ప్రసిద్ కృష్ణ (PC: BCCI/Sonyliv)
న్యూజిలాండ్- భారత్ ‘ఎ’ జట్ల మధ్య మూడో అనధికారిక టెస్టులో మూడో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైపోయింది. దీంతో ఆతిథ్య కివీస్‌కు ఊరట లభించినట్లయింది. లిన్‌కోన్ వేదికగా ఇరుజట్ల మధ్య శనివారం మూడో అనధికారిక టెస్టు మొదలైన సంగతి తెలిసిందే.
జైస్వాల్ శతకం.. సాయి, జురెల్, తిలక్, సుందర్ అర్ధ శతకాలు
టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ శతక్కొట్టగా (102).. సాయి సుదర్శన్ అద్భుత అర్ధ శతకం (88)తో ఆకట్టుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ (15) విఫలమైనా.. కెప్టెన్ ధ్రువ్ జురెల్ (71), తిలక్ వర్మ (81 నాటౌట్) అర్ధ శతకాలతో అదరగొట్టారు.
భారత్ భారీ స్కోరు
స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లలో సీనియర్ రవీంద్ర జడేజా 25 పరుగులు చేయగా.. వాషింగ్టన్ సుందర్ అర్ధ శతకం (50)తో అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఐదు వికెట్ల నష్టానికి 464 పరుగుల భారీ స్కోరు వద్ద భారత్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
కివీస్ బౌలర్లలో జాక్ గిబ్సన్ రెండు వికెట్లు తీయగా.. జారోడ్ మెకాయ్, కామెరాన్ పాల్, డనురు ఫెర్న్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన భారత పేసర్ ప్రసిద్ కృష్ణ కివీస్‌కు చుక్కలు చూపించాడు.
రెండు వికెట్లు తీసిన ప్రసిద్
ఓపెనర్లు రైస్ మరియును డకౌట్ చేసిన ప్రసిద్.. కర్టిస్ హీపీని 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి న్యూజిలాండ్ 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ 10, జాక్ గిబ్సన్ ఒక పరుగుతో క్రీజులో నిలిచారు.
మూడో రోజు ఆట రద్దు
ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ భారత్ కంటే 428 పరుగుల వెనుకబడి ఉంది. అయితే, మూడో రోజు ఆటకు వర్షం పదే పదే ఆటంకం కలిగించింది. వాన ఎంతకూ తెరిపినివ్వకపోవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను ముగిసిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా కివీస్ ఇంకా 428 పరుగులు వెనుకబడే ఉంది.
ఇదీ చదవండి: IND vs PAK: సెహ్వాగ్ కొడుకుపై పాక్ బౌలర్ ఓవరాక్షన్.. నెక్ట్స్ మనోడు చూసుకుంటాడులే!


