Photo Credit: BCCI Twitter
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా సుదీర్ఘ పర్యటనను ఘనంగా ఆరంభించింది. ఇవాళ అదే క్రైస్ట్‌చర్చి వేదికగా రెండో టీ20కి సిద్ధమయ్యింది. తొలి టీ20లో విజయంతో జోష్ మీదున్న భారత ఆటగాళ్లకు అనుకోని సమస్య ఎదురైంది.
ఆటగాళ్లు వేసుకున్న షూలకు స్పైక్స్ చిన్నవిగా ఉండడంతో తొలి టీ20లో ఫీల్డింగ్ చేస్తూ జారిపడిన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. నిజానికి న్యూజిలాండ్ పిచ్‌లపై షూ స్పైక్స్ చిన్నగా ఉంటే జారిపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పేసర్ మయాంక్ యాదవ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో షూ స్పైక్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. ఒక సందర్భంలో మయాంక్ అదుపు తప్పి కిందపడ్డాడు.
మరో ఘటనలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఫీల్డింగ్ చేస్తూ జారి పడ్డాడు. వీరిద్దరే గాక చాలా మంది భారత క్రికెటర్లకు షూ స్పైక్స్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇది గమనించిన బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సమస్యకు పరిష్కారం చూపాలని భావించాడు. అనుకుందే తడవుగా రోనీని పిలిపించి సమస్యను వివరించాడు.
షూ స్పైక్స్‌ను సరిచేయడంలో దిట్ట అయిన రోనీ.. క్షణాల్లో సమస్యకు చెక్ పెట్టాడు. న్యూజిలాండ్ పిచ్ పరిస్థితులకు తగినట్లుగా తన వద్ద ఉన్న పెద్ద స్పైక్‌లను ఆటగాళ్ల షూలకు ఉన్న స్పైక్స్ స్థానంలో అమర్చడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో రోనీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
THIS GUY FIXED TEAM INDIA’S BIGGEST HEADACHE ON THE NEW ZEALAND TOUR! 😱🔥 Indian players were struggling badly with the slippery conditions in New Zealand. Mayank Yadav faced serious issues while bowling in the 1st T20I, while Shreyas Iyer also slipped badly on one occasion. 😳 The bowlers were having the toughest time, leaving bowling coach Morne Morkel concerned. Then came Ronny! 🔥 Someone recommended him, and he turned out to be the solution! He had oversized spikes specially suited to New Zealand’s conditions — nearly twice the size of regular spikes! Ronny changed the spikes for all the players, and just like that, the problem was solved!
— Mukku (@Cric_Mukku) October 23, 2026
ఇదీ చదవండి: ఫైనల్లో జింబాబ్వేపై విజయం.. అఫ్గానిస్తాన్‌దే ట్రై సిరీస్


