పాక్‌తో కీలక మ్యాచ్‌.. సెహ్వాగ్‌, ద్రవిడ్‌ తనయుల వైఫల్యం | ACC Mens U19 Asia Cup 2026 IND VS PAK: Aaryavir sehwag, anvay Dravid Out of low Scores, India in Trouble | Sakshi
Sakshi News home page

పాక్‌తో కీలక మ్యాచ్‌.. సెహ్వాగ్‌, ద్రవిడ్‌ తనయుల వైఫల్యం

Nov 8 2026 12:51 PM | Updated on Nov 8 2026 12:54 PM

ACC Mens U19 Asia Cup 2026 IND VS PAK: Aaryavir sehwag, anvay Dravid Out of low Scores, India in Trouble

ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌ 2026 టోర్నీలో ఇవాళ అత్యంత​ కీలకమైన మ్యాచ్‌ జరుగుతుంది. అల్‌ అమీరట్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్దులు భారత్‌-పాకిస్తాన్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో యంగ్‌ ఇండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఆదిలోనే షాక్‌
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు రెండో బంతికే భారీ షాక్‌ తగిలింది. కెప్టెన్‌ లక్ష్య రాజేశ్‌ రాయ్‌చందని 2 బంతులు ఎదుర్కొని ఖాతా కూడా తెరవకుండానే అలీ రజా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

ఆర్యవీర్‌ సెహ్వాగ్‌, అన్వయ్‌ ద్రవిడ్‌ విఫలం
అనంతరం భారత్‌ బ్యాటింగ్‌ దిగ్గజాలైన రాహుల్‌ ద్రవిడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ తనయులు అన్వయ్‌ ద్రవిడ్‌ (10), ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ (22) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వీరికి తోడు వీకే వినీత్‌ (8), యశ్‌వర్దన్‌ చౌహాన్‌ (1) కూడా విఫలమయ్యారు. దీంతో భారత్‌ 86 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో అర్జున్‌ రాజ్‌పుత్‌ భారత్‌ ఇన్నింగ్స్‌ను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. అర్జున్‌.. మనల్‌ చౌహాన్‌ సహకారంతో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు. 28 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ స్కోర్‌ 121-5గా ఉంది. అర్జున్‌ 74, మనల్‌ చౌహాన్‌ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. పాక్‌ బౌలర్లలో అలీ రజా, నికాబ్‌ షఫీక్‌ తలో 2 వికెట్లు తీయగా.. రిజ్వానుల్లా ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

ఇదీ చదవండి: ఆసియా కప్‌కు భారత స్టార్‌ బ్యాటర్‌ దూరం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement