తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ నూతన కార్యవర్గం | Telangana Pradesh Mahila Congress New Executive Committee full details | Sakshi
Sakshi News home page

Telangana: మహిళా కాంగ్రెస్‌ నూతన కార్యవర్గం

Nov 10 2026 7:59 PM | Updated on Nov 10 2026 8:09 PM

Telangana Pradesh Mahila Congress New Executive Committee full details

ఎర్రబెల్లి స్వర్ణ

ఉపాధ్యక్షులుగా 11 మంది, ప్రధాన కార్యదర్శులుగా 10 మంది

ఐదుగురు కార్యదర్శులతో పాటు 22 జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన స్వర్ణ  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మహిళా కాంగ్రెస్‌కు నూతన కార్యవర్గం ఏర్పాటైంది. ఆలిండియా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అల్కా లాంబ అనుమతి మేరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌కు 11 మంది ఉపాధ్యక్షులు, 10 మంది ప్రధాన కార్యదర్శులు, ఐదుగురు కార్యదర్శులను నియమించారు. వీరితో పాటు 22 జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం బోయలపల్లి రేఖ, అల్లూరి కృష్ణవేణి రెడ్డి, బి.లక్ష్మమ్మ, గాజుల సుకన్య, వేములకొండ పద్మ, మంగన్నగారి సుగుణ, ఆంగోతు సుగుణ, కనపర్తి కుమారి, గంగుల అంజలి యాదవ్, కె.శైలజ, బడ్కె ఇందిరలను ఉపాధ్యక్షులుగా నియమించారు.

అస్మా తబుసం, గోచికొండ శ్రీదేవి, గొంగటి బిందు, ఎడ్ల విజయలక్ష్మి, కె.నాగమణిరెడ్డి, ఊటుకూరు దివ్య, టి.సురక్ష, యోగీశ్వరి, వీరబోయిన రజిత, డి.నాగమణిలను ప్రధాన కార్యదర్శులుగా, మౌనిక, చిట్టబోయిన అరుణ, పి.గౌరి, సోమలక్ష్మి, పి.పావనిలు కార్యదర్శులుగా నియమితులయ్యారు.

ఇదీ చ‌ద‌వండి: కాంగ్రెస్‌ పార్టీకి కొత్తగా మీడియా కోఆర్డినేటర్లు

వీరితో పాటు గుమ్మడి శ్రీదేవి (భూపాలపల్లి), కె.సత్యప్రసూన (కరీంనగర్‌), శంభుల ఉషశ్రీ (ఖైరతాబాద్‌), డి.సౌజన్య (ఖమ్మం), జె.పద్మజ (మహబూబాబాద్‌), అర్కల హేమలత (మంచిర్యాల), ఆర్‌.లక్ష్మి (మల్కాజిగిరి), గోపగాని మాధవి (నల్లగొండ), పి.ప్రసన్నరెడ్డి (నారాయణపేట), పి.జ్యోతి (రంగారెడ్డి), కాట సుధారాణి (సంగారెడ్డి), పి.కవిత (సికింద్రాబాద్‌), టి.అనూరాధ (సూర్యాపేట), కె.పార్వతమ్మ (వరంగల్‌), బి.సరళ (అర్బన్‌), గడ్డం రేణుక (సిద్దిపేట), నీలం పద్మ (భువనగిరి), కె.వనిత (సిరిసిల్ల), రజితా యాదవ్‌ (నిజామాబాద్‌), పి.జ్యోతి (కొత్తగూడెం), జ్యోతి (జగిత్యాల), వి.కల్యాణి (జనగామ)లను ఆయా జిల్లాల మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులుగా నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement