మెషీన్ లెర్నింగ్
రానురాను నీటి కరువు పెరుగుతూనే ఉంది గాని తగ్గడం లేదు, అందులోనూ ప్రపంచమంతా ఇప్పుడు తీవ్ర ఎండ తాపాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో భూగర్భ జలాల లభ్యతను ముందుగానే అంచనా వేసే సాంకేతికత మన దగ్గర ఉంటే? మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా నీటి కరువు తీరినట్టే. ఈ ఆలోచనకు వాస్తవరూపం ఇచ్చాడో పాఠశాల విద్యార్థి. భూగర్భ జలాలను ముందుగానే అంచనా వేయడానికి మెషీన్ లెర్నింగ్ సాంకేతికతను ఉపయోగించి జాతీయస్థాయి గుర్తింపు పొందాడు గుజరాత్‌కి చెందిన విద్యార్థి ధేయాయ్ షా (Dheyay Shah).
ఇదీ చదవండి: అణువంత చిన్న ఆర్కిమెడిస్ స్క్రూ!
సూరత్‌లోని ఆర్‌ఎంజీ మహేశ్వరి ఇంగ్లిష్ స్కూల్‌లో ధేయాయ్ చదువుతున్నాడు. తాను రూపొందించిన ‘జలాకార్ – ది షేప్ ఆఫ్ వాటర్ ప్రిడిక్ట్, అలర్ట్ అండ్ యాక్ట్ ప్రాజెక్టుతో వివో ఇండియా సంస్థ ప్రతి ఏటా నిర్వహించే వివో ఇగ్నైట్ లో జాతీయ విజేతగా నిలిచాడు. అక్టోబర్ 28న న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ముగింపు కార్యక్రమంలో విజేతను ప్రకటించారు. విద్యార్థుల ఆవిష్కరణల కోసం రూ.35 లక్షల వరకు స్కాలర్‌షిప్‌లు, బహుమతులు అందించనున్నారు.
ఇదీ చదవండి: కళ్లలో చక్కెర కొడుతుంది జాగ్రత్త!!


