పులివెందులలో బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి అట్టర్‌ ఫ్లాప్‌ షో | The meeting organized by the coalition in Pulivendula was a total flop | Sakshi
Sakshi News home page

పులివెందులలో బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి అట్టర్‌ ఫ్లాప్‌ షో

Oct 28 2026 7:20 PM | Updated on Oct 28 2026 7:48 PM

The meeting organized by the coalition in Pulivendula was a total flop

సాక్షి,వైఎస్సార్‌: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందులలో కూటమి పార్టీలు నిర్వహించిన బహిరంగ సభ తుస్సుమంది. స్థానిక ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ లభించకపోవడంతో ఈ సభ అట్టర్‌ ఫ్లాప్‌గా మిగిలింది.

స్థానిక పూల అంగళ్ల సర్కిల్‌లో ‘కూటమి గర్జన’ పేరిట టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సంయుక్తంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే, పులివెందుల గడ్డపై కూటమి పార్టీల ప్రభావం ఏమాత్రం లేకపోవడంతో సభకు జనం రాక కరవైంది. పట్టుమని వెయ్యి మంది కూడా హాజరు కాని దుస్థితి నెలకొంది.

పులివెందుల ప్రజల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, కూటమి నేతలు పరువు నిలుపుకునేందుకు నానా తంటాలు పడ్డారు. ఇందులో భాగంగానే పక్కనే ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ప్రత్యేక వాహనాల్లో జనాలను తరలించి సభను నింపే ప్రయత్నం చేశారు. ఆదినారాయణరెడ్డి అనుచరులు ఏకంగా వాహనాల్లో కర్రలు తీసుకుని మరీ పులివెందులకు చేరుకోవడం గమనార్హం.

ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని బలవంతంగా తరలించినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. కూటమి నేతలు బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి తదితరులు వేదికపై గొంతుచించుకుని ప్రసంగాలు చేసినా, కోటలు దాటిన ఆ ప్రసంగాలను వినేందుకు స్థానికులు ఎవరూ ఆసక్తి చూపలేదు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, అరాచకాలను గమనించిన పులివెందుల ప్రజలు.. ముందే వారిని ఛీకొట్టారు. ఎన్నికల ప్రచార సభను పూర్తిగా బహిష్కరించి, కూటమి నేతలకు గట్టి గుణపాఠం చెప్పారు. ఏది ఏమైనప్పటికీ, పులివెందులలో నిర్వహించిన ఈ సభ కూటమి నాయకుల వైఫల్యానికి నిదర్శనంగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement