ఆ జిల్లాలకు 30 వరకు కరెంట్‌ ఇవ్వలేం | Power Supply Cannot Be Restored in Affected Districts Until the 30th: CM Chandrababu | Sakshi
Sakshi News home page

ఆ జిల్లాలకు 30 వరకు కరెంట్‌ ఇవ్వలేం

Oct 29 2026 5:52 AM | Updated on Oct 29 2026 5:52 AM

Power Supply Cannot Be Restored in Affected Districts Until the 30th: CM Chandrababu

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఐదుగురు మృతిచెందారు

తుపాను బాధితులకు 25 కేజీలు బియ్యం

కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, చక్కెర, బంగాళా దుంపలు

లీటర్‌ పామాయిల్‌–రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం

పంట నష్టాల వివరాల సేకరణకు సమయం పడుతుంది

నేడు, రేపు ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తా: మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: ఎన్ని ప్రయత్నాలు చేసినా అర్నబ్‌ తుపానుకు ఐదుగురు మృతిచెందారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. విద్యుత్‌ షాక్,, గోడ కూలిన ఘటనల్లో వీరు చనిపోయారని చెప్పారు. వీరి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పు­న పరిహారం చెల్లిస్తామన్నారు. జన జీవనాన్ని తుపాను అతలాకుతలం చేయడంతో పాటు పంటలకు భారీ నష్టం మిగిలి్చందన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవడానికి, రహదారులు, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు వెంటనే చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పా­రు. సీఎం చంద్రబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..

కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 30వ తేదీ సాయంత్రానికిగానీ విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించలేం. అక్కడ పరిస్థితులు అనుకూలించడంలేదు. మిగతా జిల్లాల్లో బుధవారం రాత్రికల్లా వి­ద్యుత్‌ సరఫరా పునరుద్ధరిస్తాం. తుపాను నష్టంపై కేంద్రానికి లేఖ రాయడంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కూడా ఫోన్‌లో మా­ట్లాడాను. కొబ్బరి, ఇతర ఉద్యాన పంటలు దెబ్బ­తిన్నాయి. పూర్తిస్థాయి సమగ్ర నివేదికను కూడా త్వరలోనే పంపేలా చర్యలు చేపడతాం. ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరితే 25 కేజీల బి­య్యం ఇవ్వాలని ఆదేశించాం.

చేనేత మగ్గాలు, మ­త్స్యకారులకు 50 కే­జీ­ల బియ్యం, కేజీ చొప్పు­న ఉల్లిపాయలు, వంట­నూ­నె, కందిపప్పు, బంగాళాదుంపలు రేషన్‌ ఇస్తాం. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వా­రికి రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం.. ఇల్లు పా­క్షికంగా ధ్వంసమైతే రూ.­10 వేలు, దుకా­ణాలకు రూ.25 వేలు సాయం అందిస్తాం. ఎంఎస్‌­ఎంఈల­కు కేటగి­రీల వారీగా ఆర్థిక సాయం, ద్విచక్ర వాహనానికి రూ.3 వేల సాయం చెల్లిస్తాం.

త్రిచక్ర వాహనాలకు 10 వేలు, పుష్కార్ట్‌లకు 20 వేలు, వీవర్‌ కమ్యూని­టీకి రూ.­25 వేలు, ఫిషింగ్‌ బోట్, వలలు ధ్వంసమై­తే రూ.­25 వేలు సాయం ఇస్తాం. హెక్టారు­కు వరి, పత్తికి రూ.25 వేలు, చెరకుకు రూ.­25 వేల చొప్పున, ఇతర పంటలకు ఆ­యా కేటగిరీ­ల వారీ­గా ఆర్థిక సాయం అందిస్తాం. అరటి పంట­కు హె­క్టా­రుకు రూ.35 వేల చొప్పున ఇస్తాం. టమోటాకు రూ.25 వేలు చొప్పున.. కొబ్బరి చెట్టు, పా­మాయి­ల్‌ చెట్టు­కు రూ.15 వేలు చొప్పున అంది­స్తాం. అలా­గే, మృతిచెందిన పశువులకూ ఆర్థిక సా­యం అందిస్తాం. 

పంట నష్టాల ఎన్యూమరేషన్‌కు టైం పడుతుంది..
వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టాల ఎన్యూమరేషన్‌కు సమయం పడుతుంది. అది పూర్తయ్యాక రైతులకు సాయం అందిస్తాం. ఇక గురువారం వర్చువల్‌గా జరిగే కేబినెట్‌ సమావేశంలో ఆర్థిక సాయంపై నిర్ణయాలు తీసుకుని బాధితులకు ఆర్థిక సాయం అందిస్తాం. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల పర్యటనకు గురువారం మధ్యాహ్నం నుంచి వెళ్తా. అలాగే, శుక్రవారం కూడా జిల్లాల పర్యటనలోనే ఉంటాను.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement