓజీడీసీఎల్‌కు 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఘాని జట్టు ప్రతిఘటించడంతో మ్యాచ్ డ్రా ముగిసింది


పాక్ జట్టులోకి తిరిగి వస్తాడా?
కాగా పాక్‌ టెస్టు జట్టులో చోటు కోల్పోయిన తర్వాత ఇమామ్‌ తిరిగి మైదానంలో కనిపించడం ఇదే తొలిసారి. ఇంగ్లండ్ టూర్ సమయంలో అతడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఆ పర్యటనలో భాగంగా లండ‌న్ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో గాయం కారణమని చెప్పి ఇమామ్ ఉల్ హక్ బ్యాటింగ్‌కు దిగలేదు.

కండరాలు పట్టేశాయని చెప్పి.. రెండు ఇన్నిగ్స్‌ల్లోనూ డగౌట్‌కే పరిమితమయ్యాడు. దీంతో అతడి గాయంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనంత‌రం అత‌డ‌ని ఉన్న‌ప‌ళంగా స్వ‌దేశానికి ర‌ప్పించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచార‌ణ‌కు ఆదేశించింది. ఇమామ్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై  పాక్‌కు చెందిన నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌సీసీఐఏ) విచార‌ణ చేప‌ట్టింది. 

ఇటీవలి కాలంలో అత‌డి ఆర్థిక లావాదేవీలు, అకౌంట్ల వివరాలన్నింటిపై దర్యాప్తు  చేశారు. అయితే జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉన్న అత‌డికి దేశ‌వాళీ క్రికెట్‌లో ఆడేందుకు పీసీబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే ప్రెసిడెంట్స్ ట్రోఫీలో బ‌రిలోకి దిగాడు. అయితే అత‌డి స్ధానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన సైమ్ అయూబ్ సైతం తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. 

ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడో టెస్టులో అత‌డు రెండు ఇన్నింగ్స్‌లోనూ డ‌కౌట‌య్యాడు. . దీంతో ఒక ఓపెనర్ స్థానం ఇంకా ఖాళీగానే ఉంది. ఇమామ్‌  దేశవాళీ క్రికెట్‌లో ఇదే ఫామ్‌ను కొనసాగిస్తేనే సెలెక్టర్ల దృష్టిలో పడే అవకాశం ఉంటుంది.
చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement