రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌ | Decade After India Debut Batter Announces Retirement From All Forms Cricket | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌

Oct 23 2026 1:07 PM | Updated on Oct 23 2026 1:19 PM

Decade After India Debut Batter Announces Retirement From All Forms Cricket

మేఘన (PC: Instagram)

ఆంధ్రప్రదేశ్‌ క్రికెటర్‌, ఒకప్పటి టీమిండియా స్టార్‌ సబ్బినేని మేఘన ఆటకు వీడ్కోలు పలికింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ‘‘టీమిండియా జెర్సీ వేసుకుని.. బ్యాట్‌ పట్టుకుని మైదానంలో దిగడం.. ప్రపంచ వేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహించడం.. కల నిజమవడం అంటే ఇదే.

బీసీసీఐకి ధన్యవాదాలు
ప్లేయర్‌గా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు నేను రిటైర్మెంట్‌ ‍ప్రకటిస్తున్నాను. నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. మైదానం నాకు రెండో ఇల్లు లాంటిది. అక్కడే నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నాకెన్నో జ్ఞాపకాలను.. ఎంతో మంది స్నేహితులను ఇచ్చింది. జీవితాంతం నేను వాటిని గుర్తుంచుకుంటాను. బీసీసీఐకి ధన్యవాదాలు.

నాకోసం ఎన్నో త్యాగాలు చేసిన నా కుటుంబానికి కృతజ్ఞతలు. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన కోచ్‌లు, సహచర ప్లేయర్లు, సహాయక సిబ్బంది.. పేరుపేరునా ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. 

అభిమానుల ప్రోత్సాహమే మైదానంలో నన్ను నేను మరింత గొప్పగా నిరూపించుకునేలా చేసింది. మీకు కూడా థాంక్స్‌. ప్లేయర్‌గా మాత్రమే రిటైర్‌ అవుతున్నా. క్రికెట్‌తో నా అనుబంధం కొనసాగుతుంది’’ అని సబ్బినేని మేఘన సోషల్‌ మీడియా వేదికగా ఉద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేసింది.

పదేళ్ల క్రితం అరంగేట్రం
కాగా 2016లో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున సబ్బినేని మేఘన అరంగేట్రం చేసింది.  ఇక 2022లో న్యూజిలాండ్‌ మహిళా జట్టుతో సిరీస్‌ సందర్భంగా వన్డేల్లో ఎంట్రీ ఇచ్చింది. 

మొత్తంగా అంతర్జాతీయ కెరీర్‌లో మూడు వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ వన్డేల్లో 114, టీ20లలో 258 పరుగులు చేసింది. చివరగా 2022లో టీమిండియాకు ఆడింది.

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లోనూ
అదే విధంగా కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో రజత పతకం గెలిచిన భారత మహిళా క్రికెట్‌ జట్టులో ఆమె సభ్యురాలు. అయితే, గత కొంతకాలంగా 30 ఏళ్ల మేఘనకు అవకాశాలు కరువయ్యాయి. ఇదిలా ఉంటే.. మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో మేఘన గుజరాత్‌ టైటాన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు ప్రాతినిథ్యం వహించింది. స్మృతి మంధాన సారథ్యంలో 2024లో టైటిల్‌ గెలిచిన ఆర్సీబీ జట్టులో ఆమె సభ్యురాలు.

చదవండి: ‘క్రెడిట్‌ మొత్తం అతడికే దక్కాలి.. అనుభవం తక్కువైనా ఒత్తిడిలోనూ అదరగొట్టాడు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement