పరి పరిశోధన
నీటిని పైకి తోడేందుకు ఉపయోగించే ఆర్కిమెడిస్ స్క్రూ గురించి తెలుసు కదా! ఇప్పుడు అదే సూత్రంతో పనిచేసే ఓ యంత్రాన్ని శాస్త్రవేత్తలు అణువంత స్థాయితో రూపొందించారు. ఇజ్రాయెల్‌లోని వీజ్ మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సై న్స్ పరిశోధకులు, అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో కలిసి ఈ ప్రయోగం చేశారు.
ఒక సేంద్రియ అణువును రెండు బంగారు ఎలక్ట్రోడ్ల మధ్య అమర్చి విద్యుత్ ప్రవాహాన్ని పంపించారు. దీంతో ఆ అణువు స్క్రూ మాదిరిగా తిరగడం ప్రారంభించింది. విద్యుత్ ప్రవాహం దిశను మార్చినప్పుడు దాని భ్రమణ దిశ కూడా మారింది. అంతేకాదు, అణువు నిర్దిష్ట వేగంతో తిరగడం ప్రారంభించినప్పుడు దాని గుండా ప్రవహించే విద్యుత్ పరిమాణం ఏకంగా వంద రెట్లు పెరిగింది. ఈ పరిశోధనకు భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్ సింగ్ నాయకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన ఐఐటీ మద్రాస్‌లో అధ్యాపకుడిగా ఉన్నారు. భవిష్యత్తులో అతి సూక్ష్మ ఎలక్ట్రానిక్ పరికరాల అభివృద్ధికి ఈ పరిశోధన ఉపయోగపడవచ్చు.
ఇదీ చదవండి: కష్టాలు, కన్నీళ్లే ఇన్నాళ్లు : చివరికి శ్రుతి జీవితంలో కొత్త వెలుగులు


