బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌.. భారీ ఆధిక్యం దిశ‌గా వెస్టిండీస్‌ | Kavem Hodges Century Puts West Indies in Command; Windies Lead by 315 Runs | Sakshi
Sakshi News home page

BAN vs WI: బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌.. భారీ ఆధిక్యం దిశ‌గా వెస్టిండీస్‌

Nov 8 2026 5:56 PM | Updated on Nov 8 2026 6:01 PM

Kavem Hodges Century Puts West Indies in Command; Windies Lead by 315 Runs

సిల్హెట్ మైదానం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ పట్టు బిగించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 3 వికెట్ల నష్టానికి 345 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కరేబియన్ జట్టు ప్రస్తుతం 315 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

క్రీజులో కావెమ్ హాడ్జ్(140), అమీర్ జంగూ(20) ఉన్నారు. ఐదో రోజు తొలి సెషన్‌లో విండీస్ డిక్లేర్ చేసే అవకాశముంది. అంతకుముందు బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ ఒకానొక దశలో 184 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ సమయంలో బంగ్లా బ్యాటర్ తౌహిద్ హృదోయ్ (242 నాటౌట్)   భారీ డబుల్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 11 సిక్సర్లు ఉన్నాయి.  టెస్టుల్లో బంగ్లాదేశ్ తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా హృదోయ్‌ రికార్డు నెలకొల్పాడు.

తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 356 పరుగులు
ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులకు ఆలౌట్ అయింది. విండీస్ ఇన్నింగ్స్‌లో అమీర్ జంగూ (133) సెంచరీతో సత్తాచాటగా.. కేవిన్ విక్‌హామ్ (61), జస్టిన్ గ్రీవ్స్ (51) హాఫ్ సెంచరీలతో జట్టుకు మంచి స్కోరు అందించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమూద్ 6 వికెట్లతో చెలరేగగా, మెహిదీ హసన్ మీరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement