breaking news
Senuja Wekunagoda
-
శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు
శ్రీలంక అండర్-19 బ్యాటర్లకు భారత యువ బౌలర్లు చుక్కలు చూపించారు. అద్భుతమైన ప్రదర్శనతో ఆతిథ్య జట్టును ముప్పుతిప్పలు పెట్టారు. కాగా శ్రీలంక- భారత్ అండర్-19 జట్ల మధ్య సోమవారం రెండో అనధికారిక టెస్టు మొదలైంది.భారత్ భారీ స్కోరుకొలంబో వేదికగా టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలిరోజు మూడు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసిన భారత జట్టు.. 253/3 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 105.2 ఓవర్లలో 411 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా (193 బంతుల్లో 111), ఆల్‌రౌండర్ మనాల్ చౌహాన్ (244 బంతుల్లో 150) సెంచరీలు.. యశ్వర్దన్ చౌహాన్ (89 బంతుల్లో 78) అర్ధ శతకంతో రాణించారు.శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ మూడు వికెట్లు తీయగా.. సెత్మిక సెనెవిరత్నె, దుల్నిత్ సిగెర, విఘ్నేశ్వరన్ ఆకాశ్ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంకకు భారత బౌలర్లు ఆది నుంచే షాకులు ఇచ్చారు.శ్రీలంక బ్యాటర్లకు చుక్కలుఓపెనర్లలో అవీష సమాష్ (9)ను ప్రణవ్ రాఘవేంద్ర పెవిలియన్‌కు పంపగా.. దిమంత మహావితన (24)ను కావ్యా పటేల్ అవుట్ చేశాడు. గత మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడను ఈసారి భారత్ ఐదు పరుగులకే పరిమితం చేసింది. చిగురుపాటి వెంకట బౌలింగ్‌లో సెనుజ లక్ష్య రాయ్చందానికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఆ తర్వాత భారత బౌలర్లు జోరు కొనసాగించడంతో కెప్టెన్ విమత్ దిన్సార 8, కవిజ గమాగే 7, వికెట్ కీపర్ బ్యాటర్ జేసన్ ఫెర్నాండో 0 పరుగులకే పెవిలియన్ చేరారు. విరాన్ చముదిత 21, దుల్నిత్ సిగెర 31 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో మంగళవారం నాటి ఆట ముగిసేసరికి శ్రీలంక 40 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే ఇంకా 289 పరుగులు వెనుకబడి ఉంది.భారత బౌలర్లలో ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట, రోహిత్ యాదవ్ తలా రెండు వికెట్లు తీయగా.. కావ్యా పటేల్, జగన్నాథ్ హెంచుదేశన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా భారత్- శ్రీలంక మధ్య తొలి అనధికారిక టెస్టు డ్రా అయింది.చదవండి: జింబాబ్వేతో శ్రేయస్ అయ్యర్ సేనకు ముప్పు -
డబుల్ సెంచరీతో చెలరేగిన భారత ఓపెనర్
శ్రీలంక అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. నిలకడగా ఆడుతూ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కాసేపటికే పెవిలియన్ చేరాడు.మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో భారత్ 2-1 తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ఇరుజట్ల మధ్య సోమవారం తొలి యూత్ టెస్టు మొదలైంది.గాలె వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ డబుల్ సెంచరీ (267 బంతుల్లో 233)తో దుమ్ములేపగా.. కెప్టెన్ విమత్ దిన్సార (52), కవిజ గమాగె (45), ఒషాడా మనాహర (31*) రాణించారు. ఆధిక్యంలోకి భారత్ఫలితంగా శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌ను 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తమ ఆట మొదలుపెట్టిన భారత్.. గురువారం భోజన విరామ సమయానికి 55 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 378/3 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ఆరంభించిన భారత జట్టు లంచ్ బ్రేక్ టైమ్‌కి 149 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 479 పరుగులు చేసింది.లక్ష్య డబుల్ సెంచరీతోకాగా బుధవారం 196 పరుగుల వద్ద నిలిచిన లక్ష్య.. గురువారం ద్విశతక మార్కును అందుకున్నాడు. మొత్తంగా 324 బంతుల్లో 22 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 207 పరుగులు సాధించాడు. దిమత్ అబేయ్సింఘే బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో లక్ష్య మారథాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఇక మిగలిన వారిలో మరో ఓపెనర్ సాగర్ విర్క్ శతకం (134) సాధించగా.. వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్రా ఓజా 24 పరుగులు చేశాడు. కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ (6) విఫలం కాగా.. కుశ్ పటేల్ 42 పరుగులతో రాణించాడు. గురువారం లంచ్ బ్రేక్ సమయానికి బీకే కిషోర్ 1, మానవ్ క్రిష్ణ 35 పరుగులతో క్రీజులో నిలిచారు. అంతకుముందు కావ్యా పటేల్ (8), జగన్నాథన్ హేంచుదేశన్ (0) అవుటయ్యారు. ఆటకు ఇదే చివరి రోజు కావడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం లాంఛనమే కానుంది.చదవండి: విధ్వంసకర శతకాలు.. పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డు బద్దలు -
IND vs SL: శతకాలతో చెలరేగిన భారత ఓపెనర్లు
శ్రీలంక అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్లు లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని, సాగర్ విర్క్ శతక్కొట్టారు. నిలకడగా, ఓపికగా ఆడుతూ భారీ సెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది.శ్రీలంక భారీ స్కోరు కాగా భారత్- శ్రీలంక అండర్-19 జట్ల మధ్య సోమవారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ డబుల్ సెంచరీ (233)తో దుమ్ములేపగా.. కెప్టెన్ విమత్ దిన్సార (52) అర్ధ శతకం బాదాడు.మిగిలిన వారిలో కవిజ గమాగే (49), చమిక హీనతిగల (45), ఒషాడా మనాహర (12 బంతుల్లో 31 నాటౌట్) రాణించారు. ఈ క్రమంలో 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగులు చేసి శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ మంగళవారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి 58 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 186 పరుగులు చేసింది.ఈ క్రమంలో 186/0 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన భారత జట్టుకు వర్షం మరోసారి ఆటంకం కలిగించింది. అయితే, కాసేపటి తర్వాత తెరిపినివ్వడంతో మళ్లీ మ్యాచ్ మొదలైంది. శతకాలతో చెలరేగిన భారత ఓపెనర్లుఈ క్రమంలో శతకం పూర్తి చేసుకున్న ఓపెనర్ సాగర్ (312 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్: 134 రన్స్).. లతేంద్ర ఆకాశ్ బౌలింగ్‌లో జేసన్ ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్రా ఓజా 24 పరుగులే చేసి నిరాశపరచగా.. కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ (6) పూర్తిగా విఫలమయ్యాడు. అయితే, మరో ఓపెనర్ లక్ష్య మాత్రం నిలకడగా ఆడుతూ డబుల్ సెంచరీకి చేరువయ్యాడు.గాలేలో బుధవారం ఆట పూర్తయ్యేసరికి మొత్తంగా 306 బంతులు ఎదుర్కొన్న లక్ష్య.. 21 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 196 పరుగులు చేశాడు. అతడితో పాటు కుశ్ పటేల్ మూడు పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక కంటే ఇంకా 46 పరుగులు వెనుకబడి ఉంది. ఇక ఆటకు గురువారం చివరిరోజు. చదవండి: IND vs ENG: అతడిని ఆరోస్థానంలో ఆడిస్తారా? -
అదరగొట్టిన భారత ఓపెనర్లు
శ్రీలంక అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టులో భారత్ అండర్ -19 ఓపెనర్లు అదరగొడుతున్నారు. లక్ష్య రాజేశ్ రాయ్ చందాని, సాగర్ విర్క్ పట్టుదలగా నిలబడి భారత్ జట్టుకు శుభారంభం అందించారు.కాగా గాలె వేదికగా భారత్- శ్రీలంక మధ్య సోమవారం తొలి యూత్ టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగి.. మొదటి ఇన్నింగ్స్‌ను భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్లు దిమంత మహావితన (2), దుల్నిత్ సిగెర (0) విఫలమైనా.. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ దుమ్ములేపాడు.మొత్తంగా 267 బంతులు ఎదుర్కొని 33 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 233 పరుగులు సాధించాడు. సెనుజ డబుల్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ విమత్ దిన్సార (52), కవిజ గమాగె (49), చమిక హీనతిగల (45), ఒషాడా మనాహర (12 బంతుల్లో 31 నాటౌట్) రాణించారు.ఈ క్రమంలో 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగుల వద్ద శ్రీలంక మంగళవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం భారత్ బ్యాటింగ్ మొదలుపెట్టగా వర్షం వల్ల కాసేపు ఆటకు అంతరాయం కలిగింది.అయితే, వాన తెరిపినివ్వడంతో తిరిగి ఆట మొదలుకాగా.. ఓపెనర్లు లక్ష్య, సాగర్ నిలకడగా ఆడారు. లక్ష్య 136 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 93 పరుగులు.... సాగర్ 215 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.ఫలితంగా రెండో రోజు పూర్తయ్యేసరికి భారత్ అండర్-19 జట్టు 58 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 186 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక కంటే 238 పరుగులు వెనుకబడి ఉంది. ఇక రెండో రోజు మొత్తంగా ఐదు వికెట్లు తీయడంతో పాటు.. 186 పరుగులు చేసిన భారత్ మొత్తానికి మంగళవారం పైచేయి సాధించింది. -
IND vs SL: ఒకే ఒక్కడు!.. శ్రీలంక భారీ స్కోరు
భారత అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక అండర్-19 జట్టు భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్ల ధాటికి మెజారిటీ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టినా.. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ ఒంటిచేత్తో జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు.కాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్- శ్రీలంక మధ్య గాలె వేదికగా సోమవారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆరంభంలోనే ఓపెనర్లు దుల్నిత్ సిగెర (0), దిమంత మహవితన (2) వికెట్లు కోల్పోయింది.సెనుజ డబుల్ సెంచరీఇలాంటి తరుణంలో వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ ఆచితూచి ఆడుతూ క్రీజులో పట్టుదలగా నిలబడ్డాడు. తొలి రోజు ఆటలోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా కెప్టెన్ విమత్ దిన్సారా అర్ధ శతకం (52)తో రాణించగా.. కవిజ గమాగే 49 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ఈ క్రమంలో సోమవారం నాటి తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక 89 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 344 పరుగులు సాధించింది. ఇక 344/4 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంక.. 9 వికెట్ల నష్టానికి 424 పరుగుల భారీ స్కోరు వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.సెనుజ వెకునగొడ మొత్తంగా 267 బంతుల్లో 33 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 233 పరుగులు సాధించాడు. జిడ్డులా క్రీజులో పాతుకుపోయిన అతడిని జగన్నాథన్ హెంచుదేశన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపించాడు.వర్షం వల్ల నిలిచిన ఆటఇక మిగిలిన వారిలో చమిక హీనతిగల 45 పరుగులు చేయగా.. పదకొండో నంబర్ బ్యాటర్ ఒషాడా మనాహర అనూహ్య రీతిలో 12 బంతుల్లోనే 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో జగన్నాథన్ హెంచుదేశన్ మూడు వికెట్లు తీయగా.. కావ్యా పటేల్, ప్రియాన్షు సింగ్ చెరో రెండు.. ప్రణవ్ రాఘవేంద్ర, కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టగా వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగింది. వాన వల్ల ఆట నిలిచే సమయానికి భారత జట్టు ఏడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసి.. లంక కంటే 399 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్లలో లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని 16, సాగర్ విర్క్ 8 పరుగులతో క్రీజులో నిలిచారు.చదవండి: టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్! -
భారత్‌తో మ్యాచ్.. శ్రీలంక బ్యాటర్ డబుల్ సెంచరీ
భారత్ అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక అండర్-19 జట్టు భారీ స్కోరు సాధించింది. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ డబుల్ సెంచరీతో చెలరేగి.. లంక జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.కాగా మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత యువ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. శ్రీలంక 2-1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా.. చివరి రెండు మ్యాచ్‌లు గెలిచి శ్రీలంక సిరీస్‌ను కైవసం చేసుకుంది.ఓపెనర్లను త్వరగానే అవుట్ చేసినా..ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలే వేదికగా సోమవారం తొలి యూత్ టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత్ బౌలింగ్‌కు దిగింది. భారత పేసర్ కావ్యా పటేల్ ఆరంభంలోనే ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు.ఓపెనర్లలో దుల్నిత్ సిగెరను డకౌట్ చేసిన కావ్యా పటేల్.. దిమంత మహవితనను రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపాడు. అయితే, భారత జట్టుకు ఈ ఆనందం ఎంతో కాసేపే మిగిలింది. వన్‌డౌన్‌లో వచ్చిన సెనుజ వెకునగొడ క్రీజులో పాతుకుపోయి డబుల్ సెంచరీ కొట్టాడు.203 పరుగులతో అజేయంగా..తొలి రోజు ఆట ముగిసే సరికి సెనుజ మొత్తంగా 227 బంతులు ఎదుర్కొని 31 ఫోర్ల సాయంతో 203 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా కెప్టెన్ విమత్ దిన్సారా అర్ధ శతకం (52)తో ఆకట్టుకోగా.. కవిజ గెమాగే 49 పరుగులతో రాణించాడు. చమిక హీనతిగల 33 పరుగులతో సెనుజతో కలిసి క్రీజులో నిలిచాడు.ఫలితంగా సోమవారం నాటి మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక 89 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 344 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. భారత్ ఆదిలో వికెట్లు తీసినప్పటికీ.. సెనుజ ద్విశతక ఇన్నింగ్స్ కారణంగా లంకదే పైచేయి అయింది. భారత బౌలర్లలో కావ్యా పటేల్ రెండు వికెట్లు తీయగా.. ప్రణవ్ రాఘవేంద్ర, కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: చారిత్రక మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయం


