Photo Credit: Twitter
రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆనాటి ఫైనల్లో చివరి ఓవర్లో పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని సూర్యకుమార్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకున్న తీరు మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
మిల్లర్ ఔటవ్వడంతోనే మ్యాచ్ భారత్‌వైపు తిరిగింది. ఆ తర్వాతి ఐదు బంతుల్లో 8 పరుగులు రావడంతో సౌతాఫ్రికా విజయానికి ఏడు పరుగుల దూరంలో ఆగిపోయి రన్నరప్‌కే పరిమితమైంది. ఈ టోర్నీ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, జడేజాలు టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు.
అయితే నాడు సూర్యకుమార్ అందుకున్న క్యాచ్ విషయంలో ఒక వివాదం నడిచింది. బౌండరీ లైన్ వద్ద రోప్ కర్వ్‌గా ఉండడంతో సిక్సర్ కాస్తా వికెట్‌గా మారిపోయిందని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. దీనిపై సౌతాఫ్రికా, ఐసీసీ స్పందించలేదు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ మరోసారి ఆ క్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు.
పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డుప్లెసిస్ మాట్లాడుతూ.. ''ఆనాటి ఫైనల్లో సూర్య క్యాచ్ అందుకున్న తీరు అద్భుతం. అయితే బౌండరీ రోప్ కాస్త కర్వ్‌గా ఉండడంతో క్యాచ్ సాధ్యమైంది. అలా కాకుంటే మాత్రం అది సిక్సర్‌గా మారి ట్రోఫీ తమ ఖాతాలో చేరిపోయేదేమో. ఒకవేళ బౌండరీ రోప్ కర్వ్‌గా కాకుండా సరైన స్థానంలో ఉండి ఉంటే, ఆ షాట్ సిక్సర్ అయ్యేదని దక్షిణాఫ్రికా భావించింది.
ఆ తాడు కేవలం కొన్ని అంగుళాలు పక్కకు జరిగి ఉంటే,మేము ప్రపంచ కప్ గెలిచి ఉండేవాళ్లం. కానీ ఆరోజు టీమిండియాది. అందరూ చెప్పినట్లుగా.. డబ్బు, పలుకుబడితో ట్రోఫీలను కొనగలిగితే, ఏ ఆటైనా బోరింగ్‌గా ఉంటుంది. ఇలా ఉత్కంఠ మ్యాచ్‌లు జరిగితేనే మజా వస్తుంది. అదే క్రికెట్‌లో ఉండే అందం. క్షణాల్లో ఫలితాలు తారుమారవుతాయి.'' అని చెప్పుకొచ్చాడు.
నాటి మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కోహ్లి (76) అర్థసెంచరీ చేయగా, అక్షర్‌పటేల్ (47), శివ్ దూబే (27) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, నోర్ట్జే చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులకు పరిమితమైంది. క్లాసెన్ (52), డికాక్ (39), స్టబ్స్ (31) రాణించారు. భారత బౌలర్లలో పాండ్యా మూడు వికెట్లు తీయగా, బుమ్రా, అర్షదీప్ చెరో 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
🚨 Faf du Plessis on Suryakumar Yadav’s Catch Controversy: “If Money or Influence Could Buy You Trophies, Sport Would Be Boring!🚨 Interviewer 🗣️: What’s your take on the controversy surrounding Suryakumar Yadav’s catch of David Miller in the 2024 T20 World Cup final? Faf du Plessis 🗣️: Fantastic catch! But after the game, you look at the boundary rope, and it's doing a little curvy thing. South Africa was asking, ‘Why isn't the rope where it should be?’ Because if the rope had been where it should have been, it would have been six. That's how small the margins are. If the rope had been a little further out, South Africa could have won the World Cup. That ball had to go. The fact that he caught it on the boundary shows how small the margins are. But that's the beauty of sport. If money or influence could buy you trophies, sport would be boring, right? Sport is amazing because anything can happen on the day.
— Central Cricket (@arshdeep3444) October 23, 2026
ఇదీ చదవండి:
భారత ఆటగాళ్లకు ఊహించని సమస్య.. క్షణాల్లో పరిష్కారం!


