రుణాలపై మారటోరియం | Telangana govt seeks loan relief for farmers hit by El Nino-induced drought | Sakshi
Sakshi News home page

రుణాలపై మారటోరియం

Nov 11 2026 1:01 AM | Updated on Nov 11 2026 1:01 AM

Telangana govt seeks loan relief for farmers hit by El Nino-induced drought

రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో నిలేశ్‌ ద్వివేది, సందీప్‌కుమార్‌ సుల్తానియా, మంత్రి తుమ్మల, గౌరవ్‌ ఉప్పల్, రాహుల్‌ బొజ్జా, సురేంద్ర మోహన్‌

కరువు మండలాల్లో రైతు రుణాల వసూళ్లపై ఏడాదిపాటు నిషేధం

ఎస్‌ఎల్‌బీసీ భేటీలో నిర్ణయం 

తీవ్ర కరువు మండలాల్లో రుణాలు ఐదేళ్ల పాటు చెల్లించేలా వెసులుబాటు 

ఓ మోస్తరు కరువు మండలాల్లో మూడేళ్లలో చెల్లించేందుకు చాన్స్‌ 

రుణ గ్రహీతలు ముందుకు రాకపోయినా సుమోటోగా చర్యలు 

కొత్త రుణాలు కూడా మంజూరు చేయనున్న బ్యాంకులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల్లో రైతుల రుణాలపై మారటోరియం అమలు కానుంది. కరువు పరిస్థితులను ఎదుర్కోవడంపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుకు అనుగుణంగా రాష్ట్రంలోని 365 మండలాల్లో రైతు రుణాల వసూళ్లపై తాత్కాలిక నిషేధానికి బ్యాంకర్లు సూత్రప్రాయంగా అంగీకరించారు. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.

ప్రస్తుతమున్న రుణాలపై మారటోరియం అమలు చేయడంతో పాటు రానున్న రబీ సీజన్‌కు కొత్త రుణాలివ్వాలని ఈ సమావేశంలో ప్రభుత్వం పక్షాన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్లను కోరారు. ఈ నేపథ్యంలో బ్యాంకర్ల సమావేశం పలు తీర్మానాలను ఆమోదించింది.

ఈ తీర్మానాల మేరకు ఓ మోస్తరు కరువు ప్రకటించిన 254 మండలాల్లో రైతు రుణాలపై 12 నెలల మారటోరియం అమలు కానుంది. ఈ రుణాల చెల్లింపునకు గాను 36 నెలల గడువు ఇవ్వనున్నారు. అదే విధంగా తీవ్ర స్థాయిలో కరువు ఉన్న 111 మండలాల్లో కూడా రుణాల వసూళ్లకు 12 నెలల మారటోరియం వర్తించనుంది. అయితే ఈ మండలాల్లో రుణాల చెల్లింపునకు 60 నెలల గడువు ఇవ్వనున్నారు. 

వడ్డీ భారంపై కేంద్రానికి వినతి 
రైతులు మారటోరియం కోసం ముందుకొచ్చినా, రాకపోయినా సుమోటోగా బ్యాంకులు ఉపశమన చర్యలు తీసుకోనున్నాయి. రుణాల మారటోరియంకు అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్లను గుర్తించి వారికి మారటోరియం అమలు చేయడంతో పాటు కొత్త రుణాలను కూడా మంజూరు చేయనున్నాయి. అయితే ఈ మారటోరియం కాలానికి గాను రైతు రుణాలకు అయ్యే వడ్డీని రాయితీ కింద సర్దుబాటు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఇందుకు గాను రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితిని 15 రోజుల్లోగా రిజర్వు బ్యాంకు (సీఐఎంఎస్‌) పోర్టల్‌లో రాష్ట్ర బ్యాంకర్లు అప్‌లోడ్‌ చేయాలని సమావేశంలో తీర్మానించారు.  

ఎస్‌ఎల్‌బీసీ సమావేశం తీర్మానాలివే.. 
⇒ కరువు ప్రభావానికి గురయ్యే వర్గాలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాల విషయంలో తగిన ఉపశమన చర్యలు తీసుకోవాలి. వ్యవసాయం కోసం తీసుకున్న స్వల్ప కాలిక, టర్మ్‌ రుణాలు, ఆగ్రో ప్రాసెసింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల కోసం తీసుకున్న రుణాలు, ఇతర వ్యవసాయ అనుబంధ రుణాలను ఈ కేటగిరిలో చేర్చారు. ఆర్‌బీఐ నిబంధనలు, ఆయా బ్యాంకుల విధానాల మేరకు ఈ ఉపశమన చర్యలు అమలు చేయాలి. 

⇒ కరువు ప్రభావానికి గురైన రుణ గ్రహీతలను గుర్తించి వారికి మారటోరియం వర్తింపజేయాలి.  
⇒ రుణ గ్రహీతతో సంబంధం లేకుండానే అర్హులైన వారి బ్యాంకు అకౌంట్లను గుర్తించి సుమోటో ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.  
⇒ కరువు ప్రభావానికి గురైన రుణ గ్రహీతలపై ఆర్థిక భారం తగ్గించడం కోసం అదనపు సాయం కూడా చేయాలి. ఉత్పత్తి సంబంధిత కార్యకలాపాల కొనసాగింపునకు అనుగుణంగా ఈ సాయం ఉండాలి. వ్యవసాయ అనుబంధ రంగాలకు అదనపు ఆర్థిక సాయం కోసం మంత్రివర్గ ఉప సంఘంతో చర్చించాలి.  

⇒ రుణాల రీస్ట్రక్చర్‌ చేసిన బ్యాంకు అకౌంట్లకు కూడా రైతు లేదా పంట బీమాలను అమలు చేయాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు సకాలంలో చెల్లించేవారికి ప్రోత్సాహకాలు, వడ్డీ రాయితీలను ఇవ్వాలి. వడ్డీ రాయితీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరాలి. 
⇒ బ్యాంకర్లు మానవీయ, సహానుభూతి, వృత్తి పరమైన స్ఫూర్తితో చర్యలు తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ఉపశమన చర్యలను కొనసాగించాలి.  

⇒ జిల్లాల లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్లు వెంటనే జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల మినిట్స్‌ను ఎస్‌ఎల్‌బీసీకి పంపాలి. ఉపశమన చర్యలపై ఎస్‌ఎల్‌బీసీతో పాటు బ్యాంకులు తగిన ప్రచారం కలి్పంచాలి. అన్ని ఉపశమన చర్యల అమలు, పురోగతిని సమయానుగుణంగా ఎస్‌ఎల్‌బీసీ పర్యవేక్షించాలి. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement