హైదరాబాద్: ఆరోగ్య బీమా పాలసీదారులకు తెలంగాణలో ఊహించని షాక్ తగిలింది. ఓ ప్రముఖ బీమా సంస్థకు చెందిన పాలసీలపై నగదు రహిత వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (TSHA) ప్రకటించింది. క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం, అనవసర కోతలు, సరైన కారణాలు లేకుండా క్లెయిమ్‌ల తిరస్కరణ వంటి సమస్యలే ఇందుకు కారణమని వెల్లడించింది.
ఈ నిర్ణయంతో సంబంధిత పాలసీదారులు ఆస్పత్రి బిల్లులను ముందుగా చెల్లించి, ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్ పొందాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో చికిత్స కోసం వచ్చే తెలంగాణ, ఏపీ రోగులపై ఈ ప్రభావం పడనుంది. సమస్యలను పరిష్కరించేందుకు బీమా సంస్థ ముందుకు వస్తే క్యాష్‌లెస్ సేవలను పునరుద్ధరిస్తామని TSHA తెలిపింది.


