ప్రియుడితో కలిసి కన్న కొడుకునే హత్య చేసిన తల్లి | Bengaluru Man Strangled By Mother Her Lover After He Objected To Affair | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి కన్న కొడుకునే హత్య చేసిన తల్లి

Nov 11 2026 6:18 PM | Updated on Nov 11 2026 6:22 PM

Bengaluru Man Strangled By Mother Her Lover After He Objected To Affair

సాక్షి, బెంగళూరు:  బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని ప్రియుడి,అ తని  స్నేహితుల సాయంతో తల్లి  కన్న కొడుకునే  హత్య చేసిందో తల్లి.  నమ్మించి  గొంతుకోసిన  ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడిని బెంగళూరులోని ఆర్.టి. నగర్‌కు చెందిన విజయ్ నారాయణ్‌గా గుర్తించారు.

విజయ్ తల్లి మీనా నారాయణ్ (బ్యూటీ పార్లర్ మేనేజర్) తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన రాకేష్ జముని అనే వ్యక్తితో  వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసిన విజయ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. తమ బంధానికి విజయ్ అడ్డుగా ఉన్నాడని భావించి, అతడిని అంతమొందించేందుకు తల్లి, ఆమె ప్రియుడు కలిసి ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే  కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలు చూపిస్తామని విజయ్‌ని బెళగావికి రప్పించారు.  నవంబర్ 1న (కర్ణాటక రాజ్యోత్సవ రోజు) జాతీయ రహదారి పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో మీనా, రాకేష్,  రాకేష్‌కి చెందిన నలుగురు స్నేహితులు కలిసి విజయ్‌ని కర్ణాటక జెండాతో ఉరివేసి (గొంతు నులిమి) హత్య చేశారు.

ఇదీ చదవండి: 10 ఏళ్లలో అద్భుతం : క్యాన్సర్‌, అల్జీమర్స్‌ ఇక చరిత్రే!

విజయ్ మొబైల్ ఫోన్ కాల్ డిటైల్ రికార్డ్స్ (CDR) ఆధారంగా పరిశీలించగా, ఈ కుట్ర బయటపడింది.  స్వయంగా అతని తల్లికే ప్రమేయం ఉన్నట్లు తేలడంతో కేసు నమోదు  చేసి దర్యాప్తు చేపట్టారు.  ఈ కేసులో తల్లి మీనా,ప్రియుడు  రాకేశ్, స్నేహితులైన సచిన్, మనోజ్, తమ్మన్న, ఏక్‌నాథ్ అనే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: భారీ కొండచిలువపై జారుడు బండ ఆట, వైరల్‌ వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement