తిలక్ వర్మను అభినందిస్తున్న సహచరులు (PC: BCCI)
భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు అందుకున్న క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్‌తో రెండో టీ20 సందర్భంగా తిలక్ వర్మ శనివారం ఈ ఘనత సాధించాడు.
కాగా కివీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా తొలి మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా.. అదే వేదికపై శనివారం నాటి రెండో టీ20లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగగా.. రెండో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ టిమ్ సీఫర్ట్ అవుటయ్యాడు.
Went for the big one. Got the edge. Arshdeep makes it count!💥 Watch the HERO VIDA India Tour of New Zealand, 2nd T20I LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZVIND https://t.co/v6WjZTrydr
— Sony Sports Network (@SonySportsNetwk) October 24, 2026
భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి.. ఏడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సీఫర్ట్ పెవిలియన్ చేరాడు. ఇక మూడో ఓవర్‌లో ఆఖరి బంతికి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ (6) ఇచ్చిన క్యాచ్‌ను కూడా తిలక్ వర్మ ఒడిసిపట్టాడు.
FIRST INTERNATIONAL WICKET IN 4 YEARS 🎯 Bhuvi’s knuckleball works its magic as Daryl Mitchell is undone!👌 Watch the HERO VIDA India Tour of New Zealand, 2nd T20I LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND
— Sony Sports Network (@SonySportsNetwk) October 24, 2026
తద్వారా ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అంతర్జాతీయ టీ20లలో ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా తిలక్ వర్మ చరిత్రకెక్కాడు. ఈ ఏడాది (2026) ఈ హైదరాబాదీ బ్యాటర్ ఇప్పటి వరకు 26 క్యాచ్‌లు అందుకున్నాడు.
ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు అందుకున్న క్రికెటర్లు
👉తిలక్ వర్మ (ఇండియా)- 2026లో 26 క్యాచ్‌లు
👉డానిల్సన్ హవోయ్ (ఇండోనేషియా)- 2025లో 25 క్యాచ్‌లు
👉ముహమ్మద్ వసీం (యూఏఈ)- 2024లో 24 క్యాచ్‌లు
👉శార్విన్ మునియాండి (మలేషియా)- 2025లో 21 క్యాచ్‌లు
👉బ్రియాన్ మసాబా (ఉగాండా)- 2023లో 20 క్యాచ్‌లు
👉తాంజిద్ హసన్ (బంగ్లాదేశ్)- 2025లో 20 క్యాచ్‌లు.
చదవండి: 'ఆరోజు బౌండరీ కర్వ్‌గా ఉంది.. లేదంటే ట్రోఫీ మాదే!'


