కోనసీమ జిల్లా అంబాజీపేటలో తుపాను ధాటికి రోడ్డుపై విరిగిపడిన విద్యుత్ స్తంభం
ఏపీ సీపీడీసీఎల్, ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో 4,729 గ్రామాలు ప్రభావితం
ఇంకా చీకట్లోనే మగ్గుతున్న 1,473 గ్రామాలు
రెండు డిస్కంల పరిధిలో 19,45,764 సర్వీసులకు అందని విద్యుత్
జిల్లా కలెక్టర్ కార్యాలయాల నుంచి మంత్రుల ఇళ్ల వరకూ అంధకారం
సాక్షి, అమరావతి: అర్నబ్ తుపాను దెబ్బకు రాష్ట్రంలోని వేలాది గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో 3,872 గ్రామాలు ప్రభావితం కాగా, 1,323 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో 857 గ్రామాలు ప్రభావితం కాగా, 150 గ్రామాల్లో ఇంకా సరఫరా పునరుద్ధరణ జరగలేదు. రెండు డిస్కంల పరిధిలోనూ కలిపి మొత్తంగా 1,473 గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. బుధవారం రాత్రికి 19,45,764 సర్వీసులకు విద్యుత్ సరఫరా అందలేదు.
మచిలీపట్నంలో కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి సైతం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విద్యుత్ స్తంభాలు, సబ్‌స్టేషన్లు, ఫీడర్లు, లైన్లు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
అదనపు సిబ్బంది, సామగ్రి అందించాలని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కోరడంతో తెలంగాణ ప్రభుత్వం సహకరించేందుకు అంగీకరించింది. ఈపీడీసీఎల్ పరిధిలో రూ.16.54 కోట్లు, సీపీడీసీఎల్ పరిధిలో రూ.1.57 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఈపీడీసీఎల్ పరిధిలో భారీ ఎఫెక్ట్
ఈపీడీసీఎల్ పరిధిలో 25,74,641 నాన్ అగ్రికల్చర్ సర్వీసులు ప్రభావితం కాగా, 7,05,544 సర్వీసులకు సరఫరా పునరుద్ధరించారు. ఇంకా 18,69,097 సర్వీసులు పెండింగ్‌లో ఉన్నాయి. వ్యవసాయ సర్వీసులు 96,643 ప్రభావితం కాగా, 22,627 పునరుద్ధరించారు. మరో 74,016 సర్వీసులకు సరఫరా అందాల్సి ఉంది. ఈ డిస్కం పరిధిలో 541 సబ్‌స్టేషన్లు, 483 33 కేవీ ఫీడర్లు, 2,689 11 కేవీ ఫీడర్లు ప్రభావితం కాగా, వరుసగా 349, 321, 1304 పునరుద్ధరించారు.
యి. అలాగే 11 కేవీ స్తంభాలు 3,793 దెబ్బతినగా 297 పునరుద్ధరించారు. ఎల్‌టీ స్తంభాలు 5,668 పడిపోగా.. 209 నిలబెట్టారు. 673 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటే 50 మాత్రమే పని చేయించగలిగారు. 7 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రభావితమైతే ఒక్కటి మాత్రమే పునరుద్థరించగలిగారు. ఇవికాకుండా కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 వేలకుపైగా విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని, ఈ జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మరో 48 గంటలు సమయం పట్టవచ్చని డిస్కం సీఎండీ వెల్లడించారు.


