10 ఏళ్లలో అద్భుతం : క్యాన్సర్‌, అల్లీమర్స్‌ ఇక చరిత్రే! | Cancer Will Be History In 10 Years Anthropic CEOs Big Promise | Sakshi
Sakshi News home page

10 ఏళ్లలో అద్భుతం : క్యాన్సర్‌, అల్లీమర్స్‌ ఇక చరిత్రే!

Nov 11 2026 4:16 PM | Updated on Nov 11 2026 4:19 PM

Cancer Will Be History In 10 Years Anthropic CEOs Big Promise

క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు, మానసిక అనారోగ్యం లాంటి  సమస్యలు ఇవి పదేళ్లలోపే గతకాలపు అవశేషాలుగా మిగిలిపోతాయంటూ ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ ధీమా వ్యక్తంచేశారు. ఏఐ ( AI) వైద్య రంగంలో అద్భుతాల శకాన్ని తీసుకురాగలదని  విశ్వసిస్తున్నారు. అది అంత సులువు కాదని ఔషధ తయారీదారులు, శాస్త్రవేత్తలు నమ్ముతున్నప్పటికీ డారియో తాజా అంచనాలు ఆసక్తికరంగా మారాయి.

ఏఐ సాధిస్తున్న పురోగతితో పదేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే క్యాన్సర్, ఆల్జీమర్స్, గుండె జబ్బులు,మానసిక ఆరోగ్య సమస్యలు గతంలా మిగిలిపోతాయని  ఆయన విశ్వసిస్తున్నారు. ఏఐని సరిగ్గా వినియోగించుకుంటే వేల సంవత్సరాలుగా మనకు అంతుచిక్కని సమస్యలను మానవాళి పరిష్కరించగలిగే అద్భుతాల యుగాన్ని మనం సృష్టించగలమని  అమోడెయ్ అభిప్రాయపడ్డారు.జీవ పరిశోధన, ఔషధాల ఆవిష్కరణలను ఏఐ  చాలా వేగవంతం చేస్తుందన్నారు.

మరోవైపు టెస్లా  బాస్‌ ఎలాన్ మస్క్, గూగుల్ ఏఐ బాస్ డెమిస్ హస్సాబిస్‌తో సహా ఇతర ఏఐ నాయకులు కూడా గతంలోనే ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తంచేశారు. AI ఆధారంగా పదేళ్ల ఔషధ ఆవిష్కరణ ప్రక్రియను కొద్ది వారాల్లోకి కుదించవచ్చని డెమిస్ హస్సాబిస్  అంచనా. ఆల్ఫాఫోల్డ్ (AlphaFold - 200 మిలియన్లకు పైగా ప్రోటీన్ నిర్మాణాలను మ్యాపింగ్ చేసిన విప్లవాత్మక మోడల్) దీనికి నిదర్శనంగా చూపారు.

ఎలాన్ మస్క్: AI వల్ల భవిష్యత్తులో ప్రపంచంలోని ప్రతీ ఒక్కరికీ అమెరికా అధ్యక్షుడికి లభించే స్థాయిలోనే అత్యుత్తమ వైద్య సంరక్షణ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

సాధ్యం కాదంటున్న నిపుణులు
AI ఎంతగా పురోగమించినా, ఔషధ తయారీ రంగంలోని నిపుణులు  మాత్రం ఈ పదేళ్ల గడువు వాదనను అంగీకరించడంలేదు. ఈ అంచనాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని జెఫ్ లీడెన్ (Vertex Pharmaceuticals చైర్మన్)  కొట్టిపారేశారు. వారి సంస్థ 10,000 కంపౌండ్లను పరీక్షించేందుకు 50 AI కంపెనీలను సంప్రదించగా, అందులో ఏ ఒక్క AI మోడల్ కూడా సొంతంగా పనిచేసే పూర్తిస్థాయి ఔషధాన్ని తయారు చేయలేకపోయిందని తెలిపారు.

ఇదీ చదవండి: Dheyay Shah గ్రౌండ్‌ వాటర్‌ను గుర్తించే ‘జలాకార్‌’

క్లినికల్ ట్రయల్స్
కంప్యూటర్ స్క్రీన్‌పై ఒక మాలిక్యూల్ (కణం/అణువు) విజయవంతంగా కనిపించినంత మాత్రాన సరిపోదు. దానిని ల్యాబ్‌లు, జంతువులు మరియు మానవులపై (Clinical Trials) సుదీర్ఘకాలం పరీక్షించి, సురక్షితమైనదని రుజువు చేయాలి. ఈ ప్రక్రియకు 10 నుండి 12 సంవత్సరాలు పడుతుంది. AI ల్యాబ్ ఆవిష్కరణను వేగవంతం చేయగలదేమో కానీ, ఈ కీలకమైన రక్షణ పరీక్షల సమయాన్ని జీరో  చేయలేదన్నారు.

అలాగే ప్రస్తుత AI మోడళ్లకు సంక్లిష్టమైన జీవశాస్త్ర అవగాహన (Causal Understanding) ఇంకా పూర్తిగా అబ్బలేదని, ఇప్పటివరకు ఏ AI డిజైన్ చేసిన ఔషధం కూడా పూర్తి స్థాయి అనుమతులు పొంది మార్కెట్‌లోకి రాలేదని గ్యారీ మార్కస్ & ఎరిక్ టాపోల్ లాంటి నిపుణులు గుర్తుచేశారు. గతంలో (1970ల 'క్యాన్సర్‌పై యుద్ధం' లాంటివి) కూడా ఇటువంటి గడువుల ఆధారంగా హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయిన చరిత్ర ఉంది. కాబట్టి AI జీవశాస్త్ర పరిశోధనను వేగవంతం చేసినప్పటికీ, సంక్లిష్ట వ్యాధులను పదేళ్లలో పూర్తిగా నిర్మూలించడం అనేది ప్రస్తుత వైద్య విజ్ఞాన ప్రక్రియల ప్రకారం అనేక సవాళ్లతో కూడుకున్నది అంటున్నారు వైద్య రంగ నిపుణులు. 

ఇదీ చదవండి: కష్టాలు, కన్నీళ్లే ఇన్నాళ్లు : చివరికి ‍శ్రుతి జీవితంలో కొత్త వెలుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement