సౌతాఫ్రికాతో టెస్టు.. 60 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఆసీస్‌ బౌలర్‌ | AUS Bowler-Scott Boland Break-60 Years-Old-Record-Vs SA-2nd Test | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికాతో టెస్టు.. 60 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఆసీస్‌ బౌలర్‌

Oct 23 2026 8:36 AM | Updated on Oct 23 2026 8:42 AM

AUS Bowler-Scott Boland Break-60 Years-Old-Record-Vs SA-2nd Test

Photo Credit: Twitter

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో పరాజయం చవిచూసినప్పటికీ, ఆ జట్టు బౌలర్ స్కాట్ బోలండ్ మాత్రం అరుదైన ఫీట్ సాధించాడు. మ్యాచ్‌లో నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన బోలండ్ 60 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. సాధారణంగా పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే బోలండ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి వన్‌డౌన్‌లో నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన బోలండ్ 14 బంతుల్లో రెండు పరుగులు చేసి ఔటయ్యాడు. 

అయితే ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫాలోఆన్ ఆడిన ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగో రోజు ఆట ముగిసిన సమయంలో స్కాట్ బోలండ్ ఆరో స్థానంలో వచ్చాడు. ఈసారి 166 బంతుల్లో 40 పరుగులు చేసిన బోలండ్ నైట్‌వాచ్‌మన్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 

గెబెర్హా (గతంలో పోర్ట్ ఎలిజెబెత్‌) వేదికగా జరిగిన టెస్టులో నైట్‌వాచ్‌మన్‌గా అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా స్కాట్ బోలండ్‌ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ బౌలర్‌ ఇయాన్ థాంప్సన్ (39 పరుగులు) పేరిట ఉంది. 1965లో సౌతాఫ్రికాతో టెస్టులో ఇయాన్ థాంప్సన్ ఈ ఫీట్ సాధించాడు. తాజాగా 60 ఏళ్ల తర్వాత స్కాట్ బోలండ్ ఆ రికార్డును బద్దలుకొట్టి తన పేరిట లిఖించుకున్నాడు.

ఇక రెండో టెస్టులో ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న సౌతాఫ్రికా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించగా, రెండో టెస్టులో ఆసీస్‌ను ఇన్నింగ్స్ తేడాతో మట్టికరిపించి ప్రతీకారం తీర్చుకుంది. ఇరుజట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ కేప్‌టౌన్ వేదికగా అక్టోబర్ 27 నుంచి జరగనుంది.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement