పచ్చచొక్కాలేసిన ఖాకీలు
ప్రజాస్వామ్యానికి చంద్రబాబు ఉరి
నామినేషన్ నుంచి ఉపసంహరణ దాకా.. అడుగడుగునా అరాచకం
స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతరేసిన పోలీసులు, రిటర్నింగ్ అధికారులు
ఎస్పీల నుంచి ఎస్సైల వరకు.. ఖాకీకి పచ్చ రంగు పులిమారు
టీడీపీ సభ్యత్వం ఉన్న కరుడుగట్టిన కార్యకర్తల్లా పనిచేశారు
ప్రశ్నిస్తే నిర్బంధం.. ఎదిరిస్తే అక్రమ కేసులు.. చంద్రబాబు ఆడమన్నట్టల్లా ఆడిన ఆర్వోలు
అధికార పారీ్టకి అనుకూలంగా వ్యవహరించడమేనా అధికారుల విధి?
నామినేషన్ల చించివేత, ఫోర్జరీలు, ఫేక్ నామినేషన్లపై ఏం చెబుతారు?
నామినేషన్లలో కొన్ని పత్రాలు తీసేసి అనర్హులుగా ప్రకటించిన ఆర్వోలు
అధికార దుర్వినియోగానికి పాల్పడిన వీరందరిపై చర్యలేవి?
దీనికి ఎన్నికల సంఘం ఏం చెబుతుంది?
దశ కుట్రలివీ..
చంద్రబాబు, ఆయన గ్యాంగ్ కలిసి ఈ స్థానిక ఎన్నికల్లో చేసిన 10 కుట్రలు ఇలా ఉన్నాయి
1 నామినేషన్ వేయకముందే.. పోటీ చేయాలనుకునే వారికి బెదిరింపులు.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, వారికి సహకరించే వారిని బెదిరించడం, బైండోవర్ చేయడం, ముందస్తు అరెస్టులు చేయడం.
2 నాయకుల గృహ నిర్భంధం..ఎక్కడా అభ్యర్థులకు తోడుగా నాయకులను వెళ్లనీయలేదు.
3 నామినేషన్ కేంద్రాల్లోకి ప్రతిపక్ష అభ్యర్థులు రాకుండా టీడీపీ కిరాయి గూండాలు, గంజాయి బ్యాచ్‌లతో పోలీసులే దగ్గరుండి దాడులు చేయించారు.
4 పోలీసుల సమక్షంలోనే నామి నేషన్ పత్రాలు లాక్కున్నారు. కొన్ని చోట్ల ఆర్వోల చేతిలో నుంచి లాక్కుని చించేశారు.
5 ఇన్ని అక్రమాలు జరుగుతున్నా పోలీసులు అడ్డుకోలేదు. బాధిత అభ్యర్థులనే బయటకు నెట్టేశారు. నామినేషన్ వేయడానికి అభ్యర్థి కాకుండా, కేవలం ముగ్గురినే అనుమతించారు. టీడీపీ గూండాలు మాత్రం వందల్లో ఉన్నారు. వాళ్లు దౌర్జన్యంగా నామినేషన్ పత్రాలు లాక్కుని చించేశారు.
6 దాడి చేసిన వారిని వదిలేసి, దాడులకు గురైన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల పైనే తిరిగి కేసులు పెట్టారు. అలా వారిని ఇంటికే పరిమితం చేశారు. లేదంటే జైలుకు పంపారు.
7 స్క్రూటినీ పేరుతో నామినేషన్లు తిరస్కరించారు. ఆ సమయంలో అభ్యర్థులను ఆఫీసులకు రానివ్వలేదు. కొన్ని చోట్ల
అభ్యర్థుల సంతకాలు ఫోర్జరీ చేసి, విత్‌డ్రా చేసుకున్నట్లు చెప్పారు.
8 అభ్యర్థులను బెదిరించి నామినేషన్ ఉపసంహరణకు ఒత్తిడి చేశారు.
9 టీడీపీ వాళ్లే వైఎస్సార్‌సీపీ అభ్య ర్థులుగా నంబర్ ఎక్కువగా కనిపించడానికి నకిలీ నామినేషన్లు వేశారు. తర్వాత ఉపసంహరించారు.
10 అమ్ముడుపోయిన ఆర్వోలు.. నామినేషన్ సందర్భంగా అన్ని పత్రాలు సరిగానే ఉన్నాయని రాసిచి్చన ఆర్వోలు.. ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు చించేశారు. ఆతర్వాత నామినేషన్లను తిరస్కరించారు.
తాను గెలవలేనని చంద్రబాబుకు తెలుసు.. ప్రజలకు మంచి చేయలేదని తెలుసు.. ప్రజల్లోకి వెళ్తే నిలదీతలు తప్పవనీ తెలుసు! అందుకే ప్రజల తీర్పును ఎదుర్కొనే ధైర్యం లేక, ప్రత్యర్థులను బరిలోకే రాకుండా అడ్డుకునే కుట్రలకు తెరలేపారు. పోలీసులను, ఎన్నికల అధికారులను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ, తాను కోరుకున్నవారే ఏకగ్రీవం కావాలన్న లక్ష్యంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రాజకీయానికి దిగారు. నామినేషన్ వేయకముందే
బెదిరింపులు.. నాయకులకు గృహ నిర్బంధాలు.. నామినేషన్ కేంద్రాల వద్ద దౌర్జన్యాలు.. పత్రాలు లాక్కోవడం, చించేయడం.. స్క్రూటినీ పేరుతో తిరస్కరణలు.. బలవంతపు ఉపసంహరణలు!
ఇలా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ ప్రత్యర్థులను ఎన్నికల బరి నుంచి తప్పించే ఎత్తుగడలకు దిగారు. ప్రజలకు చేసిన మేలు చెప్పుకుని ఓట్లు అడగాల్సిన చంద్రబాబు.. ప్రత్యర్థులను అడ్డు కుని ఏకగ్రీవాలు సాధించడమే రాజకీయ వ్యూహంగా మార్చుకున్నారు. ప్రజల మద్దతు ఉంటే పోటీకి భయమెందుకు? పాలనపై నమ్మకం ఉంటే ప్రత్యర్థుల నామినేషన్లను అడ్డుకోవాల్సిన అవసరమేంటి? ప్రజాతీర్పును ఎదుర్కోవాల్సిన పాలకులు, ప్రజల ఎంపికకు అడ్డుగోడలు కడితే అది ప్రజాస్వామ్యానికి పట్టిన దుర్గతి కాదా? ప్రజల మనసులు గెలవలేక ప్రత్యర్థులను అడ్డుకోవడం.. పాలనతో నమ్మకం పొందలేక అధికారంతో భయపెట్టడం.. ఇదే చంద్రబాబు రాజకీయ నీతి.
ప్రజల ఓట్లతో గెలవాలి
కానీ, ప్రజలకు ప్రత్యామ్నాయమే లేకుండా చేసి గెలిచినట్లు చెప్పుకోవడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఇటు పోలీసులను, అటు ఎన్నికల సంఘం అధికారులను అడ్డగోలుగా వాడుకున్న చంద్ర బాబు తాను అనుకున్నట్లు ఏకగ్రీవాలు సాధించారు. అందుకోసం రాష్ట్రంలో గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో సాగించిన దశకుట్రలు, దుర్మార్గాలు, దాషీ్టకాలు చూసి దేశమంతా నివ్వెరపోయింది. పోలింగ్‌కు ముందే ఇన్ని అరాచకాలు చేస్తే ఇక పోలింగ్ రోజు ఎలాంటి భీతావహ పరిస్థితులను చూడాల్సి వస్తుందోనని జనం చర్చించుకుంటున్నారు.

కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్.. పల్నాడు ఎస్పీ జగదీష్ అడహళ్లి.. అన్నమయ్య ఎస్పీ ధీరజ్ కనుబిల్లి.. కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్.. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు.. చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలయినప్పటి నుంచి వీళ్ల పేర్లు తరచూ వింటున్నాం. ఈ జిల్లాల్లో జరిగే అరాచకాలను అరికట్టడానికి బదులు మరింత తీవ్రరూపం దాల్చడానికి వీళ్ల నిష్క్రియా పరత్వం, అధికార పక్షానికి తొత్తుల్లా వ్యవహరిస్తుండడమే కారణమన్న విమర్శలున్నాయి. ఇంతకూ వీళ్లు చేసిందేమిటి? వీళ్లకు ఎందులో మంచి నైపుణ్యముంది? వీళ్ల రేంజ్‌లోని ప్రాంతాల్లో ఏం జరిగిందో.. తెలుసుకుందాం..
‘‘యోగః కర్మసు కౌశలమ్’’ భగవద్గీత 2వ అధ్యాయం, 50వ శ్లోకంలోని వాక్యమిది. కర్తవ్య నిర్వహణలో నైపుణ్యమే యోగం.. ఇదీ సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇచ్చే ముస్సోరి ట్రైనింగ్ అకాడమి మోటో. అధికారాన్ని ప్రదర్శించడం కాదు, చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయడం; రాజకీయ ఒత్తిళ్లకు లొంగడం కాదు, రాజ్యాంగబద్ధమైన విధులను సమర్థంగా నిర్వర్తించడం అని బోధిస్తారు. కానీ ఈ అధికారులు పాక్ ఆక్రమిత కాశ్మీరులోని ఉగ్రవాద శిబిరాలలో శిక్షణ తీసుకున్నట్టు ఉంది.
అందుకే అరాచకాలకు పెద్దపీట వేయడం, అధికారపక్షానికి కొమ్ముకాస్తూ ప్రతిపక్షానికి నరకం చూపించడమే నైపుణ్యమని నమ్ముతున్నట్లుగా కనిపిస్తుంది. వీళ్ల నైపుణ్యాలేమిటో తెలుసా? నామినేషన్ ప్రక్రియను రణరంగంగా మార్చడం అర్హత ఉన్న ప్రతిపక్ష సభ్యుల్లో ఏ ఒక్కరినీ నామినేషన్ వేయనీయకుండా చూడడం.. కసాయి మూకలను ముందే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతించడం.. కళ్ల ముందే దాడులు జరుగుతున్నా.. ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోకపోవడం ప్రశ్నించిన వారిని కొట్టడం.. వారిపైనే తిరిగి కేసులు పెట్టడం దుశ్శాసనులుగా మారి మహిళలపై అరాచకాలు చేస్తున్నా పట్టనట్టు వ్యవహరించడం.. ప్రతిపక్ష సభ్యులపై దాడి చేయడంలో రౌడీమూకలు మిస్సయినా తామే ముందుకు దూకి దాడులు చేయడం ప్రతిపక్ష సభ్యులెవరూ నామినేషన్ వేయకూడదు.. ఎన్నికలు స్వేచ్ఛగా జరగకూడదు.. ఇవే లక్ష్యాలు
1. కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్..
వైఎస్సార్ కడప జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పోలీసు వ్యవస్థ వైఫల్యం బహిర్గతమైంది. మూడు రోజుల పాటు టీడీపీ మూకలు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు దిగుతూ నామినేషన్లను అడ్డుకున్నా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోయారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉన్నా గుంపులను చెదరగొట్టలేదు. మరోవైపు వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులు, హౌస్ అరెస్టులు.. దాడులకు దిగిన మూకలకు మాత్రం అడ్డుకట్ట లేకుండా పోయింది.
కడప నగరం నుంచి మున్సిపల్ కేంద్రాల వరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్తే దాడులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. వరుస ఘటనలు జరిగినా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. ఎస్పీ బంగళాకు సమీపంలోని గాంధీనగర్ హైసూ్కల్ వద్ద శ్యాంసన్‌పై దాడి జరిగింది. మరియాపురంలో మాజీ కార్పొరేటర్ బాలస్వామిరెడ్డిపై పోలీసుల సమక్షంలోనే దాడి జరగగా, కాగితాలపెంట వద్ద మురాద్‌పై కత్తిపోట్లు పడ్డాయి. ఆంక్షలు అమల్లో ఉన్నా గుంపులుగా చేరిన టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టలేదు.
దాడుల తర్వాత కూడా మరుసటి రోజు పటిష్ట బందోబస్తు లేకపోవడంతో నామినేషన్లకు మళ్లీ అడ్డంకులు ఎదురయ్యాయి. వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులు జారీ చేసి హౌస్ అరెస్టులు చేయడంలో చురుగ్గా వ్యవహరించిన పోలీసులు, నామినేషన్లను అడ్డుకున్న మూకలను నియంత్రించడంలో మాత్రం విఫలమయ్యారు. నామినేషన్లు వేయలేక హైకోర్టును ఆశ్రయించిన సుమారు 20 మంది అభ్యర్థులకు రక్షణ కల్పించి నామినేషన్లు వేయించాలని కోర్టు ఆదేశించింది. అయినా మేయర్ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, డీఎస్పీ భవానిని ఆశ్రయించినా అభ్యర్థులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారు.
2. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్..
పులివెందులలో మురళీనాయక్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పోలీసు వ్యవస్థ అధికార పారీ్టకి కొమ్ముకాస్తూ, ప్రతిపక్షాన్ని అణచివేసే సాధనంగా మారింది. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం.. నిరసనకు దిగిన నాయకులపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం.. రాళ్ల దాడులకు దిగడం.. ఇదీ పులివెందులలో ఖాకీ రాజ్యం! ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అభ్యర్థులతో కలిసి వచ్చినా వైఎస్సార్‌సీపీ నేతలను నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతించలేదు.
నిరసనకు దిగిన వైఎస్సార్‌సీపీ నాయకులపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి రాఘవరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్ సహా పలువురు గాయపడ్డారు. రెండు కేసుల్లో 924 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, కీలక నేతల అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. డీఎస్పీ తీరుపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం, హైకోర్టును ఆశ్రయించారు.
3. తిరుపతి డీఎస్పీ కొండయ్య నాయుడు..
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా డీఎస్పీ పి. కొండయ్య నాయుడు వ్యవహరించిన తీరుపై తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి. వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి వాసుదేవ యాదవ్, ఎంపీ డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఆర్వో కేంద్రానికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు వందలాది మంది వారిని చుట్టుముట్టి అడ్డుకున్నారు. కారుపై కర్రలతో, చేతులతో దాడి చేస్తూ గందరగోళం సృష్టించినా, అక్కడే ఉన్న డీఎస్పీ బాధితులకు రక్షణ కల్పించలేదని వివరించారు.
మేయర్ అభ్యర్థి, ఎంపీ, ఎమ్మెల్సీని వందలాది మంది చుట్టుముట్టి కారు దిగకుండా అడ్డుకున్న సమయంలో డీఎస్పీ పి. కొండయ్య నాయుడు అక్కడే ఉన్నారు. కర్రలతో, చేతులతో కారును బాదుతూ గందరగోళం సృష్టించినా డీఎస్పీ రక్షణ కలి్పంచలేదు. నామినేషన్ వేసేందుకు వచ్చిన ప్రజాప్రతినిధులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారన్నది డీఎస్పీ పాత్రపై ప్రధాన ప్రశ్న.
మరోసారి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించినప్పుడు కూడా గుంపులు గుమిగూడి దౌర్జన్యానికి దిగినా డీఎస్పీ చూస్తూ ఉండిపోయారు. నామినేషన్ ప్రక్రియను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉన్న అధికారిగా కొండయ్య నాయుడు ఎందుకు జోక్యం చేసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
4. ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్..
నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో డీఎస్పీ రామాంజినాయక్ తీరు వివాదాస్పదంగా మారింది. వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి ప్రియాంకభాయ్ నామినేషన్‌లోని కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీని పరిశీలన సమయంలో టీడీపీ కార్యకర్త యుగంధర్‌రెడ్డి చించేశాడు. ఈ ఘటనపై నిరసన తెలిపేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిపై డీఎస్పీ విరుచుకుపడ్డాడు.
ఏకవచనంతో సంబోధిస్తూ, నిరసన చేస్తే కేసులు పెడతానంటూ హెచ్చరించాడు. కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరించి నిరసనను అడ్డుకున్నాడు. నిరసన చేస్తే చూస్తూ ఊరుకోనని, కేసులు పెడతానంటూ హెచ్చరించాడు. కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ హెచ్చరించి, మాజీ ఎమ్మెల్యేను, కార్యకర్తలను వెనక్కి పంపించాడు. మున్సిపల్ ఎన్నికల్లో 60:40 నిష్పత్తిలో రాజీ కేటాయింపుల వెనుక పాత్ర ఉందనే చర్చ సాగింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బెదిరించి రాజీ ప్రక్రియ నడిపించడంలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.
5. మదనపల్లె డీఎస్పీ ప్రసాద్..
పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ దారుణంగా వ్యవహరించారు. టీడీపీ మూకలు దాడులకు దిగుతుంటే అడ్డుకోకుండా చూస్తుండిపోయారు. ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడులు జరుగుతున్నా జోక్యం చేసుకోలేదు. ఆ తర్వాత గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఘటనపై డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదులోని వివరాలు కూడా పలు ప్రశ్నలకు తావిస్తున్నాయి.
టీడీపీ మూకలు స్వైరవిహారం చేస్తుంటే అడ్డుకోవాల్సిన డీఎస్పీ ప్రసాద్ మౌనంగా ఉండిపోయారు. ఎంపీ స్థాయి వ్యక్తిపై దాడులు జరుగుతున్నా చర్యలు తీసుకోలేదు. గేటు వద్ద సీఐలు దస్తగిరి, సుబ్బారాయుడు నిబంధనలు వివరించారని ఫిర్యాదులో పేర్కొంటూనే, వాహనం గేటును ఢీకొని దూసుకెళ్లిందని చెప్పడం పరస్పర విరుద్ధంగా కనిపిస్తోంది.
గుంపును చెదరగొట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కాల్పులే చివరి మార్గంగా మిగిలేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? మూడు రౌండ్ల కాల్పులకు దారితీసిన పరిస్థితులపై సమాధానం లేదు. దాడులకు దిగినవారికే ప్రాణహాని ఉందనే కారణంతో కాల్పులు జరిపినట్లు ఫిర్యాదులో పేర్కొనడం డీఎస్పీ నిర్ణయంపై తీవ్ర సందేహాలు రేకెత్తిస్తోంది.
6. చంద్రగిరి డీఎస్పీ జగదీష్ నాయక్..
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ కేంద్రాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంలో డీఎస్పీ జగదీష్ నాయక్ పాత్రపై తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి. అనుప్పల్లి ఎంపీటీసీ అభ్యర్థి నందిని, ఆమె భర్త సాంబయాదవ్ నామినేషన్లు వేయడానికి వెళ్లినప్పుడు టీడీపీ గూండాలు అడ్డుకుని పత్రాలు చించివేశారు. డీఎస్పీ సిబ్బందిని వెనక్కి పంపించడంతో అభ్యర్థులకు రక్షణ కరువైంది.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. డీఎస్పీ సమక్షంలోనే నందిని నామినేషన్ పత్రాలను చించివేశారు. అభ్యర్థుల వివరాలను టీడీపీ నాయకులకు చేరవేసి నామినేషన్లను అడ్డుకునేందుకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. మూడు రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్న నందిని, సాంబయాదవ్‌లకు చివరి రోజు ఎస్పీ, కలెక్టర్ వచ్చి నామినేషన్లు వేయించారు.
7. ప్రొద్దుటూరు డీఎస్పీ బాలస్వామిరెడ్డి..
ప్రొద్దుటూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బాలస్వామిరెడ్డి ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్ల తిరస్కరణ, నిరసనకారులపై లాఠీఛార్జి ఘటనలు ఆయన పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తాయి. 15 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.
టీడీపీ అభ్యంతరాలపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ నేతలపై లాఠీఛార్జి చేశారు. మహిళల పట్ల కూడా పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి.
8. దర్శి సీఐ నాగమల్లేశ్వరరావు..
దర్శి సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు అత్యంత దారుణంగా వ్యవహరించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గొట్టిపాటి
లక్షి్మకి అనుకూలంగా పనిచేస్తూ, దర్శి మున్సిపాలిటీలోని 32 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు పోలీసు అధికారాన్ని ప్రయోగించారు. నామినేషన్ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులను కొట్టడం, నామినేషన్ పత్రాలను చించివేయడం, భారీ సంఖ్యలో నాన్‌బెయిలబుల్ కేసులతో భయపెట్టడం ఈ వ్యవహారంలో ప్రధాన అంశాలు. నామినేషన్ల మొదటి రోజు గడియారం స్తంభం సెంటర్ దాటనివ్వలేదు.
రెండో రోజు డీఎస్పీ కార్యాలయం దాటి అభ్యర్థులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలు చేతిలో ఉన్న అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని కొట్టి భయభ్రాంతులకు గురిచేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు నామినేషన్ కేంద్రాల వద్ద కర్రలు, మారణాయుధాలతో గుంపులుగా తిరిగినా పట్టించుకోలేదు.
నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను కొట్టడం, సెల్‌ఫోన్లు పగలగొట్టడం, నామినేషన్ పత్రాలను చించివేయడం జరిగినా అడ్డుకోలేదు. ఎస్‌ఐకి తగిలిన చిన్న గాయాన్ని సాకుగా చూపి నాన్‌బెయిలబుల్ కేసులు పెడతామని బెదిరించి 131 మందిపై కేసులు పెట్టారు. మరికొందరి పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
9. మైదుకూరు సీఐ శివశంకర్..
మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్ కనుసన్నల్లోనే నియోజకవర్గ పోలీసు వ్యవస్థ నడిచింది. మైదుకూరు మున్సిపాలిటీలో 32 వార్డులుంటే 17 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరోవైపు, చాపాడు, దువ్వూరు, ఖాజీపేట జెడ్పీటీసీ స్థానాలను టీడీపీ ఏకగ్రీవం చేసుకునేలా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయలేని పరిస్థితులు కలి్పంచారు.
32 వార్డుల్లో 17 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 15 వార్డులకే ఎన్నికలు జరిగే పరిస్థితి ఏర్పడింది. ఖాజీపేటలో 14, చాపాడులో 12, దువ్వూరులో 12 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. అతికష్టం మీద కేవలం మూడు ఎంపీటీసీ స్థానాల్లోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో నియోజకవర్గ పోలీసు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల విధులపై దిశానిర్దేశం చేశారన్నది మరో ఆరోపణ.
ఎన్నికల వ్యవహారంలో రూ.3 కోట్ల లావాదేవీ జరిగిందని, అందులో సీఐ శివశంకర్ రూ.1.5 కోట్లు తీసుకుని మిగిలిన మొత్తాన్ని ఇతర పోలీస్ స్టేషన్లకు పంచారనే ఆరోపణలు ఉన్నాయి. ఏకగ్రీవమైన ఎంపీటీసీల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష చొప్పున వసూలు చేయడం ప్రారంభించారన్న ఆరోపణలూ ఉన్నాయి.
10. గురజాల సీఐ మురళి..
గురజాల సీఐ మురళి నగర పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు అనుకూలంగా వ్యవహరిస్తూ, చైర్మన్ అభ్యర్థి పోలు వీరారెడ్డిని అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. చివరి రోజు నామినేషన్లకు ప్రయత్నించిన అభ్యర్థులను అడ్డుకోవడంతో పాటు, నకిలీ నామినేషన్ల వ్యవహారంలోనూ జోక్యం చేసుకున్నారు.
గురజాల నగర పంచాయతీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. పోలు వీరారెడ్డిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ నామినేషన్లు పడకుండా అడ్డుకోవడంతో పాటు, పార్టీ పేరుతో నకిలీ నామినేషన్ వేయించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి నిర్బంధించారు.
11. రాయచోటి సీఐ బీవీ చలపతి
రాయచోటి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా సీఐ బీవీ చలపతి వ్యవహరించిన తీరుపై తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి. టీడీపీ మూకలు కత్తులు, రాడ్లు, కర్రలు, రాళ్లతో స్వైరవిహారం చేస్తుంటే అడ్డుకోకుండా, వైఎస్సార్‌సీపీ కార్యాలయంలోని నేతలను బయటకు పంపేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ తర్వాత టీడీపీ మూకలు కార్యాలయంపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించినా, దాడి చేసినవారిని చెదరగొట్టకుండా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలనే తరిమారు. టీడీపీ కార్యాలయం ఎదుట వందలాది మంది గుమిగూడినా చర్యలు తీసుకోలేదు.
వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సమావేశమైన నేతలను మాత్రం బయటకు పంపేందుకు ప్రయత్నించారు. టీడీపీ మూకలు వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించినా వారిని అదుపు చేయలేదు. దాడి చేసినవారిని అడ్డుకోవాల్సిన సీఐ చలపతి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పిస్టల్ చూపిస్తూ చెదరగొట్టారు. దాడి చేసినవారిపై ఒక కేసు నమోదు చేయగా, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రెండు కేసులు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి జిన్నా షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులను కేసులో ఇరికించి రిమాండ్‌కు పంపించారు.
12. ఓబులవారిపల్లె ఎస్‌ఐ సుజన్‌కుమార్..
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లెలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఎస్‌ఐ సుజన్‌కుమార్ దుర్మార్గంగా వ్యవహరించారు. అరాచకశక్తులకు కొమ్ముకాశారు. నామినేషన్ కేంద్రాల ప్రవేశ ద్వారాల వద్ద వందలాది మంది కూటమి కార్యకర్తలు గుంపులుగా చేరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకున్నారు. మహిళా ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పోలీసుల ఎదుటే చించివేశారు.
వాహనాల ధ్వంసం, మహిళా అభ్యర్థులపై దురుసు ప్రవర్తన, నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేత.. ఇలా మూడు రోజుల పాటు దాడులు కొనసాగినా ఎస్‌ఐ సుజన్‌కుమార్ అల్లరి మూకలను అదుపు చేయలేకపోయారు. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఏర్పాటు చేసిన మూడు ప్రవేశ ద్వారాల వద్ద ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూటమి కార్యకర్తలు గుంపులుగా చేరినా పోలీసులు వారిని చెదరగొట్టలేదు. వైఎస్సార్‌సీపీ మహిళా ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పోలీసుల ఎదుటే చించివేశారు.
ఎస్‌ఐ సుజన్‌కుమార్ అడ్డుకోలేదు. ఎంపీటీసీ అభ్యర్థి మౌనిక వాహనాన్ని ధ్వంసం చేసి, ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులు ప్రేక్షకుల్లా ఉండిపోయారు. మరుసటి రోజు ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మీదేవి నామినేషన్ పత్రాలను టీడీపీ కార్యకర్తలు లాక్కొని చించేశారు. పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. నామినేషన్ కేంద్రాల వద్ద దాడులకు దిగిన గుంపులను ఎస్‌ఐ సుజన్‌కుమార్ తరిమికొట్టలేదు. పోలీసుల నిర్లక్ష్యంతో దాడులు మరింత పెరిగి, కొందరు వైఎస్సార్‌సీపీ నాయకులు భయంతో నామినేషన్లు వేయకుండా వెనక్కి తగ్గారు.


