'అతడొక అద్భుతం​.. టీమిండియాకు దొరికిన వజ్రం' | Ajinkya Rahane picks the players to watch out for in NZ vs IND 2026 3rd T20I | Sakshi
Sakshi News home page

IND vs NZ: 'అతడొక అద్భుతం​.. టీమిండియాకు దొరికిన వజ్రం'

Oct 26 2026 3:53 PM | Updated on Oct 26 2026 3:58 PM

 Ajinkya Rahane picks the players to watch out for in NZ vs IND 2026 3rd T20I

PC: BCCI/X

న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా యువ ఆల్‌రౌండ‌ర్ న‌మ‌న్ ధీర్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన రెండో టీ20ల్లోనూ న‌మ‌న్ బ్యాట్‌తో స‌త్తాచాటాడు. ఇప్పుడు మూడో టీ20లోనూ త‌న జోరు కొన‌సాగించేందుకు సిద్ద‌మ‌య్యాడు.

ఈ క్ర‌మంలో న‌మ‌న్ ధీర్‌పై టీమిడియా మాజీ కెప్టెన్ అజింక్య ర‌హానే ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. నమన్ ధీర్ రూపంలో భారత్‌కు ఒక 'వజ్రం' దొరికిందని ర‌హానే కొనియాడాడు. అదేవిధంగా మూడో టీ20లో ఓపెన‌ర్‌ అభిషేక్ శర్మ ప్రదర్శన పైనే అందరి కళ్లు ఉన్నాయ‌ని అత‌డు అన్నాడు. 

కాగా ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లలో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

"మూడో టీ20లో భార‌త జ‌ట్టు త‌ర‌పున అభిషేక్ శ‌ర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాల‌ని కోరుకుంటున్నాను. అత‌డి మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ ఈ టూర్‌లో ఇంకా అత‌డి నుంచి బెస్ట్ ఇన్నింగ్స్ రాలేదు. అత‌డు ఆరంభంలోనే ప‌రుగులు సాధిస్తే టీమిండియాకు చాలా మంచిది. సంజూ కూడా మంచి టచ్‌లో ఉన్నాడు. తొలి టీ20లో ఇప్ప‌టికే కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు.

ఇప్పుడు అభిషేక్ కూడా 50కి పైగా ప‌రుగులు సాధిస్తే భార‌త్‌కు తిరుగుండదు. అదేవిధంగా న‌మ‌ర్‌ధీర్ నుంచి మ‌రోసారి మంచి నాక్ ఆశిస్తున్నాను. క్లిష్ట ప‌రిస్థితిలో కూడా ప్ర‌శాంతంగా ఆడే న‌మ‌న్ ధీర్ మైండ్ సెట్‌గా నాకు బాగా న‌చ్చింది. నిజంగా అత‌డి రూపంలో భార‌త జ‌ట్టుకు ఒక వ‌జ్రం దొరికింది అని సోనీ లీవ్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రహానే పేర్కొన్నాడు.
చదవండి: AUS vs SA: క్రికెట్‌ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement