చ‌రిత్ర సృష్టించిన‌ జో రూట్‌ | Joe Root Becomes 1st-England Cricketer-Complete 8000 Runs-ODI Cricket | Sakshi
Sakshi News home page

చ‌రిత్ర సృష్టించిన‌ జో రూట్‌

Oct 23 2026 7:17 AM | Updated on Oct 23 2026 7:30 AM

Joe Root Becomes 1st-England Cricketer-Complete 8000 Runs-ODI Cricket

Photo Credit: Twitter

ట్రై సిరీస్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్‌, శ్రీలంక మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో ప‌లు రికార్డులు బ‌ద్ద‌లయ్యాయి. వ‌న్డే చ‌రిత్ర‌లోనే రెండో అత్యధిక ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించిన జ‌ట్టుగా శ్రీలంక రికార్డుకెక్కింది ఇంగ్లండ్ విధించిన 430 ప‌రుగుల ల‌క్ష్యాన్ని శ్రీలంక‌ 49.5 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి అందుకుంది. 

వ‌న్డే క్రికెట్‌లో ఇది రెండో అత్య‌ధిక ఛేద‌న కాగా.. లంక‌కు ఇదే హ‌య్య‌స్ట్ చేజింగ్ కావ‌డం విశేషం. ఈ విష‌యం ప‌క్క‌న‌బెడితే, బ్యాటింగ్‌లో సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ సీనియ‌ర్ బ్యాట‌ర్ జో రూట్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. లంక‌తో మ్యాచ్‌లో 66 బంతుల్లో 69 ప‌రుగులు చేసిన రూట్ వ‌న్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ త‌ర‌ఫున 8వేల పరుగుల మార్క్ దాటిన తొలి బ్యాట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. 

అత‌డి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు ఉన్నాయి. ఇక వ‌న్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ త‌ర‌ఫున రూట్ (8,005 ప‌రుగులు) త‌ర్వాత ఇయాన్ మోర్గాన్ (6,957 ప‌రుగులు), జోస్ బ‌ట్ల‌ర్ (5,678 ప‌రుగులు), ఇయాన్ బెల్ (5,416 ప‌రుగులు), పాల్ కొలింగ్‌వుడ్ (5,092 ప‌రుగులు) వ‌రుస‌గా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

ఇక వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన క్రికెట‌ర్ల జాబితాలో రూట్ చాలా దూరంలో ఉన్నాడు. తొలి స్థానంలో స‌చిన్ టెండూల్కర్ (18,426 ప‌రుగులు), విరాట్ కోహ్లి (15,109 ప‌రుగులు) రెండో స్థానంలో, సంగక్క‌ర (14,234 ప‌రుగులు), రికీ పాంటింగ్ (13, 704 ప‌రుగులు), స‌న‌త్ జ‌యసూర్య (13,140 ప‌రుగులు) మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొన‌సాగుతున్నారు. వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన వారిలో కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌, జో రూట్‌లు మాత్ర‌మే యాక్టివ్‌గా ఉన్నారు.

ఇదీ చ‌ద‌వండి: ENG vs SL: శ్రీలంక సంచ‌ల‌న విజ‌యం.. 430 టార్గెట్ హాంఫ‌ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement