ఆస్ట్రేలియాతో సిరీస్ డిసైడర్ మూడో టెస్టుకు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. ఈ కీలక మ్యాచ్‌కు స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే గాయం కారణంగా దూరమయ్యాడు. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరిగిన రెండో టెస్టుల్లో గజ్జల్లో గాయానికి గురయ్యాడు.
అతడు కోలుకోవడానికి దాదాపు రెండు వారాల సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే మూడో టెస్టుకు అతడు అందుబాటులో లేడు. నోర్జే స్ధానంలో తుది జట్టులోకి కార్బిన్ బాష్ లేదా గెరాల్డ్ కోట్జీ వచ్చే అవకాశముంది. మరోవైపు కైల్ వెర్రెయిన్‌ను బ్యాక్‌ప్ వికెట్ కీపర్‌గా జట్టులో కొనసాగించారు.
కాగా రెండో టెస్టులో వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టిన ర్యాన్ రికెల్టన్, బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందికి మారాడు. కైల్ వెర్రెయిన్‌ను కూడా బ్యాకప్ వికెట్ కీపర్‌గా జట్టులో కొనసాగించారు. రెండో టెస్టులో వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టిన ర్యాన్ రికెల్టన్, ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు.
ఇక చివరి టెస్టులో ఎడమచేతి వాటం స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. మహారాజ్ రెండవ టెస్టుకు దూరమయ్యాడు. ఆ మ్యాచ్‌లో సైమన్ హార్మర్ ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆడాడు. హార్మర్ బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించాడు. దీంతో అతడిని పక్కన పెట్టే సహసాన్ని ప్రోటీస్ సెలక్టర్లు చేయరు. ఇక మూడో టెస్టు మ్యాచ్ అక్టోబర్ 27 నుంచి కేప్‌టౌన్ వేదికగా ప్రారంభం కానుంది. కాగా రెండో టెస్టులో ఆసీస్‌ను ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో సఫారీలు చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా వర్సెస్ 3వ టెస్టుకు దక్షిణాఫ్రికా జట్టు
టెంబా బావుమా (కెప్టెన్), మార్క్వెస్ అకెర్‌మాన్, డేవిడ్ బెడింగ్‌హామ్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్‌కే, గెరాల్డ్ కోయెట్జీ, సైమన్ హార్మర్, మార్కో జాన్‌సెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, డేన్ ప్యాటర్సన్,కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, కైల్ వెర్రెయిన్.
చదవండి: IND vs NZ: తిలక్ వర్మ ప్రపంచ రికార్డు


