ఓబులవారిపల్లెకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గంజాయి బ్యాచ్, రౌడీలు
స్థానిక ఎన్నికల్లో అధికారపార్టీ అరాచకాలు కొనసాగిన దాడులు, దౌర్జన్యాలు
ఎస్‌ఈసీ చోద్యం.. పోలీసుల పక్షపాతం!
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, కార్యకర్తలే లక్ష్యంగా దౌర్జన్యాలు!
నెల్లూరులో ప్రతిపక్ష అభ్యర్థిపై కత్తులతో దాడి
పులివెందులలో కారుకు నిప్పు
తాడిపత్రిలో ప్రచారానికి పోలీసుల అడ్డంకులు
అనంతపురంలో ఉద్యోగులకు బెదిరింపులు
సాక్షి, అమరావతి/సాక్షి టాస్క్ ఫోర్స్: స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం కోసం అధికారపక్షం పేట్రేగిపోయింది. అంతులేని అరాచకాలకు పాల్పడింది. రాజ్యాంగం ప్రసాదించిన పోటీ చేసే పౌర హక్కుకు తూట్లు పొడిచింది. ఈ అకృత్యాలకు పచ్చ»ొట్టేసుకున్న ఖాకీలు అడుగడుగునా అండగా నిలిచారు. అక్రమ కేసులు, అరెస్టులతో చెలరేగిపోయారు. వీటిని అరికట్టాల్సిన ఎన్నికల కమిషన్ కూడా చేష్టలుడి చోద్యంచూసింది.
ఆద్యంతం అధికారపార్టీకి ఊడిగం చేసింది. ఫలితంగా బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలను వెన్నపోటు పార్టీ కొనసాగించింది. పులివెందులలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కారును తగులబెట్టడం, నెల్లూరులో ఆ పార్టీ అభ్యర్థిపై కత్తులతో దాడి చేయడం, తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి ఫయాజ్ బాషా ఎన్నికల ప్రచారాన్ని పోలీసులు అడ్డుకోడం, అనంతపురంలో కాంట్రాక్టు ఉద్యోగులపై మంత్రి స్థాయిలో ఒత్తిడి తేవడం వంటి దురాగతాలకు పాల్పడింది. ప్రజాస్వామ్యానికి గోరీ కట్టింది.
పులివెందులలో కారుకు నిప్పు
వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నగరిగుట్టలో 36వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త నాగరాజు కారును పచ్చమూకలు నిప్పుపెట్టి తగలబెట్టాయి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశానికి హాజరైనందుకు, పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నందున దుగ్ధతో ఈ ఘాతుకానికి టీడీపీ గూండాలు పాల్పడ్డారని నాగరాజు విమర్శించారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి వాస్తవాలు
నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు.
తాడిపత్రిలో పోలీసులు ఏక‘పచ్చ’ వైఖరి..
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఫయాజ్ బాషా ఎన్నికల ప్రచారానికి అడ్డంకులు సృష్టిస్తున్న పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఫయాజ్ బాషా ఎక్కడ ప్రచారం నిర్వహించినా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు అక్కడికి చేరుకుని రెచ్చగొడుతున్నారు. ఈ క్రమంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ పోలీసులు ఫయాజ్ బాషాను అడ్డుకుని ప్రచారం చేయనీయకుండా వెనక్కి పంపేస్తున్నారు.
జేసీ వర్గీయుల గుండాగిరిని చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న పోలీసులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక అభ్యర్థి ప్రచారానికి వెళ్లిన ప్రతిచోటా ప్రత్యర్థి వర్గం చేరుకుంటున్నప్పుడు, ఆ పరిస్థితిని నియంత్రించాల్సిన పోలీసులు బాధిత అభ్యర్థినే వెనక్కి పంపడం ఎంతవరకు సమంజసమని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రశి్నస్తున్నాయి.
రైల్వేకోడూరులో పోలీసుల సాక్షిగా అరాచకాలు
సాక్షి టాస్‌్కఫోర్స్: రైల్వే కోడూరు నియోజకవర్గంలో పోలీసుల సాక్షిగా టీడీపీ కూటమి గూండాలు చెలరేగిపోయారు. వీరిని అడ్డుకోవాల్సిన డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ వైఎస్సార్‌సీపీ నాయకులే లక్ష్యంగా అక్రమ కేసులు పెడతామని భయపెట్టారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను కూటమి నాయకులు అడ్డగించినా చూసీచూడనట్లు వివక్ష చూపారు. పోలీసు ఆంక్షలు, గూండాల దాడులతో పెనగలూరు, పుల్లంపేట, ఓబులవారిపల్లె మండలాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎవరూ నామినేషన్ వేయలేని పరిస్థితులు దాపురించాయి.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్ వేయాలంటే యుద్ధం చేయాల్సిన దుస్థితి నెలకొంది. అయినా పోలీసులు స్పందించలేదు. గట్టిగా నిలదీస్తే నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించినట్టు పోలీసులు
దండోరా వేయించారు. ఆ పరిధి దాటాక అభ్యర్థుల రక్షణ తమకు సంబంధం లేదంటూ ప్రకటించారు. ఇదే అదనుగా కూటమి నేతలు, రౌడీలు, అల్లరిమూకలు, గంజాయి బ్యాచ్‌లు రెచ్చిపోయాయయి. నామినేషన్ కేంద్రాల వద్ద మోహరించి దాడులకు పాల్పడ్డాయి. ప్రతిపక్ష నేతల నామినేషన్ పత్రాలు లాక్కొని, దాడిచేసి, బెదిరింపులకు దిగాయి.
నెల్లూరులో అభ్యర్థిపై కత్తులతో దాడి..
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఒకటో డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ కరిముల్లాపై మంగళవారం అర్ధరాత్రి దాటాక(బుధవారం తెల్లవారుజామున) సుమారు 3.30 గంటల సమయంలో ముఖాలకు మాస్కులు ధరించిన వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల వాతావరణాన్ని ప్రభావితం చేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందని వైఎస్సార్‌సీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన వారిని గుర్తించి పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
టీడీపీ నకిలీ నామినేషన్ల విత్‌డ్రాతో ఏకగ్రీవం డ్రామా..
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ వాళ్లే వైఎస్సార్‌సీపీ పేరుతో నకిలీ నామినేషన్లు వేయించి వాటిని విత్‌డ్రా చేయించుకోవడం ద్వారా ఏకగ్రీవం డ్రామాను రక్తికట్టించారు. మాచర్ల నియోజకవర్గంలో మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలకు 16 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అంటూ కరుడుగట్టిన టీడీపీ బ్యాచ్‌తో నామినేషన్లు వేయించారు. వాస్తవానికి వాటిలో ఏ ఒక్క చోట కూడా నిజమైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న పచ్చ గూండాలు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడి నామినేషన్ పత్రాలు చించేశారు. ఆ తర్వాత టీడీపీ వాళ్లే వైఎస్సార్‌సీపీ పేరుతో నకిలీ నామినేషన్లు వేయించి ఇప్పుడు వాటిని విత్ డ్రా చేసుకుని ఏకగ్రీవమంటూ జబ్బలు చరిచారు.


